|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌బాస్ మోసం: సుమన్ శెట్టి భార్య కన్నీళ్లు, తనూజ విషయంలో నన్ను బ్యాడ్ చేశారన్న నటుడు!

Published: 27-12-2025, 11:21 AM
బిగ్‌బాస్ మోసం: సుమన్ శెట్టి భార్య కన్నీళ్లు, తనూజ విషయంలో నన్ను బ్యాడ్ చేశారన్న నటుడు!
  • బిగ్‌బాస్ తెలుగు 9 నుండి 14వ వారంలో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు.
  • తనను తనూజ విషయంలో నెగటివ్‌గా చూపించారని సుమన్ శెట్టి బిగ్‌బాస్‌పై ఆరోపణ.
  • తప్పుడు ప్రచారం కారణంగా తన భార్య మూడు రోజులు అన్నం తినకుండా కన్నీళ్లు పెట్టుకుందని వెల్లడి.
  • ఫ్యామిలీ వీక్‌లో సబ్‌టైటిల్స్ తప్పుగా వేసి బిగ్‌బాస్ మోసం చేసిందని సుమన్ శెట్టి పేర్కొన్నారు.

బిగ్‌బాస్ తెలుగు 9 మాజీ కంటెస్టెంట్ సుమన్ శెట్టి బిగ్‌బాస్ పై సంచలన ఆరోపణలు చేశారు. తనూజ విషయంలో తనను తప్పుగా చూపించి, తన భార్య కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ మోసంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

సుమన్ శెట్టి సంచలన ఆరోపణలు

బిగ్‌ బాస్ తెలుగు 9 ముగిసింది. కళ్యాణ్‌ పడాల విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సుమన్‌ శెట్టి 14వ వారం హౌజ్‌ ని వీడాడు. టాప్‌ 5 ఎంపికకి ముందే ఆయన ఎలిమినేట్‌ అయ్యాడు. టాప్ 5లో ఉంటాడనుకున్న సుమన్‌ శెట్టి అనూహ్యంగా హౌజ్‌ని వీడటం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆడియెన్స్ అంతా ఆయన కచ్చితంగా టాప్‌ 5లో ఉంటాడనుకున్నారు. కానీ అలా జరగలేదు. కళ్యాణ్‌తోపాటు తనూజ, ఇమ్మాన్యుయెల్‌, సంజనా, డీమాన్‌ పవన్‌ టాప్‌ 5లో ఉన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా సుమన్‌ శెట్టి బిగ్‌ బాస్‌ పై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. తనని బ్యాడ్‌ చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనూజ విషయంలో తనని నెగటివ్‌ చేశారని, దీని కారణంగా తన భార్య మూడు రోజులు అన్నం తినకుండా కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. మరి ఇంతకి ఏం జరిగిందంటే? ఫ్యామిలీ వీక్‌లో సుమన్‌ శెట్టి భార్య నాగ భవాని వచ్చింది. ఆమె సుమన్‌ శెట్టి ఆట గురించి పాజిటివ్‌గా చెప్పింది. బాగా ఆడుతున్నావని పేర్కొంది. అదే సమయంలో తనూజ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వారికి దూరంగా ఉండాలని తెలిపింది. ఈ విషయాన్ని ఆ రోజు ఎపిసోడ్‌లో సబ్‌ టైటిల్స్ లో వేశారు. ఇది అందరిని షాక్‌కి గురి చేసింది.

తనూజ-సుమన్ శెట్టి వివాదంపై వివరణ

ఇదిలా ఉంటే ఇదే ప్రశ్న ఇప్పుడు సుమన్‌ శెట్టికి ఎదురయ్యింది. యాంకర్‌ శివకి ఇచ్చిన ఐడ్రీమ్‌ ఇంటర్వ్యూలో సుమన్‌ శెట్టి దీనికి స్పందిస్తూ, `అది చాలా తప్పుగా పోట్రే అయ్యిందని చెప్పాడు. తను నిజానికి నాతో చెప్పిందేంటంటే? తనూజ వాళ్లు బాగా ఆడుతున్నారు, నువ్వు వాళ్ల కంటే ఇంకా బాగా ఆడండి అని మాత్రమే చెప్పింది. సాధారణంగా మిగిలిన విషయాలకు సబ్‌ టైటిల్స్ లేవు, కానీ ఆ సమయంలో సబ్‌ టైటిల్స్ వేశారు. ఎందుకేశారు?. వినపడలేదని వేశారు, కానీ ఆమె చెప్పింది అది కాదు. మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా ఎఫర్ట్స్‌ పెట్టండి, వాళ్ల కంటే ఇంకా బాగా ఆడాలని చెప్పింది. కానీ దాన్ని రాంగ్‌గా చూపించారు` అని తెలిపారు సుమన్‌ శెట్టి.

`ఇది చాలా బ్యాడ్‌గా బయటకు వెళ్లింది. దీంతో తన వల్ల నాకు బ్యాడ్‌ జరిగిందని, మూడు నాలుగు రోజులు ఏం తినకుండా కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. ఈ విషయాన్ని అమ్మ నాకు చెప్పింది. నా వల్ల ఆయనకు మైనస్‌ అయ్యిందని చాలా ఫీలయ్యింది. నేను బయటకు వచ్చాక ఆమెని ఓదార్చాను. లేదు బంగారం నువ్వు అలా కాదురా, నీ గురించి నాకు తెలియదా? నీ మొగుడిని దించేద్దామని చూస్తావా? అని సర్ధి చెప్పాను. నేను ఇక్కడి వరకు వచ్చానంటే నా భార్య, నా ఫ్యామిలీ, నా అభిమానుల వల్లే, నాకు పీఆర్‌ లేరు. నేను ఆడియెన్స్ ఓట్ల ద్వారానే ఇక్కడి వరకు వచ్చాను. అయితే దీనివల్లే టాప్‌ 5లో ఉండాల్సిన నేను ముందుగానే బయటకు వచ్చానని అంటే దాన్ని నేను ఒప్పుకోను. అది జరిగింది 11వ వారంలో, నేను వచ్చింది 14వ వారంలో, ఆ ప్రభావం ఉంటే, వెంటనే బయటకు రావాలి కదా అని తెలిపారు సుమన్‌ శెట్టి. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

భార్య కన్నీళ్లకు కారణం ఏంటి?

మొత్తంగా బిగ్‌ బాస్‌ సుమన్‌ శెట్టిని తప్పుగా చూపించాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. నిజానికి అప్పటి వరకు సుమన్‌ శెట్టిపై అందరిలోనూ పాజిటివ్‌ ఒపీనియన్‌ ఉంది. ఆ సమయంలో ఆయన భార్య అలా అనడం ఆశ్చర్యపరిచింది. ఎందుకు ఆమె ఇలా మాట్లాడిందనేది అర్థం కాలేదు. అది కాస్త సుమన్‌ శెట్టికి ఎఫెక్ట్ అయ్యిందనేది నిజం. ఆయనపై ఉన్న పాజిటివిటీ తగ్గింది చెప్పొచ్చు. ఇక ఇప్పుడు బిగ్‌ బాస్‌ షో వల్లే తనకు మంచి ఇమేజ్‌ క్రియేట్‌ అయ్యిందని, ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఇదే కారణమని తెలిపారు సుమన్‌ శెట్టి.

సుమన్ శెట్టి ఆరోపణలు బిగ్‌బాస్ షో విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తనను తప్పుగా చూపడం వల్ల భార్య పడిన బాధను ఆయన వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై బిగ్‌బాస్ నిర్వాహకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.