|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఢిల్లీలో దారుణం: చిన్నారిపై అఘాయిత్యం! భగ్గుమన్న భూమి ఫెడ్నెకర్! వైరల్ కామెంట్స్!

Published: 29-01-2026, 10:05 PM
ఢిల్లీలో దారుణం: చిన్నారిపై అఘాయిత్యం! భగ్గుమన్న భూమి ఫెడ్నెకర్! వైరల్ కామెంట్స్!
  • ఢిల్లీలో ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం ఘటనతో దేశం ఉలిక్కిపాటు!
  • నటి భూమి ఫెడ్నెకర్ దిగ్భ్రాంతి, నేరస్థులకు భయం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం!
  • మూగజీవాలను శిక్షించే ఆసక్తి ఆడపిల్లల రక్షణలో లేదని భూమి ప్రశ్న!
  • ఘటనపై సోషల్ మీడియాలో దుమారం, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్!

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక దారుణ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆరేళ్ల పసిపాపపై జరిగిన అమానుష దాడిపై బాలీవుడ్ నటి భూమి ఫెడ్నెకర్ తీవ్రంగా స్పందించారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఢిల్లీ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం

దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అమానవీయ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆరేళ్ల పసిప్రాయం అని కూడా చూడకుండా ముగ్గురు మైనర్ బాలురు ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై పౌర సమాజం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ కల్పించాల్సిన చోటే చిన్నారులకు నరకం ఎదురవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.​ తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ నటి భూమి ఫెడ్నెకర్ (Bhumi Pednekar)సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వెల్లడిస్తూ.. నేరస్థులకు చట్టాలన్నా, సమాజమన్నా భయం లేకుండా పోతోందని మండిపడ్డారు.

భూమి ఫెడ్నెకర్ సంచలన వ్యాఖ్యలు

పసి ప్రాణాలకు కనీస రక్షణ కల్పించడంలో మనం ఘోరంగా విఫలమవుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 10 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న బాలురు ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం మన విద్యా వ్యవస్థ, పెంపకం ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఫైర్ అయింది. ముఖ్యంగా దేశంలో వీధి కుక్కల సమస్యలపై గంటలు తరబడి చర్చలు జరుపుతున్న జనాలు.. అంతకంటూ క్రూరంగా ప్రవర్తించే మృగాల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించింది. అలాగే మూగజీవాలను శిక్షించడానికి చూపించే ఆసక్తి ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో ఎందుకు కనపించదు? అని అన్నది.

సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న పోస్ట్

ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన చిన్నారిని నిర్భందించి, నోట్లో గుడ్డలు కుక్కి హింసించడం అత్యంత దారుణం అని విమర్శించింది. మన చుట్టూ జరుగుతున్న ఇటువంటి అఘాయిత్యాలను చూస్తుంటే సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తోందని ఆమె తన పోస్ట్‌లో పేర్కంది. ఢిల్లీలో జరిగిన ఈ ఘాతుకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. భూమి ఫెడ్నెకర్ చేసిన పోస్ట్ వైరల్ కావడంతో, నెటిజన్లు సైతం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం చట్టాలు ఉంటే సరిపోదని, నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించేలా శిక్షలు ఉండాలని బాధితురాలి కుటుంబానికి అండగా పోస్టులు పెడుతున్నారు.

భూమి ఫెడ్నెకర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.