|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’: సెకండాఫ్‌లో కామెడీ బ్లాస్టింగ్! హీరోయిన్స్ గ్లామర్ ట్రీట్!

Published: 13-01-2026, 1:15 AM
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి': సెకండాఫ్‌లో కామెడీ బ్లాస్టింగ్! హీరోయిన్స్ గ్లామర్ ట్రీట్!
  • రవితేజ ఎనర్జీతో వెన్నెల, సత్య కామెడీ అదుర్స్, సినిమాకు ప్లస్ పాయింట్!
  • భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో ఆషికా గ్లామర్ హైలైట్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫిదా!
  • ఫస్టాఫ్ స్లోగా ఉన్నా, సెకండాఫ్‌లో కామెడీతో దుమ్ము రేపిన రవితేజ సినిమా!
  • డింపుల్ హయాతి, సత్య పాత్రలు ఆశించిన స్థాయిలో లేకపోయినా ఓవరాల్‌గా మూవీ జస్ట్ ఓకే!

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు ట్విట్టర్లో వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆడియన్స్ పండగ చేసుకుంటున్నారు. అసలు ఈ సినిమాలో ఏముందో చూద్దాం రండి!

ట్విట్టర్‌లో రవితేజ మూవీ రివ్యూలు!

సంక్రాంతి 2026కు మరో సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఇవాళ రవితేజ హీరోగా యాక్ట్ చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రిలీజైంది. విదేశాల్లో ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో సినిమా ఎలా ఉందో పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీ ట్విటర్ రివ్యూపై ఓ లుక్కేయండి.

వరుసగా మాస్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లతో, రొటీన్ స్టోరీలతో పెద్ద దెబ్బే తిన్నాడు రవితేజ. ఆయనకు వరుసగా ఫ్లాప్ లు వచ్చాయి. ఇప్పుడు హిట్ కోసం రూట్ మార్చి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ థియేటర్లకు వచ్చాడు. సంక్రాంతి 2026 సందర్బంగా ఇవాళ (జనవరి 13) రిలీజైంది ఈ మూవీ. మరి ట్విటర్ రివ్యూలో ఎలా ఉందో చూద్దాం.

సెకండాఫ్‌లో అదిరిపోయే కామెడీ సీన్స్!

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విటర్ రివ్యూ

‘‘రవన్న ఎనర్జీ.. వెన్నెల, సత్య కలిసి మూవీని కాపాడారు. పాటలు ఓకే. కామెడీ బాగుంది’’ అని మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

హీరోయిన్స్ గ్లామర్ షోతో రచ్చ!

‘‘భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓ డీసెంట్ మూవీ. స్టోగా స్టార్ట్ అయి సెకండాఫ్ లో పుంజుకుంది. రవితేజ ఎనర్జీ, ఆషికా గ్లామర్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. సినిమాలో క్యూటెస్ట్ పార్ట్ అషికానే. డింపుల్ హయాతి, సత్య అంచనాలను అందుకోలేకపోయారు. ఓవరాల్ గా చూస్తే జస్ట్ ఓకే’’ అని మరో యూజర్ పేర్కొన్నాడు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.