|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభావతి డ్రామా బట్టబయలు! మీనా కన్నీళ్లు, బాలు ప్లాన్, శ్రుతి షాకింగ్ ఎంట్రీ!

Published: 18-06-2026, 12:58 AM
ప్రభావతి డ్రామా బట్టబయలు! మీనా కన్నీళ్లు, బాలు ప్లాన్, శ్రుతి షాకింగ్ ఎంట్రీ!
  • ప్రభావతి డ్రామాను బాలు, మీనా చాకచక్యంగా బయటపెట్టారు.
  • వంటల పేరుతో ప్రభావతి చేసిన కుట్రను మీనా పసిగట్టింది.
  • నీతు అసిస్టెంట్‌గా శ్రుతి ఎంట్రీ, రవిని కలవడమే లక్ష్యం.
  • చింతామణికి షాక్ ఇస్తూ మీనా కాంట్రాక్ట్ నిలబెట్టుకుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అభిమానులకు ఇది షాకింగ్ అప్‌డేట్! ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఉత్కంఠగా సాగింది. ప్రభావతి ఫేక్ డ్రామా బట్టబయలు కావడంతో మీనా కన్నీళ్లు పెట్టుకుంది. బాలు ఇచ్చిన గుణపాఠం, శ్రుతి ఎంట్రీతో రచ్చ మామూలుగా లేదు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

ప్రభావతి ఫేక్ డ్రామా బట్టబయలు!

Gunde Ninda Gudi Gantalu Serial June 18th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 18వ ఎపిసోడ్‌‌లో రవి ఓనర్ నీతు దగ్గర శ్రుతి అసిస్టెంట్‌గా జాయిన్ అవుతుంది. ప్రభావతిది ఫేక్ డ్రామా అని మీనా తెలుసుకుంటుంది. బాలు వచ్చి మెడలో దండ వేసి జరిగింది బయటపెడతాడు. దాంతో సత్యం కొట్టడానికి చేయి ఎత్తుతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనాతో చేయి నొప్పి అని ఫేక్ డ్రామా ఆడిన ప్రభావతి తను వండిన కూరలు వద్దని, క్యారెట్ ఫ్రై, టొమాటో రైస్ చేయమంటుంది. ఆదరబాదరగా కాకుండా నిదానంగా చేయమని చెబుతుంది అత్త ప్రభావతి .

మొత్తం మండపం డెకరేషన్‌ను బాలు చూపిస్తాడు. శభాష్ మీనా నువ్వు సాధారణమైనదానివి కాదు. మేనేజర్ కూడా షాక్ అయ్యారు అని బాలు అంటాడు. మీరు ఉన్నారు, సుమతి చూసుకుంది. మీరంతా ఉన్నారు. మీరందరు ఉన్నారు కాబట్టే అది సాధ్యమైందని మీనా సంతోషిస్తుంది. మరోవైపు ఈ ప్రభావతి తలుచుకుంటే ఏమైనా చేయగలదు. దాని డెకరేషన్ కాంట్రాక్ట్ పోగొట్టాను అని మురిసిపోతూ గట్టిగా నవ్వుతుంది ప్రభావతి.

ఇంతలో ప్రభావతికి చింతామణి కాల్ చేసి ఏం ఊడబూడ్చారు అని అంటుంది. ఇంటి దగ్గరే ఆపేశాను అని ప్రభావతి అంటుంది. మీనా అక్కడే ఉంది. నాకన్న తెలివిగా ఆలోచించింది. నీ కొడుక్కి వీడియో కాల్ చేసి అందరితో పనులు చేయించింది. సాధించింది నీ కోడలు. గ్రాండ్‌గా డెకరేషన్ చేసి పేరు తెచ్చుకుందని చింతామణి చెబుతుంది.

మరోవైపు ఒకరిని నీతు ఇంటర్వ్యూ చేస్తుంది. తను 50 వేలు శాలరీ అడుగుతుంది. దానికి షాక్ అవుతుంది నీతు. ఇంతలో రవి వస్తాడు. రవికి తెలిసి కూడా షాక్ అవుతాడు. రవి తను శాలరీ గురించి కాకుండా డ్రీమ్, అనుభవం కోసం వర్క్ చేస్తున్నట్లు చెబుతాడు. మరికొంతమందిని ఇంటర్వ్యూ చేసి నాకు అసిస్టెంట్‌గా ఎవరు నచ్చరు.

మీనా కన్నీళ్లు, బాలు గుణపాఠం

దాంతో నీతు తలపట్టుకుని కూర్చుంటే శ్రుతి వచ్చి అసిస్టెంట్‌గా జాబ్ చేస్తానంటుంది. డబ్బింగ్ ఉంది కదా అని నీతు అంటే.. పార్ట్ టైమ్ కదా. నాకేం ఇబ్బంది లేదు. నిజం చెప్పాలంటే రవి కోసం వస్తున్నాను. మా మధ్య టైమ్ గ్యాప్ వస్తుందని, ఇక్కడ ఉంటే టైమ్ స్పెండ్ చేయొచ్చని, మళ్లీ ఇక్కడ రవి వర్క్ చేసే విధానం చూడాలని ఉందని శ్రుతి అంటుంది.

