
యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల రెమ్యునరేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కి హృతిక్ కంటే ఎక్కువ వేతనం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
Key Points
వార్ 2 లో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ హృతిక్ కంటే ఎక్కువ అని వార్తలు.
ఎన్టీఆర్ 60 కోట్లు, హృతిక్ 50 కోట్లు తీసుకున్నారని ప్రచారం.
కియారా అద్వానీ 15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీ 30 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
ఈ రెమ్యునరేషన్ వివరాలు ఎంతవరకు నిజమో అనిశ్చితం.
వార్ 2 రెమ్యునరేషన్ వివరాలు
NTR Remuneration : యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో YRF సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘వార్-2’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. వార్ -2 సినిమా ఆగస్టు 14 రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.
తాజాగా వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ చర్చగా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు హృతిక్ రోషన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారంట. ఎన్టీఆర్ RRR, దేవర సినిమాలకు 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. ఇప్పుడు వార్ 2 సినిమాకు ఇంకో 10 కోట్లు పెంచి 60 కోట్లు తీసుకున్నాడని సమాచారం. బాలీవుడ్ లో ఎలాగో రెమ్యునరేషన్స్ ఎక్కువే ఉంటాయి. సినిమా కూడా భారీ బడ్జెట్, ఎన్టీఆర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కావడంతో అంత ఇచ్చారట.
ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్
ఇక్కడివరకు బాగానే ఉంది కానీ హృతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కంటే తక్కువ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. హృతిక్ కి ఈ సినిమాకు 50 కోట్లే ఇచ్చారని అంటున్నారు. దీన్ని హృతిక్ ఫ్యాన్స్, బాలీవుడ్ జనాలు మాత్రం ఒప్పుకోవట్లేదు. సినిమాలో మెయిన్ హీరో హృతిక్ అని, హృతిక్ బాలీవుడ్ స్టార్ అని, 50 కంటే ఎక్కువే ఇచ్చి ఉంటారని, ఎన్టీఆర్ కంటే ఎక్కువే ఉంటుందని అంటున్నారు.
ఇతర నటీనటుల వేతనాలు
ఇక వార్ 2 లో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీకి 15 కోట్లు ఇచ్చారని, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ 30 కోట్లు తీసుకున్నాడని సమాచారం. అయితే ఇవి ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఎన్టీఆర్ హృతిక్ కంటే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకున్నాడు అనేది ఇప్పుడు చర్చగా మారింది.
చివరగా, వార్ 2 సినిమా నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నిజానికి ఎంత వేతనం తీసుకున్నారో అధికారిక ప్రకటన రావాలి.


