|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss-9: సెకండ్ ఫైనలిస్ట్ కన్ఫర్మ్.. టాస్క్‌లో తీవ్రంగా గాయపడ్డ ఆ కంటెస్టెంట్ లక్ కలిసొచ్చేనా?

Published: 13-12-2025, 12:48 AM
Bigg Boss-9: సెకండ్ ఫైనలిస్ట్ కన్ఫర్మ్.. టాస్క్‌లో తీవ్రంగా గాయపడ్డ ఆ కంటెస్టెంట్ లక్ కలిసొచ్చేనా?
  • బిగ్ బాస్ సీజన్-9 ఫైనల్ దశకు చేరుకుంది.
  • కళ్యాణ్ పడాల తర్వాత రెండో ఫైనలిస్ట్‌గా తనుజ నిలిచింది.
  • టాస్క్‌లో కాలు బెణికిన కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తీవ్రంగా గాయపడ్డాడు.
  • ఇమ్మాన్యుయేల్ సేఫ్ అవుతాడా లేదా ఎలిమినేట్ అవుతాడా అనేది ఉత్కంఠగా మారింది.

బిగ్ బాస్ సీజన్-9 గ్రాండ్ ఫినాలేకు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కళ్యాణ్ పడాల మొదటి ఫైనలిస్ట్‌గా నిలవగా, రెండో ఫైనలిస్ట్ కోసం హోరాహోరీ పోరు జరిగింది. ఈ క్రమంలో జరిగిన టాస్క్‌లో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని భవితవ్యం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్ 9 ఫైనల్ రేసులో ఎవరున్నారు?

బిగ్ బాస్ సీజన్-9(Bigg Boss-9) ఎట్టకేలకు ఫైనల్‌కు వచ్చేసింది. దీంతో బిగ్ బాస్.. షోను మరింత రసవత్తరంగా మార్చేందుకు వివిధ గేమ్స్ పెడుతున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠత నెలకొన్నది. ప్రస్తుతం హౌస్‌లో కళ్యాణ్ పడాల(Kalyan Padala), సుమన్ శెట్టి(Suman Shetty), సంజన(Sanjana), తనూజ(Tanuja), ఇమ్మాన్యుయేల్(Emmanuel), భరణి(Bharani), డీమన్ పవన్(Demon Pawan) మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఇప్పటికే మొదటి ఫైనలిస్ట్‌గా కళ్యాణ్ పడాల నిలవగా.. రెండో ఫైనలిస్ట్ కోసం టాస్క్‌లు కొనసాగుతున్నాయి.

సెకండ్ టికెట్ టు ఫినాలే: ఇమ్మాన్యుయేల్ గాయం

ఇందులో భాగంగా తనకు ఇచ్చిన ప్రతి టాస్కులోనూ అద్భుతంగా ఆడుతూ ముందుకు వెళ్తున్నారు కమెడియన్ ఇమ్మాన్యుయేల్. అందరినీ వెనక్కు నెడుతూ మెజారిటీ గేమ్స్‌‌లో పై చేయి సాధించాడు. అందుకే ఇప్పుడు సెకండ్‌ టికెట్‌ టు ఫినాలే రేసులోనూ ధృడంగా నిలబడ్డాడు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఏపిసోడ్‌లో మాత్రం కాస్త డల్‌గా కనిపించాడు. సెకెండ్ ఫైనలిస్ట్ కోసం బిగ్ బాస్.. ఇమ్మూ, తనూజ మధ్య ఫైనల్గా బాల్స్‌ గేమ్‌ పెట్టాడు.

తనుజ సెకండ్ ఫైనలిస్ట్: ఇమ్మాన్యుయేల్ భవితవ్యం

అయితే ఈ ఆటలో ఇమ్ము కాలు బెణికి కిందపడిపోయాడు. నొప్పి తట్టుకోలేక కాసేపు గేమ్‌ ఆపమని కోరాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని మెడికల్‌ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇక ఈ గేమ్‌లో తనూజ గెలిచి సెకండ్‌ ఫైనలిస్ట్‌ అయింది. కాకపోతే తను ప్రేక్షకుల ఓట్లతోనే కొనసాగుతానని ఇమ్యూనిటీని తిరస్కరించింది. కాగా ఈ వారం లక్ కలిసొచ్చి ఇమ్ము సేఫ్ అవుతాడా లేక ఓట్స్ వచ్చి ఎలిమినేట్ అవుతాడా అనేది ఆదివారం ఎపిసోడ్‌లో తెలియాల్సి ఉంది.

మొత్తానికి బిగ్ బాస్ 9 ఫినాలే మరింత ఆసక్తికరంగా మారింది. తనుజ రెండో ఫైనలిస్ట్‌గా మారగా, గాయపడిన ఇమ్మాన్యుయేల్ సేఫ్ అవుతాడా లేదా అనే విషయం ఆదివారం ఎపిసోడ్‌లో తేలిపోతుంది. ప్రేక్షకుల తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.