|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss 9 Telugu: పవన్‌కి గాలం వేస్తోన్న రమ్య.. తనూజ, దివ్య, భరణీలకు మాధురి ఆయేషా పట్టపగలే చుక్కలు

Published: 14-10-2025, 3:11 PM
Bigg Boss 9 Telugu: పవన్‌కి గాలం వేస్తోన్న రమ్య.. తనూజ, దివ్య, భరణీలకు మాధురి ఆయేషా పట్టపగలే చుక్కలు

బిగ్‌ బాస్‌ 9 తెలుగు ఆరోవారంలో నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా మారింది. వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లు పాతవారి రిలేషన్స్ ని టార్గెట్ చేయడంతో హౌస్‌లో వాదనలు తారాస్థాయికి చేరాయి. రమ్య, పవన్‌ని టార్గెట్ చేయగా, మాధురి ఆయేషా దివ్య, భరణీలకు చుక్కలు చూపించింది. ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారు?

Key Points

1

బిగ్‌ బాస్‌ 9 తెలుగు ఆరోవారంలోనూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది, తీవ్ర వాదనలు చోటుచేసుకున్నాయి.

2

కొత్త వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లు పాతవారి మధ్య బంధాలను టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

4

మాధురి ఆయేషా దివ్య, భరణీల బంధాన్ని ప్రశ్నించగా, రీతూ తన కెప్టెన్సీ టాస్క్ వైఫల్యంపై వాపోయింది.

వైల్డ్‌ కార్డ్‌ వర్సెస్‌ పాత కంటెస్టెంట్లు

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్ ఆరోవారంలో మంగళవారం కూడా నామినేషన్ల ప్రక్రియ నడిచింది. అయితే నామినేషన్‌ కంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు, పాత కంటెస్టెంట్లకి మధ్య వాదనలే ఎక్కువగా జరిగాయి. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు రిలేషన్స్ ని టార్గెట్‌ చేశారు. ఇప్పటికే బాండింగ్‌ ఏర్పర్చుకున్న వారిని టార్గెట్‌ చేస్తూ ఆ బాండింగ్‌ లను బ్రేక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వారిని రెచ్చగొడుతున్నారు. ఆ విషయంలో వాళ్లంతా సక్సెస్‌ అవుతున్నారు. బాండింగ్‌లను రెచ్చగొట్టడం వల్ల కంటెంట్‌ వస్తుందనేది బిగ్‌ బాస్‌ నిర్ణయం కావచ్చు, వాళ్లంతా ఇదే చేస్తున్నారు. గట్టిగా గెలికే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజులుగా ఈ చర్చనే నడుస్తోంది.

దివ్వెల మాధురీ ఫైర్‌ బ్రాండ్‌ అంటూ వచ్చి మొదటి రోజే కన్నీళ్లు పెట్టుకుంది. కానీ రెండో రోజు మాత్రం చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. భరణి రిలేషన్‌ని నిలదీసింది. భరణి, దివ్యల మధ్య బాండింగ్‌ని ఆమె నిర్మొహమాటంగా ప్రశ్నించింది. అక్కడే ఎందుకు స్ట్రక్‌ అవుతున్నారు. దివ్య తప్ప మరో ప్రపంచం కనిపించడం లేదా అని నిలదీసింది. మరోవైపు రమ్య కూడా డీమాన్‌ పవన్‌ని టార్గెట్ చేసింది. రీతూ చౌదరీ నిన్ను సెంటిమెంటల్‌ ఫూల్‌ని చేస్తుందని, ఆమె చాలా తెలివిగా గేమ్‌ ఆడుతుందని, ఆ విషయాన్ని గ్రహించుకోమని చెబుతుంది. నీ గేమ్‌ నువ్వు ఆడాలని పవన్‌కి హిత బోధ చేసింది రమ్య మోక్ష.

పవన్‌కి గాలం వేస్తోన్న రమ్య మోక్ష

ఇక నామినేషన్‌కి సంబంధించి  బాల్‌ మాధురీకి దొరికింది. ఆమె రీతూకి ఇచ్చింది. రీతూ భరణిని నామినేట్‌ చేసింది. గతంలో తనకు సపోర్ట్ చేస్తానని, అండగా నిలబడతానని స్టాండ్‌ తీసుకున్న భరణి తనకు కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయలేదని వాపోయింది. టైమ్‌ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తానని భరణి చెప్పడంతో తాను ఎలిమినేట్‌ అయ్యాక సపోర్ట్ చేస్తావా అంటూ పంచ్‌ వేసింది. తనకు కెప్టెన్సీ చాలా ముఖ్యమని వాపోయింది. ఆ తర్వాత దివ్యని నామినేట్‌ చేసింది. కుకింగ్‌ విషయంలో డిలే చేశావని, దాని కారణంగా తాను ఆకలితో ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పింది రీతూ. మాధురీ భరణి నామినేషన్‌ని కట్‌ చేసి, దివ్య నామినేషన్‌ని ఓకే చేసింది. దివ్య భరణితో తప్ప తనతో ఉండటం లేదని, యాటిట్యూడ్‌ చూపిస్తుందని కామెంట్‌ చేస్తూ దివ్య నామినేషన్‌ని కన్ఫమ్‌ చేసింది.

