
బిగ్‌బాస్ 9లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ మాధురి ప్రవర్తనపై నాగార్జున తీవ్రంగా స్పందించారు. ఆమె ఆజమాయిషీ తీరు, గొంతు విషయంలో క్లాస్ పీకారు. చివరకు ప్రేక్షకుల నిర్ణయంతో మాధురికి ఉన్న ఎలిమినేషన్ రద్దు సూపర్ పవర్‌ను కూడా రద్దు చేశారు. ఇది హౌస్‌లో పెద్ద చర్చకు దారితీసింది.
Key Points
బిగ్‌బాస్ 9లో మాధురి, ఆయేషాలు వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చారు.
హౌస్‌లో మాధురి ఆజమాయిషీ, గొడవలు సృష్టించే తీరుపై నాగ్ క్లాస్ పీకాడు.
కెప్టెన్ సుమన్ కూడా మాధురిదే తప్పు అని చెప్పడంతో నాగ్ ఆమెను హెచ్చరించాడు.
ప్రేక్షకుల కోరిక మేరకు మాధురి ఎలిమినేషన్ రద్దు చేసే సూపర్ పవర్‌ను తీసేశారు.
మాధురి ప్రవర్తనపై నాగ్ సీరియస్
బిగ్‌బాస్ షో ( Bigg Boss Telugu 9 )లో ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లున్నారు. వీరిలో ఆరుగురు కొత్తగా వచ్చిన వైల్డ్‌కార్డ్స్ ఉన్నారు. వారిలో ఎక్కువ హైలైట్ అవుతుంది ఇద్దరే ఇద్దరు. ఒకరు మాధురి, మరొకరు ఆయేషా! అరుపులు, ఏడుపులు తప్ప ఏదీ కనిపించడం లేదంటూ తనూజను నామినేట్ చేసిన ఆయేషా.. వచ్చినప్పటినుంచి అరుస్తూనే కనిపించింది. నిన్న ఒక్క గేమ్ ఓడిపోయేసరికి బోరుమని ఏడ్చింది.
వాయించేసిన నాగ్ మాధురి ( Divvala Madhuri ).. హౌస్‌కు రెండో బిగ్‌బాస్ లా ఫీలవుతోంది. అందరిపై ఆజమాయిషీ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్‌తో ఓ గొడవ కూడా జరిగింది. ఆ గొడవలో తప్పెవరిది? అని కెప్టెన్ సుమన్‌ను అడిగాడు నాగ్. అందుకు సుమన్ తడుముకోకుండా మాధురిదే తప్పన్నాడు. ఆరోజు ఏం జరిగిందో వీడియో క్లిప్పింగ్ వేసి మరీ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పు లేదు.. కానీ, మాట్లాడిన తీరు తప్పు అని మాధురికి క్లాస్ పీకాడు. నా గొంతే అలా ఉంటుందని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించుకోగా దాన్ని నాగ్ ఖండించాడు.
కెప్టెన్ సుమన్ నిర్ణయం, నాగ్ క్లాస్
సూపర్ పవర్ నిర్వీర్యం మరిప్పుడు నీ గొంతు అలా లేదు కదా.. మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుందని హెచ్చరించాడు. మాధురికి ఉన్న సూపర్ పవర్ ఉంచాలా? తీసేయాలా? అని స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల్ని అడగ్గా వారు తీసేయడమే మంచిదన్నారు. వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చినరోజు ఆమెకు ఎలిమినేషన్‌ను రద్దు చేసే పవర్ ఇచ్చారు. ప్రేక్షకుల తిరస్కారంతో ఆ పవర్ ఇప్పుడు నిర్వీర్యమైపోయింది.
రద్దయిన మాధురి సూపర్ పవర్
నాగ్ పీకిన క్లాస్‌తో మాధురి గొంతెత్తే పవర్‌ను కోల్పోగా, ప్రేక్షకుల నిర్ణయంతో ఎలిమినేషన్ పవర్ కూడా పోయింది. హౌస్‌లో తన తీరు మార్చుకోకపోతే ఆమెకు మరింత కష్టమని ఈ సంఘటన రుజువు చేసింది.


