
📌 Key Points
- బిగ్‌బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న ఇనాయా సుల్తానా వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను పంచుకుంది.
- ఒక వ్యక్తి ప్రేమ పేరుతో తనను మోసం చేసి, ఫేమ్, డబ్బు వాడుకుని వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
- గౌతమ్ అనే వ్యక్తి తన జీవితంలోకి వచ్చి మోసం చేశాడని, శారీరకంగా దగ్గరయ్యాక వదిలేశాడని తెలిపింది.
- ఈ ఘటనతో తీవ్ర డిప్రెషన్‌కు లోనై, నిద్రమాత్రలు లేనిదే నిద్రపట్టడం లేదని ఇనాయా ఎమోషనల్ అయింది.
బిగ్‌బాస్ బ్యూటీ ఇనాయా సుల్తానా తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. ప్రేమ పేరుతో మోసపోయానని, ఒక వ్యక్తి తన ఫేమ్, డబ్బు వాడుకుని వదిలేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో తీవ్ర డిప్రెషన్‌కు లోనై, నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఇనాయా చెప్పింది.
ఇనాయా సుల్తానా: కెరీర్, రిలేషన్ షిప్ ప్రస్థానం
బిగ్‌బాస్ షో ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వారిలో ఇనాయా సుల్తానా(Inaya Sultana) ఒకరు. ఆ తర్వాత పలు బుల్లితెర షోస్‌లో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాలోనూ ఫుల్ పాపులారిటీ రాబట్టుకుంది. ఈక్రమంలోనే ఓ వ్యక్తి రిలేషన్ కొనసాగించిన ఇనాయా తన బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు షేర్ చేసి సంచలనం సృష్టించింది. కానీ ఆ తర్వాత మళ్లీ పూర్తిగా కనిపించకుండా పోయింది. ఇటీవల ఈ అమ్మడు ‘3 రోజెస్’ సిరీస్‌లో కీలక పాత్రలో కనిపించింది. ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది, తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇనాయా.. వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలతో పాటు బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడని చెప్తూ ఎమోషనల్ అయింది. ‘‘ వరుస అవకాశాలతో బిజీగా ఉండేనాకు ఒక్కసారిగా నాకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఒంటరి తనంతో చాలా బాధపడ్డాను. డిప్రెషన్‌కు గురయ్యాను. నేను చనిపోతే ఎవరూ రారు కావచ్చని అనుకున్నాను. అప్పుడు నన్ను నేను పరీక్షించుకోవడానికి రెండు రోజులు ఎవరితో మాట్లాడలేదు.
దీంతో నా ఫ్రెండ్స్ కాల్ చేసి ఏం జరిగిందని తెలుసుకున్నారు. కానీ నా దగ్గరకు రాలేదు. ఆ సమయంలోనే గౌతమ్ (Gautam)నా జీవాతంలోకి వచ్చాడు. అతను నాపై చాలా ప్రేమను చూపించాడు. అతన్ని నమ్మి శారీరకంగా దగ్గరయ్యాను. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను.గౌతమ్‌కు నా సర్వస్తం అర్పించాను. చివరకు నన్నే తప్పుగా సమాజానికి చూపించే ప్రయత్నం చేశాడు. అతని ప్రేమ నిజమేనని నమ్మి మోసపోయాను. నా ఫేమ్, డబ్బు అన్నింటినీ వాడుకొని, తన అవసరాలు తీరాక నన్ను వదిలేశాడు. ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా కానీ అవసరమా అనిపించింది. కానీ ఇప్పటికీ ప్రతి రోజు నరకం అనుభవిస్తున్నాను. నిద్ర మాత్రలు లేకుంటే నిద్ర రాదు. ఒంటరి తనంతో తీసుకున్న తప్పుడు నిర్ణయం నా జీవితాన్ని నరకంలా చేసింది. నాలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని కోరుకుంటున్నాను’’ అని చెప్పింది. ఈవిషయం తెలుసుకున్న నెటిజన్లు ధైర్యంగా ఉండాలని ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
ప్రేమ పేరుతో మోసం.. ఆవేదనలో ఇనాయా
డిప్రెషన్‌తో నిద్రలేని రాత్రులు
ఇనాయా సుల్తానా ఆవేదన అభిమానులను కలచివేసింది. మోసపోయిన ఆమెకు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సంఘటన సెలబ్రిటీల జీవితాల్లోని కఠిన వాస్తవాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.


