|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌బాస్‌ ఫేమ్‌ అర్జున్ అంబటి, జెన్నీఫర్‌ల రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల – పరమపద సోపానం

Published: 23-05-2025, 10:34 AM
బిగ్‌బాస్‌ ఫేమ్‌ అర్జున్ అంబటి, జెన్నీఫర్‌ల రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల - పరమపద సోపానం

టాలీవుడ్ నటుడు అర్జున్ అంబటి మరియు జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ నటించిన ‘పరమపద సోపానం’ సినిమా నుండి ఒక రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. ఈ సినిమా జూలై 11న విడుదల కానుంది.

Key Points

1

అర్జున్ అంబటి, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ నటించిన 'పరమపద సోపానం' సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల.

2

జూలై 11న 'పరమపద సోపానం' గ్రాండ్ గా విడుదల కానుంది.

4

డేవ్ జాండ్ సంగీతం అందించిన ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

‘పరమపద సోపానం’ నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల

టాలీవుడ్‌లో అర్ధనారి వంటి హిట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ‘తెప్పసముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. తాజాగా ఈ సినిమా నుంచి  ఒక రొమాంటిక్‌ సాంగ్‌ను విడుదల చేశారు. జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గిడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుడిమెట్ల ఈశ్వర్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవరిస్తున్నారు.

గతంలో పూరి జగన్నాధ్ వంటి దిగ్గజ దర్శకుడికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా  జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లను వేగవంతం చేస్తూ ముందుగా ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

అర్జున్ అంబటి, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ జంట

జూలై 11న సినిమా విడుదల

చివరగా, ‘పరమపద సోపానం’ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. జూలై 11న విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.