|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss Telugu 9: కెమెరా ఫోకస్‌ కోసం డ్రామాలు, కంటెంట్‌ ఇవ్వమంటే పర్సనల్‌ ఎటాక్‌.. నామినేషన్లో ఉన్నది వీరే

Published: 09-09-2025, 3:21 PM
Bigg Boss Telugu 9: కెమెరా ఫోకస్‌ కోసం డ్రామాలు, కంటెంట్‌ ఇవ్వమంటే పర్సనల్‌ ఎటాక్‌.. నామినేషన్లో ఉన్నది వీరే

బిగ్ బాస్ తెలుగు 9 లో రెండవ రోజున ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, వాగ్వాదాలు, నామినేషన్లు, ఎమోషనల్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సంజనా గల్రానీపై ఆరోపణలు చేశారు.

Key Points

1

కెమెరా ఫోకస్ కోసం కంటెస్టెంట్ల మధ్య డ్రామాలు

2

సంజనా గల్రానీపై ఇతర కంటెస్టెంట్ల ఆరోపణలు

4

ఎమోషనల్ గా కనిపించిన సంజనా, ఫ్లోరా సైనీ, తనూజ

కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు

బిగ్‌ బాస్‌ తెలుగు 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. రెండు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. నాగార్జున హోస్ట్ గా 15 మందితో ఈ 9వ సీజన్‌ ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక మంగళవారం(డే 2) ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు ఆసక్తికరంగా, రసవత్తరంగా సాగాయి. కెమెరాలకు మంచి కంటెంట్‌ ఇచ్చేలా ఉన్నాయి. ఇందులో మెయిన్‌గా సంజనాని హోనర్‌ కంటెస్టెంట్లు టార్గెట్‌ చేశారు. బిగ్‌ బాస్‌ టెనెంట్‌లో ఉన్న వారిలో ఒకరిని నామినేట్‌ చేయాల్సి వస్తే ఎవరిని చేస్తారని హోనర్లని అడగ్గా, వారు చర్చించుకుని సంజనా గల్రానీ పేరు చెప్పారు. ఆమె బ్యాడ్‌ బిచ్చింగ్‌ చేస్తుందని, వెనకాల కామెంట్‌ చేస్తుందని, అబద్దాలు చెబుతుందని, తన వల్ల మిగిలిన వారు ఇబ్బంది పడుతున్నారని కామెంట్‌ చేశారు.

ప్రియా బ్యాడ్ బిచ్చింగ్‌ చేస్తున్నారని కామెంట్‌ చేయగా, సంజనా గల్రానీ ఫైర్‌ అయ్యింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రాత్రి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై తానేంటో చూపిస్తానని చెప్పింది. రేపట్నుంచి అసలు గేమ్‌ ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత బాత్‌ రూమ్‌లో షాంపూ విషయంలో గొడవ జరిగింది. ఈ డిస్కషన్‌లో ఫోరా సైనీ, సంజనా మధ్య డిస్కషన్‌ జరగ్గా, ఆమె అన్న మాటకి సైనీ బాధపడింది. హర్ట్ అయి వెళ్లిపోయి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెని ఓదార్చేందుకు రీతూ చౌదరీ, ఇతర కంటెస్టెంట్లు వచ్చింది. ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ బాత్‌ రూమ్‌లు, షాంపూ కోసమే చాలా సేపు వాగ్వాదం జరిగింది. ఇది పెద్ద రచ్చ రచ్చ అయ్యింది.

సంజనా గల్రానీపై విమర్శలు

ఇందులో అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన వారు హోనర్స్, సెలబ్రిటీలు టెనెంట్స్ అనే విషయం తెలిసిందే. వీరిని బిగ్‌ బాస్‌ ఇలారెండు టీమ్‌లుగా విడగొట్టారు. టెనెంట్స్ హోనర్స్ కి ఫుడ్‌ వండి పెట్టాలి. అయితే కిచెన్‌లో పుడ్‌ ప్రిపేర్‌ చేసే విషయంలో హోనర్స్ కొన్ని పనులు చెప్పారు. ఫుడ్‌ ప్రిపేర్‌ చేసే విషయంలో హరీష్‌, మనీష్‌ కొన్ని కండీషన్స్ చెప్పగా, దానికి తనూజ హర్ట్ అయ్యింది. తన మైండ్‌లో ఏవేవో తిరుగుతున్నాయంటే హైరానా అయ్యింది. ఇలా అటు సంజనా, ఇటు ఫ్లోరా సైనీ, మరోవైపు తనూజ ఎమోషనల్‌గా కనిపించారు. ఏడిస్తేనే కెమెరాల్లో ఫోకస్‌ అవుతారని ఇవన్నీ చేస్తున్నారని దమ్ము శ్రీజ కామెంట్‌ చేసింది. దీనికి సంజనా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తను ఎక్కడి నుంచి వచ్చానో తెలియదా, నాకు ఇది కొత్తనా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

