
బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. ఇవాళ జరిగిన గ్రాండ్ లాంచ్ షూటింగ్ లో మాజీ పోటీదారులతో హౌస్ టూర్, నాగార్జున కూలీ సాంగ్ డ్యాన్స్ తో ఎంట్రీ, అనుష్క శెట్టి ప్రత్యక్షం వంటివి ముఖ్య ఆకర్షణలు.
Key Points
మాజీ బిగ్ బాస్ పోటీదారులతో హౌస్ టూర్!
కూలీ సాంగ్ తో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ!
కామన్ పోటీదారులుగా సెలబ్రిటీలు!
మాజీ పోటీదారులతో హౌస్ టూర్
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద బుల్లితెర రియాలిటీ షోగా బిగ్ బాస్ పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ 8 టీవీ సీజన్స్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. బుల్లితెర ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఇంకో రోజులో ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 7న అంటే రేపు సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌ను ప్రసారం చేయనున్నారు మేకర్స్. అయితే, బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ గ్రాండ్ లాంచ్ షూటింగ్‌ను ఇవాళ (సెప్టెంబర్ 6) జరుపుతున్నారు. ఈపాటికే కొద్దిపాటి షూటింగ్ జరిగింది. ఇందులో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ 9వ సీజన్ హౌమ్ టూర్ నిర్వహించారు.
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ హౌజ్ ఎలా ఉంటుందో అమర్ దీప్ చౌదరి, యాంకర్ విష్ణుప్రియ , ప్రియాంక జైన్‌లతో హోమ్ టూర్ చేయించి చూపించారు. గత సీజన్స్‌లో కంటెస్టెంట్స్ అందరూ స్విమ్మింగ్ పూల్ వద్ద మాటలు, గొడవలు చేసుకునేవారు. అలాంటి స్విమ్మింగ్ పూల్ వద్ద ఒక రూమ్‌ను ఏర్పాటు చేశారట.
నాగార్జున గ్రాండ్ ఎంట్రీ
అగ్ని పరీక్ష అంటూ కామనర్స్‌కు టెస్ట్‌లు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఐదుగురు సామన్యులను కంటెస్టెంట్స్‌గా పంపిస్తారని టాక్ నడిచింది. కానీ, అనూహ్యంగా ఆరుగురికిపైగా కామనర్స్‌ను బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్‌గా పంపించనున్నారట.
అయితే, ఇదివరకు బిగ్ బాస్ తెలుగుకు కంటెస్టెంట్స్‌గా వచ్చే సెలబ్రిటీలపై తెగ బజ్ క్రియేట్ అయ్యేది. కానీ, బిగ్ బాస్ అగ్ని పరీక్ష వల్ల కామనర్స్ అట్రాక్ట్ చేశారు. దాంతో ఈసారి ఎప్పుడు లేనట్లుగా సామన్యులే సెలబ్రిటీలుగా మారారు. ఫేమ్ తెచ్చుకున్న సెలబ్రిటీలు ఎలాంటి బజ్ లేకుండా కామనర్స్‌గా అడుగుపెట్టనున్నారు.
ఇక గ్రాండ్ లాంచ్‌లో హోస్ట్ నాగార్జున అదిరిపోయే స్టైలిష్ లుక్‌తో కూలీ సాంగ్‌కి డ్యాన్స్ చేసి ఎంట్రీ ఇచ్చాడని సమాచారం. ఇటీవలే రజనీకాంత్ కూలీ మూవీలో సైమండ్ అనే పాత్రలో విలన్‌గా నాగార్జున చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ లో సెలబ్రిటీలు రావడం సర్వసాధారణమే.
అనుష్క శెట్టి & ఇతర సెలబ్రిటీలు
ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు 9 స్టేజీపైకి అనుష్క శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఘాటి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ అనుష్క గెస్టుగా హాజరైంది. ఇక బొంబాయికి రాను సాంగ్ ఫేమ్ రాము రాథోడ్ పాటతో ఎంట్రీ ఇచ్చాడు.
హీరోయిన్ ఆశా సైని, కమెడియన్స్ ఇమ్మాన్యూయేల్, సుమన్ శెట్టి ఏవీలతో పరిచయం చేసుకున్నారు. ఇప్పటివరకు వీటికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. ఇవాళ సాయంత్రం బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ ప్రోమోను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ అద్భుతంగా జరిగింది. మాజీ పోటీదారులు, సెలబ్రిటీలు, కామన్ పోటీదారులతో ఈ సీజన్ ఆసక్తికరంగా ఉండబోతుంది.


