|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss 19: ప్రోమోతో షాకిచ్చిన బిగ్‌బాస్.. తీరా చూస్తే

Published: 07-10-2025, 3:47 AM
Bigg Boss 19: ప్రోమోతో షాకిచ్చిన బిగ్‌బాస్.. తీరా చూస్తే

బిగ్‌బాస్ 19 హిందీ ప్రోమోలో టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నట్లు చూపించారు. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. తీరా చూస్తే దీపక్ సోదరి మాలతి చాహర్ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టింది. ఆమె నేపథ్యం, సినీ కెరీర్, మోడలింగ్ ప్రస్థానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

బిగ్‌బాస్ 19 ప్రోమోలో దీపక్ చాహర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కనిపించారు.

2

అతని సోదరి మాలతి చాహర్ నిజమైన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ప్రవేశించింది.

4

ఐపీఎల్ 2019, బాలీవుడ్ సినిమాలతో ఆమెకు గుర్తింపు వచ్చింది.

బిగ్‌బాస్ ప్రోమో షాక్: అసలు మతలబు ఏమిటి?

బిగ్‌బాస్ షో హడావుడి ప్రస్తుతం నడుస్తోంది. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ టెలికాస్ట్ అవుతోంది. హిందీలోనూ కొన్ని వారాల క్రితమే 19వ సీజన్ మొదలైంది. అయితే లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ వస్తున్నట్లు చూపించారు. దీంతో చాలామంది షాకయ్యారు. తీరా చూస్తే ఇతడి సోదరి మాలతి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ మాలతి సంగతేంటి?

ఉత్తరప్రదేశ్‌కి చెందిన దీపక్ చాహర్.. ఐపీఎల్‌లో చెన్నై జట్టుకి ఆడినప్పుడు చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై టీమ్‌కి ఆడుతున్నాడు. అయితే లేటెస్ట్‌గా ప్రసారమైన హిందీ బిగ్‍‪‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో తొలుత ఇతడు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తన సోదరిని సపోర్ట్ చేసేందుకు వచ్చానని చెప్పడంతో రిలాక్స్ అయ్యారు.

ఎవరీ మాలతి చాహర్? ఆమె నేపథ్యం

రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా మాలతి చాహర్.. బిగ్‌బాస్ 19లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు దీపక్ చాహర్ అక్కగా తనకు గుర్తింపు ఉందని, ఈ షోలో ఆడి సొంత గుర్తింపు తెచ్చుకోవాలనేది తన ప్రయత్నమని చెప్పుకొచ్చింది. మాలతి విషయానికొస్తే.. ఇంజనీరింగ్ చదివినప్పటికీ మోడలింగ్‌ వైపు వచ్చింది. పలు ఫ్యాషన్ పోటీల్లోనూ పాల్గొంది. 2014లో ఫెమినా మిస్ ఇండియా ఢిల్లీ రెండో రన్నరప్‍‌గా నిలిచింది. అయితే 2019లో ఐపీఎల్ సందర్భంగా చెన్నై జట్టుకు చీర్స్ చెబుతూ కెమెరా కంటపడి సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకుంది.

2018లో ‘జీనియస్’ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సదా వియా హోజీ, మా ఓ మేరీ మా తదితర చిత్రాల్లోనూ నటించింది. ఓవైపు నటిస్తూనే మరోవైపు దర్శకత్వం, నిర్మాణ రంగల్లోనూ ప్రవేశించింది. ‘ఓ మారీ’ అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. ఇన్ స్టాలోనూ ఈమెకు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. మరి బిగ్‌బాస్ షోతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి?

బిగ్‌బాస్‌లో మాలతి: అంచనాలు, భవిష్యత్తు

దీపక్ చాహర్ పేరుతో వచ్చిన మాలతి చాహర్ బిగ్‌బాస్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆమె ఆశ ఎంతవరకు నెరవేరుతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె ప్రయాణం బిగ్‌బాస్‌కు కొత్త మలుపు ఇస్తుందేమో!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.