|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ తెలుగు 9: ఇమ్మూ రెమ్యూనరేషన్ మామూలుగా లేదు! విన్నర్‌కు మించి ఎంత తీసుకున్నాడో తెలుసా?

Published: 20-12-2025, 11:44 AM
బిగ్ బాస్ తెలుగు 9: ఇమ్మూ రెమ్యూనరేషన్ మామూలుగా లేదు! విన్నర్‌కు మించి ఎంత తీసుకున్నాడో తెలుసా?
  • ఇమ్మాన్యుయెల్ బిగ్ బాస్ తెలుగు 9 నుండి 4వ స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు.
  • అతని రోజువారీ పారితోషికం రూ.35 వేలు, వారానికి రూ.2.25 లక్షలు.
  • మొత్తం 15 వారాలకు ఇమ్మాన్యుయెల్ రూ.33.75 లక్షలు అందుకున్నాడు.
  • ఈ మొత్తం దాదాపు విజేత అందుకునే పారితోషికానికి సమానం.

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. 4వ స్థానంలో ఇమ్మాన్యుయెల్ ఎలిమినేట్ కావడం, అతని భారీ పారితోషికం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 15 వారాలకుగానూ దాదాపు విజేతకు సమానంగా ఎంత అందుకున్నాడో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

బిగ్ బాస్ 9: ఎవరు ఎలిమినేట్ అయ్యారు?

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ ఒక్క రోజులో ముగియబోతుంది. కానీ ఇప్పుడు అంతా విన్నర్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో టాప్‌ 5లో ఉన్న కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌ జరుగుతుంది. ఇప్పటికే సంజనా ఎలిమినేట్‌ అయ్యింది. 5వ స్థానంలో సంజనా హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది. ఆమెని ప్రస్తుతం శివాజీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇక ఇప్పుడు టాప్‌ 4లో ఎవరు బయటకు వస్తారనేది మరింత ఉత్కంఠభరితంగా మారింది.

డీమాన్‌ పవన్‌ నాల్గో స్థానంలో హౌజ్‌ని వీడబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆర్డర్‌ మారిపోయింది. నాల్గో స్థానంలో ఇమ్మాన్యుయెల్‌ ఎలిమినేట్‌ అయ్యాడని సమాచారం. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. ఇదే ఇప్పుడు షాకింగ్‌గా మారింది. మొన్నటి వరకు ఇమ్మాన్యుయెల్‌ విన్నర్‌ రేసులో ఉన్నాడని అన్నారు. కానీ చివరికి టాప్‌ 4లో ఆయన్ని హౌజ్‌ నుంచి బయటకు పంపించడం షాకిస్తోంది.

ఇమ్మాన్యుయెల్ పారితోషికం: ఆశ్చర్యపరిచే నిజం!

బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లో 4వ స్థానంలో ఇమ్మాన్యుయెల్‌ ఎలిమినేట్‌ అయితే డీమాన్‌ పవన్‌ మూడో స్థానంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. మొన్నటి వరకు 5వ స్థానంలో ఉంటాడనుకున్న పవన్‌ ఇప్పుడు టాప్‌ 3లో హౌజ్‌ని వీడబోతుండటం విశేషంగా చెప్పొచ్చు. అయితే ఈ విషయంలో రీతూ చౌదరీ ప్రభావం గట్టిగా ఉందని తెలుస్తోంది. ఆమె గట్టిగా ఓట్లు పడేలా చేసిందని తెలుస్తోంది.

ఇక డీమాన్‌ పవన్‌ 3వ స్థానంలో ఎలిమినేట్‌ అయితే టాప్‌ 2లో తనూజ, కళ్యాణ్‌ ఉంటారు. వీరిద్దరి మధ్యనే టైటిల్‌ పోరు ఉంటుందని చెప్పొచ్చు. ఈ ఇద్దరిలో ఎవరు విన్నర్‌ అవుతారనేది మరింత ఆసక్తిని పెంచుతోంది. కళ్యాణ్‌ అని అంతా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు తనూజనే విన్నర్‌ అని మరికొందరు అంటున్నారు. వీరిలో ఎవరు విన్నర్‌ అనేది రేపటి వరకు క్లారిటీ రానుంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సారి బిగ్‌ బాస్‌ విన్నర్‌కి సంబంధించిన విషయం ఆద్యంతం ఉత్కంఠభరితంగా మారడం విశేషం.

బిగ్ బాస్ తెలుగు 9 విజేత ఎవరు?

నాల్గో స్థానంలో ఎలిమినేట్‌ అయిన ఇమ్మాన్యుయెల్‌ పారితోషికం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన రోజుకి రూ.35వేలు తీసుకుంటున్నాడట. ఇలా వారానికి రూ.2.25లక్షలు అని సమాచారం. ఈ లెక్కన ఇమ్మాన్యుయెల్‌కి భారీ పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. 15 వారాలకుగానూ ఏకంగా రూ.3375000 వరకు అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆల్మోస్ట్ విన్నర్‌ రేంజ్‌ ఇమ్మాన్యుయెల్‌కి పారితోషికం దక్కిందని చెప్పొచ్చు.

నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్‌ 7న బిగ్‌ బాస్‌ తెలుగు 9షో ప్రారంభమైన విషయం తెలిసిందే. 15 మంది కంటెస్టెంట్లతో ఈ షో స్టార్ట్ అయ్యింది. వీరిలో 9 మంది సెలబ్రిటీలు సంజనా, భరణి, శ్రష్టి వర్మ, ఫ్లోరా, సుమన్‌ శెట్టి, తనూజ, రాము రాథోడ్‌, ఇమ్మాన్యుయెల్‌, రీతూ చౌదరీ రాగా, ఆరుగురు కామనర్స్ మర్యాద మనీష్‌, హరిత హరీష్‌, కళ్యాణ్‌ పడాల, డీమాన్‌ పవన్‌, ప్రియా, శ్రీజ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. మధ్యలో మరో కామనర్‌ దివ్య వచ్చారు. వైల్డ్ కార్డ్ ద్వారా దివ్వెల మాధురి, రమ్య మోక్ష, గౌరవ్‌, శ్రీనివాస సాయి, నిఖిల్‌, ఆయేషా జీనత్‌ వచ్చారు. వీరి ఆ తర్వాత వారం నుంచే బ్యాక్‌ టూ బ్యాక్‌ ఎలిమినేట్‌ అవుతూ వచ్చారు. ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇక టాప్‌ 5లో కళ్యాణ్‌, తనూజ, ఇమ్మాన్యుయెల్‌, డీమాన్‌ పవన్‌, సంజనా ఉన్న విషయం తెలిసిందే.   ఇక శనివారం సంజనా, ఇమ్మాన్యుయెల్‌ ఎలిమినేట్‌ అయినట్టు సమాచారం. ఆదివారం మిగిలిన ఎలిమినేషన్‌తోపాటు ఫైనల్‌ షూట్‌ చేయబోతున్నారు.

బిగ్ బాస్ తెలుగు 9లో విజేత ఎవరైనా, ఇమ్మాన్యుయెల్ అందుకున్న భారీ పారితోషికం సీజన్ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది. అతని ఆదాయం, ఎలిమినేషన్ ఆశ్చర్యం కలిగించినా, ఇమ్మూకి మంచి క్రేజ్ లభించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.