
కార్తీకదీపం సీరియల్ మరియు బిగ్ బాస్ షోల ద్వారా పేరు తెచ్చుకున్న నటి శోభా శెట్టి, తాజాగా సోషల్ మీడియా నుండి విరామం ప్రకటించడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె నిర్ణయానికి కారణం తెలియక వారు కామెంట్లు చేస్తున్నారు.
Key Points
బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి సోషల్ మీడియా నుంచి విరామం ప్రకటించింది.
ఆమె నిర్ణయానికి కారణాలను తెలియజేయకుండా, థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేసింది.
ఫ్యాన్స్ ఆమె నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శోభా శెట్టి త్వరలోనే యశ్వంత్ తో వివాహం చేసుకోనుంది.
సోషల్ మీడియా విరామం
Shobha Shetty : బుల్లితెర నటి శోభా శెట్టి తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో నెగిటివ్ పాత్రలో నటించి బాగా వైరల్ అయింది. అనంతరం బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పలు సీరియల్స్, షోస్ చేస్తున్న శోభా శెట్టి కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొని ఆరోగ్య సమస్యలతో మధ్యలోనే బయటకు వచ్చేసింది.
తాజాగా శోభా శెట్టి.. నేను కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను థ్యాంక్యూ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ఎందుకు, ఏమైంది, ఏం జరిగింది అంటూ ఆమె ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు ఆమె పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే శోభా శెట్టి ఎందుకని సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటుందో, ఏం జరిగిందో అని తెగ ఆలోచిస్తున్నారు ఆమె అభిమానులు.
ఫ్యాన్స్ ఆందోళన
ఇక శోభా శెట్టి ఇప్పటికే మరో నటుడు, తన ప్రియుడు యశ్వంత్ ని ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారేమో చూడాలి.
శోభా శెట్టి యొక్క వృత్తి జీవితం
Also See : Supritha : శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సుప్రీత.. చీరకట్టులో పద్దతిగా.. ఫోటోలు వైరల్..
శోభా శెట్టి సోషల్ మీడియా విరామం తర్వాత తన అభిమానులకు త్వరలోనే వివరణ ఇస్తుందని ఆశిద్దాం. ఆమెకు అభిమానుల నుండి మంచి ఆశీస్సులు లభించాలి.


