|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేను విన్న 70, 80 క‌థ‌ల్లో నాకు నచ్చింది ఇదొక‌టి- జనాలకు సందేశాలు ఇచ్చే పరిస్థితిలో సినిమా లేదు: బిగ్ బాస్ శివాజీ

Published: 14-12-2025, 1:48 AM
నేను విన్న 70, 80 క‌థ‌ల్లో నాకు నచ్చింది ఇదొక‌టి- జనాలకు సందేశాలు ఇచ్చే పరిస్థితిలో సినిమా లేదు: బిగ్ బాస్ శివాజీ
  • బిగ్ బాస్ శివాజీ నటించిన తాజా చిత్రం ‘దండోరా’ టైటిల్ సాంగ్ ఇటీవల విడుదల.
  • దండోరా సినిమా తెలంగాణ నేపథ్యం కలిగిన ఎమోషనల్ కమర్షియల్ మూవీ అని శివాజీ వెల్లడి.
  • జనాలకు సందేశాలు ఇచ్చే పరిస్థితిలో సినిమా లేదని బిగ్ బాస్ శివాజీ స్పష్టం చేశారు.
  • తను విన్న 70-80 కథల్లో ‘దండోరా’ స్క్రిప్ట్ తనకు బాగా నచ్చిందని శివాజీ అభిప్రాయపడ్డారు.

నటుడు బిగ్ బాస్ శివాజీ నటించిన దండోరా సినిమా టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శివాజీ సినిమాపై, దండోరా కథపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా సందేశాలు ఇచ్చే స్థితిలో లేదని, దండోరా స్క్రిప్ట్ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు.

దండోరా మూవీపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

బిగ్ బాస్ ఫేమ్, హీరో శివాజీ నటించిన లేటెస్ట్ సినిమా దండోరా. నవదీప్, నందు, రవికృష్ణ, మౌనిక రెడ్డి, బిందు మాధవి నటించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. దండోరా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో బిగ్ బాస్ శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘క‌ల‌ర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ సినిమాల నిర్మాతల నుంచి వస్తోన్న సరికొత్త మూవీ దండోరా. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు.

దండోరా మూవీలో బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, న‌వ‌దీప్‌, బిందు మాధవి , నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 25న దండోరా మూవీ రిలీజ్ కానుండగా తాజాగా డిసెంబర్ 13న టైటిల్ సాంగ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దండోరా టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో బిగ్ బాస్ ఫేమ్, హీరో శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి

సినిమా సందేశాలపై శివాజీ అభిప్రాయం

న‌టుడు శివాజీ మాట్లాడుతూ.. “తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇది. నాకు డైరెక్ట‌ర్‌ గారు స్క్రిప్ట్ చెప్ప‌గానే ఏం చ‌దువుకున్నార‌ని అడిగాను. నేను అమెరికా నుంచి వ‌చ్చానని ఆయ‌న అన్నాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎమోష‌న్స్‌తో కూడిన క‌మ‌ర్షియ‌ల్ మూవీ. జ‌నాల‌కు సందేశాలు, స‌ల‌హాలు ఇచ్చే ప‌రిస్థితిలో ఇవాళ సినిమా లేదు” అని అన్నారు.

“ఈ సినిమాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్స్‌, డ్రామా, ఎగ్రెష‌న్ అన్నీ ఉన్నాయి. టైటిల్ విన‌గానే వ‌న్ సైడ్ అయిపోతుందిగా అన్నాను. కానీ అది కాదు.. కామెడీ ఉన్నా అది దండోరా వేసిన‌ట్లే ఉంటుంది. ఎమోష‌న్స్ ఏదైనా దండోరా వేసిన‌ట్లే ఉంటుంది” అని శివాజీ అభిప్రాయపడ్డారు.

” కోర్ట్ క‌న్నా ముందే ఈ సినిమాను నేను క‌మిట్ అయ్యాను. ఫుల్టీ కంటెంట్ లోడెడ్ మూవీ. ఏ లాంగ్వేజ్‌లో వ‌చ్చినా సినిమా ఆడుతుంద‌నేది నా అభిప్రాయం. స్క్రీన్ స్పేస్ అనేది ప‌క్క‌న పెడితే ఇందులో న‌టించిన అంద‌రికీ ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్ర‌తీ క్యారెక్ట‌ర్‌కి ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది” అని హీరో శివాజీ పేర్కొన్నారు.

నాకు నచ్చిన 70-80 కథల్లో ఇదొకటి

“నేనైతే 90స్ క‌థ వినేట‌ప్పుడు నేనెలాగైతే ఫీల్ అయ్యానో.. ఈ క‌థ విన్న‌ప్పుడు అలాగే అనిపించింది. మంచి క‌థ‌లు, పాత్ర‌లు చేయాల‌నుకుంటున్న స‌మ‌యంలో నేను విన్న 70-80 క‌థ‌ల్లో నాకు న‌చ్చిన క‌థ‌ల్లో ఇదొక‌టి” అని శివాజీ తెలిపారు.

“ఇందులో కులాలు, మ‌తాలు అనే కాన్సెప్ట్ ఉండ‌దు. నాకు తెలిసి ఈ ప్ర‌పంచంలో రెండే కులాలు.. ఒక‌టి డ‌బ్బున్నోడు.. రెండోది డ‌బ్బులేనోడు. ఒక‌డేమో తొక్కాల‌ని, రెండో వాడేమో తొక్కినా లేవాల‌ని చూస్తుంటారు. ఇందులో పాత్ర‌లు కూడా అలాగే ఉంటాయి” అని శివాజీ చెప్పుకొచ్చారు.

“ఇది చాలా మంచి కథ. ఈ సినిమా కథ గురించి దేశం (ఫిల్మ్ ఫెట‌ర్నిటీస్‌) మాట్లాడుతుందేమోన‌నిపిస్తోంది. మంచి ఆర్టిస్టులు కుదిరారు. డిసెంబ‌ర్ 23 నుంచి ఓవ‌ర్సీస్‌లో దండోరా ప్రీమియ‌ర్స్ ఉంటాయి. అదే రోజున ఇక్క‌డ వేద్దామ‌ని అంటున్నాను. క‌థ‌ను న‌మ్మి చేసిన సినిమా. ప్రేక్ష‌కుల ఆశీర్వాదం కావాలి. ముర‌ళీగారికి, బెన్నీగారికి, మైత్రీ, ప్రైమ్ షో, అథర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ వారికి థాంక్స్” అని బిగ్ బాస్ శివాజీ తన స్పీచ్ ముగించారు.

మొత్తంగా, బిగ్ బాస్ శివాజీ ‘దండోరా’ సినిమా పట్ల తనకున్న నమ్మకాన్ని, స్క్రిప్ట్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తపరిచారు. సినిమా కేవలం వినోదం కోసమేనని, సందేశాలు ఇవ్వడం దాని ప్రథమ లక్ష్యం కాదని స్పష్టం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.