|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss: ‘శ్రష్టి వర్మ’ ఎలిమినేట్‌.. ఎంత సంపాదించింది..?

Published: 16-09-2025, 11:39 AM
Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్‌.. ఎంత సంపాదించింది..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో మొదటి వారంలోనే శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. ఆమె హౌస్ లో ఒక వారం ఉండి ఎంత సంపాదించిందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో శ్రష్టి వర్మ మొదటి వారమే ఎలిమినేట్ అయ్యింది.

2

ఆమె కేవలం ఒక వారం హౌస్ లో ఉండి రూ. 2 లక్షలు రెమ్యునరేషన్ గా పొందింది.

4

శ్రష్టి వర్మ నిజాయితీగా ఉన్న నలుగురు పోటీదారుల పేర్లను నాగార్జునకు తెలిపింది.

శ్రష్టి వర్మ ఎలిమినేషన్

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Telugu 9) మొదటి వారం పూర్తి అయిపోయింది. దీంతో ఫస్ట్‌ ఎలిమినేషన్‌ ద్వారా  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ (Shrasti Verma) హౌస్‌ నుంచి బయటకు వచ్చింది. కేవలం వారం రోజులు మాత్రమే ఆమె హోస్‌లో కొనసాగింది. మొదట ఫ్లోరా సైనీ(ఆషా షైనీ) ఎలిమినేషన్‌ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో  శ్రష్టి వర్మను ఇంటి నుంచి పంపించేశారు. దీంతో ఆమె అభిమానులు షాక్‌ అయ్యారు. అయితే, వారం రోజులకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్‌ గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతుంది.

ఆమె రెమ్యునరేషన్ వివరాలు

బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారమే  శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కావడంతో ఆమె పెద్దగా లాభ పడింది లేదని చెప్పాలి. హౌస్‌లో ఆమె కేవలం వారంరోజులు మాత్రమే ఉండటంతో తను రెమ్యునరేషన్‌గా రూ. 2 లక్షలు మాత్రమే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇతర కంటెస్టెంట్ల రెమ్యునరేషన్‌తో పోలిస్తే చాలా తక్కువని తెలుస్తోంది.

ఇతర పోటీదారులతో పోలిక

బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో రీతూ చౌదరి, రాము రాథోడ్,సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్,సంజన, తనూజ గౌడ, ఫ్లోరా సైని, శ్రేష్టి వర్మ, డిమోన్ పవన్‌తో మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు శ్రేష్టి వర్మకు పడ్డాయి. దీంతో ఫస్ట్‌ ఎలిమినేషన్‌లో భాగంగా ఆమె బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా నిజాయితీగా ఉన్న నలుగురు పేర్లు చెప్పమని నాగార్జున కోరారు.. మనీశ్, హరీశ్, రాము రాథోడ్, ఆషా షైనీ అని శ్రష్టి తెలిపింది. కెమెరా ముందు నటించేవారు ఎవరనే ప్రశ్నకు.. భరణి, రీతూ చౌదరి, తనూజ,  పేర్లు చెప్పింది.

బిగ్ బాస్ హౌస్ నుండి శ్రష్టి వర్మ బయటకు వచ్చిన తర్వాత ఆమె రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతోంది. కేవలం ఒక వారం ఉండి ఆమె తీసుకున్న మొత్తం చాలా తక్కువ అని అనిపిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.