
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్‌లో తనూజ దూసుకుపోతోంది. ఓటింగ్ పరంగా టాప్ స్థానంలో ఉన్న ఆమెకు అదనపు క్రేజ్ ముద్దమందారం సీరియల్ టైటిల్ సాంగ్ ద్వారా వస్తోంది. పదేళ్ల నాటి ఈ పాట ఆమె పాపులారిటీతో ఇప్పుడు మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట వైరల్‌గా మారింది.
Key Points
బిగ్‌బాస్ 9 తెలుగులో తనూజ ప్రస్తుతం టాప్ స్థానంలో దూసుకుపోతోంది.
ఆమె క్రేజ్‌తో ముద్దమందారం సీరియల్ టైటిల్ సాంగ్ వ్యూస్ 6 మిలియన్ల నుండి 27 మిలియన్లకు పెరిగాయి.
తనూజ అసలు పేరు తనూజ పుట్టస్వామి; ఆమె కన్నడ, తెలుగు సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది.
కన్నడిగ అయినా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ, టాస్కులలో చురుకుగా పాల్గొంటుంది.
బిగ్‌బాస్‌లో తనూజ దూకుడు.. టాప్ లిస్ట్‌లో చోటు
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ప్రస్తుతానికి తనూజ టాప్ లో దూసుకుపోతుంది . ఓటింగ్ పరంగా చాలా పేజీలలో ఆమె ప్రథమ స్థానంలో ఉంది . అయితే , తెలుగులో ఆమెకు ముద్దమందారం సీరియల్ మంచి గుర్తింపు తెచ్చింది . బిగ్ బాస్ లో ఆమె టాప్ లో ఉండటంతో ఈ సీరియల్ కు సంబంధించిన టైటిల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది . మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతుంది .
తనూజ అసలు పేరు తనూజ పుట్టస్వామి. అయితే , సినీ పరిశ్రమలో తనూజ గౌడగా స్థిరపడిపోయింది . కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ బెంగళూరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమెను ఒక టీచర్ గా చూడాలని ఆమె తండ్రి కోరుకున్నాడు . కానీ , ఆమెకు సినిమా రంగం అంటే ఆసక్తి ఉండటంతో తన కలను సాధించుకోవడం కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది . అయితే , తన కాలేజీ రోజుల్లోనే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ .
ముద్దమందారం టైటిల్ సాంగ్ వైరల్ వెనుక అసలు కథ
తన కాలేజీ రోజుల్లోనే తనూజకు మొదట కన్నడ హారర్ సినిమా ‘ 6-5=2’ లో దక్కింది . ఆ తర్వాత దండే బాయ్స్ చిత్రంలో నటించింది. వాటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు . ఈ క్రమంలోనే తెలుగులో తొలి సీరియల్ ‘అందాల రాక్షసి’లో ఛాన్స్ వచ్చింది . ఆ తర్వాత వెంటనే ముద్దమందారంలో పార్వతి పాత్రతో మెరిసింది . మంచి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది . ఇప్పుడు ఈ సిరీయల్ టైటిల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది .
తనూజ అసలు పేరు, కెరీర్ విశేషాలు
బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైన సమయంలో కేవలం 6 మిలియన్ల వ్యూస్ తో ఉన్న ఈ పాట .. ఇప్పుడు ఏకంగా 27 మిలియన్లతో దూసుకుపోతుంది . బిగ్ బాస్ లో తనూజ గేమ్ నచ్చిన వారు ఈ సాంగ్ ను ఇప్పుడు చూస్తున్నారని తెలుస్తోంది . తనూజ వల్ల ఈ సాంగ్ ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ అదనంగా రీచ్ తెచ్చుకుంది . తనూజ పుట్టస్వామి ఒక రియల్ గేమర్ గా ఆడుతుంది . తనలో ఎమోషన్స్ తో పాటు సెన్సిటివ్ కూడా ఉంది . మొదటి నుంచి టాస్క్ కూడా వదిలేయలేదు . కన్నడిగ అయినా సరే .. , తెలుగులోనే చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది . ప్రస్తుతానికి తనూజ మాత్రమే టాప్ లో ఉంది .
బిగ్‌బాస్‌లో తనూజ ఆట తీరు, ఆమె పాత హిట్ సాంగ్ వైరల్ కావడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. టాప్ కంటెస్టెంట్‌గా ఆమె ప్రయాణం కొనసాగుతుండగా, భవిష్యత్తులో ఆమె మరింత ఎత్తుకు ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు.


