|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌ బాస్‌ తెలుగు 9 లేటెస్ట్ ఓటింగ్‌.. టాప్‌లో దూసుకెళ్తొన్న తనూజ.. డేంజర్‌లో ఉన్నదెవరంటే?

Published: 02-12-2025, 7:31 AM
బిగ్‌ బాస్‌ తెలుగు 9 లేటెస్ట్ ఓటింగ్‌.. టాప్‌లో దూసుకెళ్తొన్న తనూజ.. డేంజర్‌లో ఉన్నదెవరంటే?
  • బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌లో 13వ వారం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు.
  • తనూజ అత్యధికంగా 30% ఓటింగ్‌తో టాప్‌లో దూసుకుపోతోంది.
  • రీతూ చౌదరీ రెండో స్థానంలో, సంజనా మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
  • డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి లీస్ట్ ఓటింగ్‌లో ఉండి డేంజర్‌లో ఉన్నారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ ఆసక్తికరంగా మారుతోంది. 13వ వారం నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్ల ఓటింగ్‌ వివరాలు వచ్చాయి. తనూజ టాప్‌లో దూసుకుపోతుండగా, లీస్ట్ ఓటింగ్‌తో డేంజర్‌లో ఉన్న కంటెస్టెంట్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

13వ వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లు

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ షో రాను రాను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా మారుతుంది. వారాలు దగ్గర పడుతున్న కొద్ది ఆట రసవత్తరంగా మారుతుంది. స్నేహాలు, బాండింగ్‌లు అన్నీ పటాపంచల్‌ అవుతున్నాయి. స్నేహంగా ఉన్నవాళ్లే గొడవలు పడే పరిస్థితి నెలకొంది. సోమవారం నామినేషన్‌ ఎపిసోడ్‌లో తనూజ, ఇమ్మాన్యుయెల్‌ ల మధ్య గట్టి వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు డీమాన్‌ పవన్‌ కూడా తాను సొంతంగానే గేమ్‌ ఆడతానని సవాల్‌ విసిరాడు.

ఇదిలా ఉంటే 13వ వారం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు.  తనూజ, భరణి, రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి, సంజనా ఈ వారం నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఇమ్మాన్యుయెల్‌, కళ్యాణ్‌ ఈ వారం సేఫ్‌లో ఉన్నారు. ఇక నామినేషన్‌లో ఉన్న వారికి పడుతున్న ఓటింగ్‌ శాతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోజు రోజు ఓటింగ్‌ ఎంత వస్తుందనేది క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తోంది. ప్రారంభం నుంచి ఎన్ని ఓట్లు పడతాయనేది చాలా ముఖ్యం. దీన్ని బట్టే ఈ వారం టాప్‌లో ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది తెలుస్తుంది.

ఓటింగ్‌లో టాప్‌లో తనూజ దూకుడు

ఈ లెక్కన సోమవారం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్‌ కాగా, ఇప్పుడు ఒక్క రోజులో నమోదైన ఓట్ల లెక్క చూస్తే ఈ వారం ఇప్పటి వరకు తనూజ అత్యధిక ఓటింగ్‌ శాతంతో టాప్‌లో దూసుకుపోతుంది. ఆమె ఎప్పుడు నామినేషన్‌లో ఉన్నా టాప్‌లోనే ఉంటుంది. మిగిలిన అందరు కంటెస్టెంట్లతో పోల్చితే ఆమెకి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి. టీవీ సెలబ్రిటీ కావడం, సెలబ్రిటీ ఫాలోయింగ్‌ ఉండటంతోపాటు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉంది. దీనికితోడు పీఆర్‌ని కూడా మెయింటేన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె అత్యధికంగా 30శాతం ఓటింగ్‌ తో టాలో దూసుకుపోతుంది.

డేంజర్‌లో పడిన కంటెస్టెంట్లు వీరే!

ఆ తర్వాత రీతూ చౌదరీ ఉంది. తనూజతో పోల్చితే సగం ఓటింగ్‌ శాతమే ఉన్నా, రెండో స్థానంలో కొనసాగడం విశేషం. ఇక టాప్‌ 3లో సంజనా ఉన్నారు. ఆమె గతంలో లీస్ట్ లో ఉండగా, ఇప్పుడు దూసుకుపోతుంది. ఆ తర్వాత భరణి ఉన్నారు. ఆయన నాల్గో స్థానానికి పరిమితమయ్యారు. ఇక లీస్ట్ లో డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి. వీరిలో సుమన్‌ శెట్టికి అతి తక్కువ ఓట్లు పడి చివర్లో ఉన్నారు. అయితే భరణికి, పవన్‌కి, సుమన్‌ శెట్టికి మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇదే కొనసాగితే ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ డేనే కావడంతో ఇప్పుడే ఏం చెప్పలేం, ఈ రోజు, రేపటి ఓటింగ్‌తో ఓ క్లారిటీ రాబోతుంది. అయితే ఈ వారంగానీ, వచ్చే వారంగానీ డబుల్‌ ఎలిమినేషన్‌కి కూడా ఛాన్స్ ఉందంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

ఇప్పటివరకు అందిన ఓటింగ్‌ ప్రకారం తనూజ టాప్‌లో ఉంది. అయితే ఇది మొదటి రోజు ఓటింగ్‌ మాత్రమే కాబట్టి, రాబోయే రోజుల్లో మార్పులు ఉండవచ్చు. చివరకు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.