
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో నామినేషన్స్ ప్రక్రియ హోరహోరీగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు, తనూజ ఏడుపు వంటివి ఈ వారం ప్రధాన ఆకర్షణలు. మొదటి వారం నామినేషన్ లిస్ట్ ఇక్కడ ఉంది.
Key Points
బిగ్ బాస్ 9 తెలుగులో నామినేషన్స్ వార్ మొదలైంది.
తనూజ చేతులెత్తి మొక్కి ఏడుపు చేసింది.
నామినేషన్ లిస్ట్ లో సంజన, రీతూ, శ్రష్టి, సుమన్, ఇమ్మాన్యుయెల్, తనూజ, రాము, డీమాన్ పవన్ ఉన్నారు.
బిగ్ బాస్ 9 లో నామినేషన్స్ డ్రామా
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో హౌస్ లో వాతావరణం వేడెక్కింది. నామినేషన్స్ ప్రక్రియ కారణంగా వార్ మొదలైంది. కంటెస్టెంట్లు ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకోవడం, పరస్పరం ఆరోపణలు, వాగ్వాదంతో షో ఇప్పుడే రసవత్తరంగా మారింది. మరి బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్ లిస్ట్ లో ఎవరున్నారు? ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు ఎవరు నామినేట్ అయ్యారో చూసేద్దాం.
ముందుగా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఇవాళ (సెప్టెంబర్ 10) రిలీజ్ చేసిన ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రోమోలో సంజన , తనూజపై ఫైర్ అయింది దమ్ము శ్రీజ. టాస్క్ లో నెగ్గిన భరణి హ్యామర్ తెచ్చి శ్రీజ చేతికిచ్చాడు. అప్పుడు వాష్ రూమ్ ఇన్సిడెంట్ ను తీసుకొచ్చి సంజన గురించి మాట్లాడుతుంది శ్రీజ. అలా పెట్టడం మాకు ప్రాబ్లం అన్నా కూడా లేదు అలానే ఉంటా, అదే స్టాండ్ మీద ఉంటా అన్నారు. ఆ స్టాండే కరెక్ట్ కాదు అని సంజన గురించి అంటుంది శ్రీజ.
తనూజ ఎందుకు ఏడుస్తోంది?
ఫస్ట్ డే వచ్చిన దగ్గరి నుంచి కూడా కామెంట్లు వేయడం మొదలెట్టారు. ఈ కామెంట్లే ఫస్ట్ డే నుంచి కూడా జరుగుతున్నాయి మీ దగ్గరే అని తనూజతో అంటుంది శ్రీజ. మధ్యలో ప్రియ, డీమాన్ పవన్ కూడా జోక్యం చేసుకుంటారు. మాస్క్ మ్యాన్ హరీష్ మధ్యలో వచ్చి బాడీ లాంగ్వేజ్, మీ మాటే బాగలేదని బాంబ్ పేలుస్తాడు. దీనిపై ఆర్గ్యూ చేస్తుంది తనూజ. ఆ తర్వాత ఎలా పోర్ట్రే అవుతుందని సుమన్ శెట్టితో మాట్లాడుతూ ఏడుస్తుంది.
ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ గా ఉంది. టెనెంట్స్ లోని ఇద్దరు టాస్క్ లో పోటీపడాలి. గెలిచిన వాళ్లకు నామినేట్ చేసే అవకాశం వస్తుంది. అయితే వాళ్లు చేసిన నామినేట్ ను ఓనర్స్ ఆమోదించాల్సి ఉంటుంది.
నామినేషన్ లిస్ట్ వివరాలు
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్న వాళ్లెవరో చూద్దాం. సంజన, రీతూ చౌదరి, శ్రష్టి, సుమన్, ఇమ్మాన్యుయెల్, తనూజ, రాము రాథోడ్, డీమాన్ పవన్. మొత్తం 8 మంది. ఇందులో ఏడు మంది సెలబ్రిటీలు. ఒకరు కామనర్. మరి వీళ్లలో ఫస్ట్ వీక్ హౌస్ నుంచి వెళ్లిపోయేది ఎవరో త్వరలోనే తెలుస్తుంది. ఇప్పటికే ఓనర్స్, టెనెంట్స్ మధ్య పోరు హోరాహోరీగా మారింది.
బిగ్ బాస్ 9 తెలుగులో మొదటి వారం నామినేషన్స్ తో హౌస్ లో ఉద్రిక్తత పెరిగింది. ఎవరు ఇంటి నుంచి బయటకు వెళతారో వేచి చూడాలి.


