
📌 Key Points
- భూమిక హీరోయిన్ కావడానికి నాగార్జున మేనకోడలు సుప్రియ కారణమని వెల్లడి.
- సుప్రియ ఒక వాణిజ్య ప్రకటనలో భూమికను చూసి హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు.
- గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’ సినిమాలో భూమిక కీలక పాత్ర పోషిస్తున్నారు.
- పిల్లలను ఓర్పు, సహనంతో దారిలోకి తెచ్చుకోవచ్చని అమ్మ ద్వారా తెలుసుకున్నానని భూమిక అన్నారు.
ప్రముఖ హీరోయిన్ భూమిక ఒక సంచలన విషయం బయటపెట్టింది. నాగార్జున మేనకోడలు సుప్రియ వల్లే తాను హీరోయిన్ అయ్యానని తెలిపింది. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘యుఫోరియా’ సినిమాలో ఆమె నటిస్తోంది.
హీరోయిన్‌గా అవకాశం ఎలా వచ్చిందంటే?
Bhumika:ప్రముఖ స్టార్ హీరోయిన్ భూమిక (Bhumika Chawla) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘ఖుషి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో వచ్చే నడుము సీన్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది భూమిక. అంతేకాదు ఇప్పటికీ ఈ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు భూమికను గుర్తు చేస్తూనే ఉంటారు బుల్లితెర సెలబ్రిటీలు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పెద్దింటి మేనకోడలి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్గా మారాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్(Gunasekhar ) చివరిగా సమంతతో శాకుంతలం సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుణశేఖర్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సామాజిక అంశాల మేళవింపుతో ‘యుఫోరియా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో భూమిక కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న భూమిక తన కెరియర్ గురించి చెప్పుకొచ్చింది. భూమిక మాట్లాడుతూ..” నేను నటించిన ఒక వాణిజ్య ప్రకటనను నాగార్జున(Nagarjuna ).మేనకోడలు సుప్రియ(Supriya ) చూసి నన్ను హైదరాబాద్ కి రమ్మని పిలిచింది. అక్కడికి వెళ్లాక స్క్రీన్ టెస్ట్ చేసి వాళ్ళు తీయబోయే ‘యువకుడు’ సినిమాకు నన్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. అలా ఆమె వల్లే నేను టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యాను “అంటూ సుప్రియ వల్లే తాను ఇండస్ట్రీలో హీరోయిన్గా అవతరించాను అంటూ చెప్పుకొచ్చింది.
‘యుఫోరియా’ సినిమాలో భూమిక
అయితే సినిమా రంగంలోకి వెళ్తానని ఇంట్లో చెప్పినప్పుడు అమ్మ నాన్న కాస్త భయపడ్డారు. కానీ నా ఆసక్తిని చూసి వారు కాదనలేకపోయారు. ఇక మోడలింగ్ తో పాటు ప్రకటనలు కూడా చేసేదాన్ని. అయితే అవకాశాలు అంత తేలిగ్గా వచ్చేవి కాదు. స్క్రీన్ టెస్ట్ కి వెళ్ళిన ప్రతి చోట కూడా తీవ్రమైన పోటీ ఉండేది. అయినా సరే నిరంతర ప్రయత్నాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఇక పిల్లల విషయానికొస్తే.. మొదటి నుంచి నాకు చాలా ఓపిక ఎక్కువ. అయితే బాబు పుట్టాక వాడి అల్లరి కి తట్టుకోలేక ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేది.. అప్పుడు అమ్మే నాకన్నీ సర్ది చెప్పేది. అలా అమ్మ ద్వారా తిట్టడం, కొట్టడం కంటే ఓర్పు, సహనంతోనే పిల్లలను దారిలోకి తెచ్చుకోవచ్చని తెలుసుకున్నాను” అంటూ తెలిపింది భూమిక చావ్లా. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
పిల్లల పెంపకంపై భూమిక కామెంట్స్
ఇక ఇదే ఇంటర్వ్యూలో అభిమానులపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడేళ్ల కిందట నా స్నేహితురాలు, డబ్బింగ్ ఆర్టిస్టు సవిత రాధాకృష్ణన్ ను అనుకోకుండా కలిశాను. అప్పుడు మా మాటల్లో ఖుషీ సినిమా రోజులను గుర్తు చేసుకున్నాము. అందులోని “అమ్మాయే సన్నగా” అనే పాటకు సరదాగా స్టెప్పులు వేసాము. ఆ వీడియోని సోషల్ మీడియాలో అలా పెట్టానో లేదో అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా వచ్చి పాతికేళ్ళైనా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు నామీద చూపుతున్న అభిమానాన్ని నమ్మలేకపోతున్నాను అంటూ తెలిపింది. మొత్తానికైతే ఇప్పుడు మళ్లీ యుఫోరియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న భూమికను తెలుగు ప్రేక్షకులు మరింత ఆదరిస్తారని ఆమె ఆకాంక్షిస్తోంది.
భూమిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె సినీ కెరీర్ ఆరంభం గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఆమె పంచుకున్న విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

