
📌 Key Points
- విజయ్ దేవరకొండ సినిమాపై బిగ్ బాస్ పృథ్వీ రాజ్ షాకింగ్ కామెంట్స్!
- కింగ్డమ్ మూవీ చూసి డిజప్పాయింట్ అయ్యానన్న పృథ్వీరాజ్.
- విజయ్ దేవరకొండకు సక్సెస్ రావాలని కోరుకున్నా: పృథ్వీ.
- భవిష్యత్తులో విజయ్ తో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానన్న పృథ్వీ రాజ్.
విజయ్ దేవరకొండ గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ పృథ్వీ రాజ్, విజయ్ సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విజయ్ సినిమాపై పృథ్వీ రాజ్ కామెంట్స్
Vijay Deverakonda : అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మళ్ళీ ఆ రేంజ్ హిట్ సినిమా సాధించలేదు. హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు విజయ్. కానీ విజయ్ సినిమాలతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇటీవల రిలీజయిన కింగ్డమ్ సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది. తాజాగా విజయ్ కింగ్డమ్ సినిమాపై సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ పృథ్వీ రాజ్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.(Vijay Deverakonda)
కింగ్డమ్ మూవీ రివ్యూ చెప్పేసిన పృథ్వీ
ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన పృథ్వీ రాజ్ శెట్టిని రీసెంట్ టైంలో ఏదైనా సినిమా చూసి డిజప్పాయింట్ అయ్యారా అని అడిగారు.
విజయ్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే వదులుకోను
దీనికి పృథ్వీ రాజా శెట్టి సమాధానమిస్తూ.. కింగ్డమ్ సినిమా చూసి నేను డిజప్పాయయింట్ అయ్యాను. విజయ్ దేవరకొండ అంటే నాకు ఇష్టం. అతనికి సక్సెస్ రావాలని కోరుకున్నాను. కింగ్డమ్ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాను. ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టాను. ఈ సినిమాతో హిట్ కొట్టాలి అనుకున్నాను. కానీ ఆ సినిమా అంతగా నచ్చలేదు. డిజప్పాయింట్ అయ్యాను. భవిష్యత్తులో విజయ్ తో నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను అని తెలిపాడు.
పృథ్వీ రాజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం కోసం ఎదురు చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


