|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్‌ డైరెక్టర్‌తో పెళ్లికి రెడీ అయిన భానుప్రియ.. మధ్యలో చెడగొట్టింది ఎవరో తెలుసా?

Published: 20-07-2025, 8:54 AM
స్టార్‌ డైరెక్టర్‌తో పెళ్లికి రెడీ అయిన భానుప్రియ.. మధ్యలో చెడగొట్టింది ఎవరో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటి భానుప్రియ గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు వంశీతో ఆమె రెండో వివాహం చేసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది.

Key Points

1

భానుప్రియ, వంశీ దర్శకత్వంలోని సితార సినిమాతో తెలుగు తెరకు పరిచయం.

2

వంశీతో రెండో వివాహం కోసం భానుప్రియ తన తల్లిదండ్రులకు చెప్పింది.

4

తల్లి వ్యతిరేకత కారణంగా పెళ్లి ప్రతిపాదన వాయిదా పడింది.

భానుప్రియ కెరీర్ ప్రయాణం

భానుప్రియ క్లాసికల్‌ మూవీస్‌తో ఎక్కువగా అలరించిన నటి. ఒకప్పుడు టాలీవుడ్‌ బిగ్‌ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది. అడపాదడపా గ్లామర్‌ రోల్స్ చేసినా చాలా వరకు ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపించి అలరించింది.

హుందాతనంతో కూడిన పాత్రలు చేసి మెప్పించింది. తమిళంలో హీరోయిన్‌ గా పరిచయం అయిన భానుప్రియని `సితార` సినిమా కోసం తెలుగులోకి తీసుకొచ్చారు దర్శకుడు వంశీ.

చాలా మంది భానుప్రియని చూసి రిజెక్ట్ చేసినా, తాను మాత్రం ఆమెని నమ్మారు. పట్టుపట్టి ఆమెని తెలుగుకి పరిచయం చేశారు. స్టార్‌ హీరోయిన్‌ని చేశారు.

తొలి చిత్రం `సితార`తోనే ఆకట్టుకుంది భానుప్రియ.  అదే సమయంలో తన అద్భుతమైన నటనతో మెప్పించింది. తొలి చిత్రంతోనే తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. బిజీగా రాణించింది.

ఇక వరుసగా `అన్వేషణ`, `విజేత`, `దొంగమొగుడు`, `స్వర్ణకమలం`, `ఖైదీ నెం 786`, `స్టేట్‌ రౌడీ` వంటి వందల చిత్రాల్లో నటించింది. ఏఎన్నార్‌, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ, సుమన్‌, రాజేంద్రప్రసాద్‌ వంటి హీరోలకు జోడీగా నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది భానుప్రియ.

వంశీతో వివాహ ప్రతిపాదన

అయితే తెలుగులో భానుప్రియకి లైఫ్‌ ఇచ్చింది దర్శకుడు వంశీ. ఆమెని తెలుగులోకి పరిచయం చేయడమే కాదు, తనకు అవసరమైనప్పుడు కెరీర్‌ పరంగా పుష్‌ ఇచ్చారు. ఆమెని గ్లామర్‌గా చూపించింది ఆయనే, క్లాసికల్ డాన్స్ గా ఆవిష్కరించింది ఆయనే.

కెరీర్‌ని మలుపు తిప్పడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. దీంతో వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే ఆ అనుబంధంతో భానుప్రియని పెళ్లి చేసుకోవాలనుకున్నారట దర్శకుడు వంశీ.

దర్శకుడు వంశీకి ఆల్‌రెడీ పెళ్లైంది, పిల్లలు కూడా ఉన్నారు. అయినా భానుప్రియతో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. అంతేకాదు ఏకంగా భానుప్రియ పెద్ద వాళ్లతో మాట్లాడారు. ఇంట్లో ఈ విషయాన్ని చెప్పింది భానుప్రియ.

దీంతో పేరెంట్స్ ఒప్పుకోలేదట. ముఖ్యంగా భానుప్రియ అమ్మ మ్యారేజ్‌ చేసుకోవడానికి వీల్లేదని చెప్పింది. భాను ప్రియని చాలా కట్టడి చేసిందట.

`వంశీకి ఆల్‌రెడీ మ్యారేజ్‌ అయ్యింది. పిల్లలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడమేంటి` అని మందలించిందట భానుప్రియ మదర్‌.

తల్లి వ్యతిరేకత మరియు పెళ్లి వాయిదా

ఆమె బలంగా ఈ పెళ్లిని వ్యతిరేకించడంతో అటు భానుప్రియా, ఇటు వంశీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అమ్మ కారణంగానే ఆ మ్యారేజ్‌ ఆలోచన విరమించుకున్నట్టు చెప్పింది భానుప్రియ.

అమ్మ తనని అన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేసేదని వెల్లడించింది భానుప్రియ. ఈ విషయాన్ని ఐడ్రీమ్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ తెలిపింది. అలా భానుప్రియతో దర్శకుడు వంశీ రెండో పెళ్లి వ్యవహారం క్లోజ్‌ అయ్యింది.

ఆ తర్వాత భానుప్రియ.. 1998లో డిజిటల్‌ గ్రాఫిక్ ఇంజనీర్ ఆదర్శ్‌ కౌశల్‌ని వివాహం చేసుకుంది. కాలిఫోర్నియాలో వీరి మ్యారేజ్‌ జరిగింది. వీరికి కూతురు అభినయ ఉంది.

భానుప్రియ భర్త ఆదర్శ్‌ 2018లో గుండెపోటుతో మరణించారు. దీంతో ఆమె ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. తన కూతురుతో కలిసి చెన్నైలో ఉంటున్నట్టు తెలుస్తోంది.

చివరకు, భానుప్రియ తల్లి వ్యతిరేకత కారణంగా వంశీతో వివాహం జరగలేదు. తన తల్లి తనను ఎల్లప్పుడూ కాపాడుకుంటుందని భానుప్రియ తెలిపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.