నీతు కూడా వచ్చి నిజమని చెబుతుంది. కాసేపు వాదించుకుని శ్రుతికి రవి వెల్‌కమ్ చెబుతాడు. మరోవైపు పూలదండ పట్టుకుని వచ్చి అందరిని పిలిచి ప్రభావతికి సన్మానం చేయాలని బాలు అంటాడు. ఎందుకని సత్యం అడిగితే.. ఇలాంటి స్త్రీ మూర్తి, దేవమూర్తి ఉంటే ఇల్లు వెలిగిపోతుందని, ప్రభావతి మెడలో దండ వేస్తాడు. అంతా చప్పట్లు కొడతారు.

అమ్మ ఎంతటి ఘనకార్యం చేసిందో తెలుసా అని బాలు అంటే.. ఎందుకు చేశారు ఆ పని అని మీనా నిలదీస్తుంది. ఏ పని అని ప్రభావతి అంటే.. చేయి విరిగిందని ఎందుకు నాటకం ఆడారు. నీ కొడుకు, కోడలు పైకి వస్తున్నారంటే ఆనందపడాలని కానీ ఇంతలా దిగజారాల అత్తయ్య అని మీనా అంటుంది. ఏం చేసిందని సత్యం అడుగుతాడు.

మనోజ్, రోహిణి అడ్డుపడితే అత్త చరిత్ర చెప్పమంటావా అని శ్రుతి పంచ్ ఇస్తుంది. కోడలు సంపాదిస్తే నీకేంటీ కడుపు మంట అని రవి అంటాడు. నాకు నిజంగానే చేయి బెణికిందని ప్రభావతి అంటుంది. అలా అయితే హాస్పిటల్‌కు వెళ్లాలిగా. మీనానే ఎందుకు ఆపాలని శ్రుతి, రవి అంటుంది. అసలు డ్రామా ఆడిందని మీకెవరు చెప్పారని మనోజ్ అంటాడు.

శ్రుతి షాకింగ్ ఎంట్రీ, రవి ప్లాన్

డెకరేషన్‌కు వెళ్లకుండా ఆపానని ఎవరితోనో ఫోన్‌లో చాలా గర్వంగా చెప్పారు. నా చెవులారా విన్నాను, కళ్లారా చూశాను. ఆ మోసం చూసి తట్టుకోలేకపోయాను. ఏడ్చాను. అదే నన్ను కన్నతల్లి అయితే ఆపేదా అని బాధపడ్డాను అని మీనా అందరిని ఏడిపించేస్తుంది. నాకు చెప్పుకుని ఏడ్చింది. నీ చేయి బెణికిందంటే కూతురులా చూసుకుంది. అప్పుడైనా ఇది తప్పని అనిపించలేదా అని బాలు అంటాడు.

నోర్మూయ్ అని గట్టిగా అరుస్తూ భార్య ప్రభావతిపై చేయి ఎత్తుతాడు సత్యం. అంతా షాక్ అవుతారు. నీది ఆడజన్మేనా. నీది కన్న కడుపునే. మూడు పూటల అన్నపూర్ణలా అన్నం పెడుతున్న మనిషికి కష్టం తలపెడతావా. రేపు కాళ్లు చేయి పడిపోతే గంజి కూడా పోసే దిక్కులేకా చస్తావ్. మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావ్. నీ మెడలో దండ ఎందుకే అని పూలదండను లాగేస్తాడు సత్యం.

నేను వండట్లేదా అని మీనా అంటే.. అంతా ఉడికిఉడకని కూరలు, ఎవరైనా తినేలా ఉంటున్నాయా అని ప్రభావతి అంటుంది. మనోజ్ తనకు వడ్డించదంటాడు. ఏదోటి చేస్తే అయిపోతుందనుకుంటుంది అని రోహిణి అంటుంది. ఆపండి. మనుషుల్లా మాట్లాడుతున్నారా. ఎంత పని ఉన్నా అందరికి కమ్మంగా వండిపెడుతుంది. అలాంటిదాన్ని పట్టుకుని ఇలా అంటారా అని బాలు అంటాడు.

కానీ, ఇలా చేసినందుకు నీకు మంచి గుణపాఠం చెప్పకుండా వదిలే ప్రసక్తే లేదు అని ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు బాలు. మీనాను తీసుకెళ్లిపోతాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ అభిమానులకు పండగే! ప్రభావతి ప్లాన్ బెడిసికొట్టడం, మీనా ధైర్యం, శ్రుతి కొత్త పాత్రతో సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. మరిన్ని ఉత్కంఠభరితమైన మలుపుల కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.