ఆ తర్వాత గౌరవ్‌ గుప్తా బాల్‌ని పట్టుకుని సంజనాకి ఇచ్చాడు. ఆమె రాము, భరణీలను నామినేట్‌ని చేసింది. బెట్‌ టాస్క్ లో ఒక అమ్మాయిని నలుగురు అబ్బాయిలు తీసుకుపోతుంటే, సంచాలక్‌గా ఏం చేస్తున్నావని ప్రశ్నించింది. దీంతో కాసేపు వీరి మధ్య వాదన జరిగింది. ఆ ప్లేస్‌లో ఉన్న తాను అదే చేస్తానని, ఇది గేమ్‌ అని, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు సేమ్‌ అని దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చారు. భరణిని నామినేట్‌ చేస్తూ హ్యూమానిటీ లేదని ఆరోపించింది. ఈ విషయంలో నువ్వు ఎలిమినేట్‌ అవుతుంటే తాము త్యాగం చేసి మిమ్మల్ని ఎలిమినేట్‌ కాకుండా ఆపామని, హ్యూమానిటీ గురించి మీరు మాట్లాడుతున్నారంటూ కౌంటర్‌ ఇచ్చాడు. తన ఉగ్రరూపం చూపించారు భరణి. రాముతో కూడా కెప్టెన్‌గా రిస్క్ లో పడకుండా చూసుకోమని చెప్పానని తెలిపారు. అలా కాకుండా ఇంకా వేరే చెబితే తాను వాకౌట్‌ చేస్తానని వెల్లడించారు.

మాధురి ఆయేషా ఫైర్: దివ్య, భరణిలకు చుక్కలు

అనంతరం బాల్‌ని గౌరవ్‌ దక్కించుకున్నాడు. కానీ ఆయేషా రిక్వెస్ట్ మేరకు ఆమెకి ఇచ్చాడు. ఆమె సుమన్‌ శెట్టికి బాల్‌ ఇచ్చింది. అతను తనూజ, సంజనాని నామినేట్‌ చేశాడు. మాటలు మారుస్తున్నావని, అక్కడో మాట, ఇక్కడో మాటచెబుతున్నావని తనూజని నామినేట్‌ చేశాడు. దీనికి సుమన్‌ శెట్టి అసలు రూపం బయటపడిందని తనూజ చెప్పడం విశేషం. అనంతరం సంజనాని నామినేట్‌ చేశాడు. హౌజ్‌లో ఏదైనా గొడవ అయితే దాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నావని, ఆపేందుకు ప్రయత్నించడం లేదని, గొడవలు పెంచుతూ ఎంజాయ్‌ చేస్తున్నావని ఆరోపించాడు. దీనికి ఆమె నవ్వడమే కాదు, అందరు నవ్వడం విశేషం. ఈ విషయంలో ఆయేషా రియాక్ట్ అవుతూ తనూజాని నామినేట్‌ చేస్తూ, సంజనాని తొలగించింది. తనూజ కారణంగా భరణి గేమ్‌ పాడవుతుందని, ఇక్కడ బాండింగ్‌లు పెట్టుకోవడం కాదు, ఎవరికి వాళ్లు గేమ్‌ ఆడాలని తెలిపింది. గట్స్, డేర్‌ చూపించాలని గానీ ప్రేమలు కాదని తెలిపింది. అంతేకాదు ప్రతి దానికి ఏడుస్తున్నావని, అరుస్తుంటావని చెప్పింది. తనూజకి గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. మీరేమైనా నిజమైన నాన్నా కూతుళ్లు కాదు కదా అంటూ రెచ్చిపోయింది. మొత్తంగా మాధురీ, ఆయేషాలు భరణి, తనూజ, దివ్యల బాండింగ్‌ని ప్రశ్నించారు. వారిని ఇరకాటంలో పెట్టారు. చివరగా కెప్టెన్‌ కళ్యాణ్‌కి ఒక్కరిని నామినేట్‌ చేసే అవకాశం ఇవ్వగా ఆయన రాము రాథోడ్‌ని నామినేట్‌ చేశాడు. దీంతో ఆరో వారం సుమన్‌ శెట్టి, భరణి, తనూజ, దివ్య, రాము రాథోడ్‌, డీమాన్‌ పవన్‌ నామినేట్ అయ్యారు.

మొత్తంగా, బిగ్‌ బాస్‌ హౌస్‌లో నామినేషన్లు కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు, కంటెస్టెంట్ల మధ్య సంబంధాలను, వారి గేమ్ స్ట్రాటజీలను బయటపెట్టే వేదికగా మారింది. ఈ వారంలో ఇంటి సభ్యుల మధ్య మరింత ఉత్కంఠ కొనసాగింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.