|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ బ్యూటీ సంచలనం: ప్రియుడితో బ్రేకప్.. కారణం ఇదేనా? వైరల్ పోస్ట్!

Published: 29-01-2026, 5:00 AM
బిగ్ బాస్ బ్యూటీ సంచలనం: ప్రియుడితో బ్రేకప్.. కారణం ఇదేనా? వైరల్ పోస్ట్!
  • బుల్లితెర నటి కీర్తి భట్ బ్రేకప్ ప్రకటనతో ఒక్కసారిగా అభిమానులకు షాక్!
  • ‘కార్తీక దీపం’ సీరియల్‌తో పాపులర్, ఆ తర్వాత బిగ్ బాస్‌లో మరింత క్రేజ్ సంపాదించిన కీర్తి.
  • భర్తగా చూడలేకపోతున్నాను అందుకే బ్రేకప్ అంటూ కీర్తి భట్ సంచలన పోస్ట్.
  • కీర్తి పోస్ట్‌పై నెటిజన్ల స్పందన: ‘బీ స్ట్రాంగ్’ అంటూ కామెంట్లు, మద్దతు తెలుపుతున్న ఫ్యాన్స్.

బుల్లితెర నటి కీర్తి భట్ తన బ్రేకప్ ప్రకటనతో సంచలనం సృష్టించింది. కార్తీక దీపం సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె, బిగ్ బాస్ తర్వాత మరింత పాపులర్ అయింది. ఆమె చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

కీర్తి భట్ సంచలన ప్రకటన!

బుల్లితెర నటి కీర్తి భట్(Keerthi Bhat) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘కార్తీక దీపం’(Karthika Deeoam) సీరియల్‌తో ఫేమ్ అయిన ఈ చిన్నది ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టి అక్కడ మరింత పాపులారిటీ పెంచుకుంది. చిన్నప్పుడే తన అమ్మ నాన్న చనిపోయారని, నేను ఒంటరి దాన్ని అని చాలా సార్లు ఎమోషనల్ అయ్యేది. అయితే అనాథ అయిన కీర్తి భట్.. గతంలో ఓసారి ప్రేమలో పడటం.. ఆ తరువాత ఆ వ్యక్తి ఆమె ఆపదలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లిపోవడం జరిగింది అని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు షేర్ చేసుకుంది. ఇక బయటికి వచ్చాక ఈ చిన్నది బుల్లితెర హీరో కార్తీక్‌కి దగ్గర అయింది.

అంతేకాకుండా వాళ్లిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే రేపోమాపో పెళ్లి పీటలు ఎక్కుతారనుకున్న ఈ జంట తాజాగా బ్రేకప్‌తో షాకిచ్చారు. ఈ బ్రేకప్ విషయాన్ని బహిర్గతం చేసిన కీర్తి భట్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో.. ‘”నా జీవితంలో ఒక ముఖ్యమైన రిలేషన్ ముగిసింది. నిజాయితీగా ఆలోచించి, పరస్పరంగా మాట్లాడుకున్న తర్వాత గౌరవంతో, స్పష్టతతో మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా మధ్య ఇన్నాళ్లూ ఉన్న బంధం నిజమైనదే. కానీ తనని ఒక జీవిత భాగస్వామిగా లేదా భర్తగా చూడలేకపోతున్నాను. అందుకే ఈ బంధాన్ని స్నేహం వరకే ఉంచాలని ఇద్దరూ డిసైడ్ అయ్యాం. నా ఈ నిర్ణయం వల్ల ఎవరికైనా బాధ కలిగితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను.

బ్రేకప్‌కు కారణం అదేనా?

ఇప్పుడు నన్ను బాధపెడుతున్న విషయం ఒక్కటే.. ఈ నిర్ణయం వల్ల మాపైన వచ్చే రూమర్స్. ఎందుకంటే కొంతమంది దీన్ని తప్పుడు వార్తల కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం నా జీవితం ఒక పోరాటంలా ఉంది. అయినా నేను స్థిరంగా, బలంగా, గౌరవంగా నిలబడ్డాను. రాజీ పడి బతకడం కన్నా నా ఆనందమే నాకు ముఖ్యం. నా అనుకున్న వాళ్లు రూమర్స్ కంటే నన్నే నమ్ముతారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు నాకు దక్కిన ప్రేమకు నేను ఎంతో కృతజ్ఞురాలిని. ఇక ముందూ అదే ప్రేమ కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అంటూ కీర్తి భట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు చాలా మంది కీర్తిని సపోర్ట్ చేస్తూ బీ స్ట్రాంగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

వైరల్ అవుతున్న కీర్తి పోస్ట్!

A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial)

కీర్తి భట్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి. తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.