మరోవైపు రీతూ చౌదరీకి గాయం అయ్యింది. హౌజ్‌లో జరిగిన టాస్క్ లో భాగంగా రీతూ చౌదరీ తలకి బాగా గాయమైంది. అందుకు ప్రియా కారణం అయ్యిందట. ఈ విషయంపై వారి మధ్య డిస్కషన్‌ జరిగింది. సారీ కూడా చెప్పింది ప్రియా. కానీ  తనకు దెబ్బతగిలినప్పుడు నా తలకి ఏమైనా అయ్యిందా? నాకు ఓకేనా? అనే ఉద్దేశ్యంతో డాక్టర్‌ అంటూ అరిచానని తెలిపింది. తన ఇంట్లో తాను ఒక్కరినే అని, తనకు ఏమైనా అయితే పరిస్థితి ఏంటనే ఉద్దేశ్యంతో తాను అలా రియాక్ట్ కావాల్సి వచ్చిందని రీతూ చెప్పింది. అంతకు ముందు కాసేపు రీతూ, డీమాన్‌ పవన్‌ మధ్య పులిహోర వ్యవహారం నడిచింది. ఫుడ్‌ ఎలా ఉందంటే నీలాగే ఉందని ఆయన చెప్పడం, అదిరిపోయిందని మళ్లీ కామెంట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది.

నామినేషన్స్ మరియు వాటి ప్రభావం

మొదటి వారం నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. హోనర్లు ఈ నామినేషన్‌ లో ఉండరు, కేవలం టెనెంట్లని మాత్రం నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో తనూజ, కళ్యాణ్‌ లు సంజనాని నామినేట్‌ చేశారు. ఆమె అప్పటికే నామినేట్‌ అయిన నేపథ్యంలో మరోసారి ఆమెనే నామినేట్‌ చేయడం విశేషం. చిన్న ఇష్యూని పెద్దది చేశారని, బ్లండర్‌ మిస్టేక్స్ చేశారని, ఓవర్‌ గా రియాక్ట్ అవుతున్నారని వాళ్లు తెలిపారు. మరోవైపు రాము రాథోడ్‌, మాస్క్ మ్యాన్ హరీష్‌లు కలిసి సుమన్‌ శెట్టిని నామినేట్‌ చేశారు. ఆయన డల్‌గా ఉంటున్నాడని, అందరిలో కలవడం లేదని ఆరోపించారు. లేజీగా ఉన్నట్టుగా అనిపిస్తుందని, గేమ్స్ లో ఈజ్‌ లేదని, యాక్టివ్‌గా కనిపించడం లేదన్నారు. స్ట్రాంగ్‌గా ఉన్నావా లేదా అనేది తెలియడం లేదని తెలిపారు. హౌజ్‌లోకి వచ్చింది రెండు మూడు రోజులే అని, ఇంకా ఉంది కదా అని ఆయన చెప్పారు. ఏదైనా స్పందిస్తారా? అంటే ఏం లేదన్నాడు. దానికి సంజనా తెలుగులో చెప్పగా, సుమన్‌ శెట్టి వేసిన పంచ్‌ అదిరిపోయింది. ఇక హరీష్‌, కళ్యాణ్‌ కలిసి నామినేషన్‌ చేయాల్సి వస్తే ఎవరిని చేస్తారని మరోసారి బిగ్‌ బాస్‌ అడగ్గా, భరణి, ఇమ్మాన్యుయెల్‌ పేర్లు చెప్పారు. అయితే ఇందులో ఇమ్మూ గురించి లేజీ, ఫ్యాటీ అంటూ వ్యక్తిగతాన్ని టార్గెట్‌ చేస్తూ కామెంట్‌ చేశారు. భరణిలో యంగ్‌ జనరేషన్‌ లో ఉన్న ఈజ్‌, ఫైర్‌ లేదని కామెంట్‌ చేశారు. ఇప్పటికైతే సంజనా, సుమన్‌ శెట్టి, భరణి, ఇమ్మాన్యుయెల్‌లను నామినేట్‌ చేశారు. బుధవారం ఎపిసోడ్‌లో ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది.

బిగ్ బాస్ తెలుగు 9 ఇంట్లో గొడవలు, నామినేషన్లు, ఎమోషనల్ సన్నివేశాలతో రసవత్తరంగా సాగుతోంది. సంజనా గల్రానీ, ఇతర కంటెస్టెంట్ల భవిష్యత్తు ఏంటో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.