
📌 Key Points
- బిగ్ బాస్ 9 తెలుగులో సంజన గల్రాని 15 వారాలు హౌస్‌లో విజయవంతంగా కొనసాగింది.
- ఆమె వారానికి రూ. 2.8 లక్షల చొప్పున భారీ రెమ్యునరేషన్ అందుకుంది.
- 15 వారాలకు గాను సంజన మొత్తం రూ. 42 లక్షలకు పైగా సంపాదించి హయ్యెస్ట్ గా నిలిచింది.
- విన్నర్ ప్రైజ్ మనీ కోటి రూపాయలను స్వల్పంగా మిస్ చేసుకుంది.
బుజ్జిగాడు సినిమాతో పరిచయమైన సంజన గల్రాని, బిగ్ బాస్ 9 తెలుగులో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. 15 వారాల పాటు హౌస్‌లో ఉండి అదరగొట్టింది. ఆమె ఆటతో పాటు అందుకున్న రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బిగ్ బాస్ 9లో సంజన ప్రస్థానం
Bigg Boss 9 Telugu: బుజ్జిగాడు సినిమాలో తన క్యూట్ మాటలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది సంజన గల్రాని. ఈ అమ్మడు ఆ తరువాత కూడా పలు సినిమాలు చేసింది. కానీ, అంతగా సక్సెస్ అవలేదు. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ కూడా పలు సినిమాలు చేసింది కానీ, తరువాత సినిమాలకు కరెక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. రీసెంట్ గా ఈ అమ్మడు బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) తెలుగులో అడుగుపెట్టింది. ఈమెను చూసి చాలా మంది అసలు ఎవరీవిడ అనుకున్నారు. రెండు వారాలు కూడా ఉండదు ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ, రెండు వారాలు కాదు ఏకంగా 15 వారాల పాటు ఆమె హౌస్ లో ఉండి ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది.
Navya Swamy: వెకేషన్ మోడ్ లో సీరియల్ బ్యూటీ నవ్య స్వామి.. పొట్టి గౌనులో అందాలు కేక.. ఫొటోలు
హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ వివరాలు
నిజానికి, బిగ్ బాస్ సీజన్ 9లో చాలా చప్పగా సాగుతుంది అనుకునే సమయంలో తన ఆటతో ఆడియన్స్ మనసులు గెలిచింది సంజన. ఇక అప్పటి నుంచి ఆడియన్స్ దృష్టిని తన వైపుకి తిప్పుకునే ఎదో ఒకటి చేస్తూనే వస్తుంది ఉంది. తన చిలిపి పనులతో నవ్వించించి కూడా. అవసరం ఉన్నచోట బలంగా మాట్లాడింది. తన వాదనను నిర్భయంగా చెప్పుకొచ్చింది. మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పడం అనేది జనాలకు బాగా నచ్చింది. అందుకే ఆమెను అంతలా సపోర్ట్ చేశారు. కానీ, టాప్ 5 నుంచి ఆమె వెనుతిరగాల్సి వచ్చింది.
కోటి రూపాయలు మిస్సయింది ఎలా?
అయితే, ఈ సీజన్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అంటే సంజనదే అని చెప్పాలి. ఈమీకు వారానికి రూ.2.8 లక్షల చొప్పున ముట్టజెప్పారట. అలా 15 వారాలకు గాను ఆమె ఏకంగా రూ.42 లక్షలకు పైగా రెమ్యునరేషన్ గా అందుకుంది. విన్నర్ ప్రైజ్ మనీ రూ.50 లక్షలు కాబట్టి.. ఒకవేళ ఆమె విన అయ్యుంటే కోటి రూపాయల వరకు ఆమె అందుకునేది. కానీ, కొంతలో మిస్ అయ్యింది అని చెప్పాలి. కానీ, ఏదైతేనేం చాలా కాలం తరువాత టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంజన తన [ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది.
బిగ్ బాస్ 9 టైటిల్ గెలుచుకోకపోయినా, సంజన తన ప్రెజెన్స్‌తో ఆడియన్స్‌ను అలరించింది. 15 వారాలకు గాను ఆమె అందుకున్న భారీ రెమ్యునరేషన్ ఆమెకు బిగ్ బాస్ ప్రయాణాన్ని మరింత విజయవంతం చేసింది.


