
బిగ్ బాస్ 9 కి ముందుగా అగ్నిపరీక్ష పేరుతో ఒక షో రానుంది. అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ద్వారా ఎంపికైన సామాన్యులు బిగ్ బాస్ లో పాల్గొంటారు. అభిజిత్ తన తీవ్రతను ప్రదర్శించే ప్రోమో విడుదలైంది.
Key Points
అగ్నిపరీక్ష షో ఆగస్టు 22 నుండి హాట్‌స్టార్‌లో ప్రారంభం.
అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
అగ్నిపరీక్షలో ఎంపికైనవారు బిగ్ బాస్ 9లో పాల్గొంటారు.
ప్రోమోలో అభిజిత్ తన తీవ్రతను ప్రదర్శిస్తున్నాడు.
అగ్నిపరీక్ష: బిగ్ బాస్ 9 కి ముందస్తు షో
ప్రతి ఏడాది బిగ్‌బాస్ షో ( Bigg Boss Reality Show ) వస్తుంది. అది కామన్.. కానీ, ఈసారి బిగ్‌బాస్ కంటే ముందు అగ్నిపరీక్ష వస్తోంది. సామాన్యులను సెలక్ట్ చేసే ప్రోగ్రామ్ ఇది. ఏదో ఆషామాషీగా కాకుండా ఎంతో ఘనంగా ఈ అగ్నిపరీక్ష ప్రోగ్రామ్‌ను జరిపించనున్నారు. దీనికి బిగ్‌బాస్ మాజీ విన్నర్స్ అభిజిత్ ( Abhijeet ), బిందు మాధవి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరించనున్నారు.
అభిజిత్ జడ్జిగా తన తీవ్రతను ప్రదర్శిస్తున్నాడు
నా తడాఖా చూపిస్తా! తాజాగా పెద్దపులి అభిజిత్ మళ్లీ వచ్చాడంటూ హాట్‌స్టార్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది. అందులో అభిజిత్ మాట్లాడుతూ.. ఓ కంటెస్టెంట్‌గా వచ్చిన నన్ను.. ఈరోజు మళ్లీ జడ్జిగా పిలిచారు.. థాంక్యూ! ఇప్పటిదాకా నన్ను స్వీట్ చాక్లెట్ బాయ్‌గానే చూశారుకదా.. ఈ ఆగస్టు 22 నుంచి నా జడ్జిమెంట్ ఎంత కష్టంగా ఉంటుందో బిగ్‌బాస్‌తో సహా వాళ్లకూ (కంటెస్టెంట్స్‌కు) చూపిస్తా.. అన్నాడు. అయితే ఈ వీడియోలో బిగ్‌బాస్ వాయిస్ మారింది. గంభీరంగా వినిపించే బిగ్‌బాస్ గొంతుక పేలవంగా మారిపోయింది. గొంతు మారిపోయింది మరి ఇది ప్రోమో వరకేనా? లేదా అగ్నిపరీక్ష షోలో, బిగ్‌బాస్ 9వ సీజన్‌లో కూడా ఇదే గొంతు వినిపిస్తుందా? అని చాలామంది డౌట్ పడ్డారు. దీంతో హాట్‌స్టార్ ఈ అనుమానాలకు క్లారిటీ ఇచ్చింది. ప్రమోషన్స్ కోసమే ఈ కొత్త వాయిస్ వాడామని, బిగ్‌బాస్ షోలో పాత గొంతే వినిపిస్తుందని వివరణ ఇచ్చింది. ఇకపోతే అగ్నిపరీక్ష.. ఆగస్టు 22 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ అగ్నిపరీక్షలో సెలక్ట్ అయిన కంటెస్టెంట్లు బిగ్‌బాస్ 9లో కామనర్స్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు.
హాట్‌స్టార్‌లో ప్రసారం
అభిజిత్ జడ్జిగా తన తీవ్రతను చూపిస్తానని ప్రకటించాడు. అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కంటెస్టెంట్లు బిగ్ బాస్ 9 లో ప్రవేశిస్తారు. హాట్‌స్టార్‌లో షో ప్రసారం ఆసక్తికరంగా ఉంటుందని కనిపిస్తోంది.


