|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదో వారం ఓటింగ్‌, డేంజర్‌లో ఈ కంటెస్టెంట్లు.. ఈ సారి ఊహించని ఎలిమినేషన్‌

Published: 14-11-2025, 7:21 AM
బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదో వారం ఓటింగ్‌, డేంజర్‌లో ఈ కంటెస్టెంట్లు.. ఈ సారి ఊహించని ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదో వారం ఓటింగ్‌ ఉత్కంఠగా సాగుతోంది. టాప్‌లో ఎవరున్నారు? డేంజర్‌ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు? ఈ వారం ఊహించని ఎలిమినేషన్‌ ఉంటుందా? బాల్య గుర్తుల ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలిచింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Key Points

1

తనూజ, కళ్యాణ్‌, రీతూ చౌదరీ టాప్‌ 3లో నిలిచారు.

2

దివ్య, నిఖిల్‌, డీమాన్‌ పవన్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు.

4

కంటెస్టెంట్ల బాల్య గుర్తులు ఎపిసోడ్‌ భావోద్వేగంగా సాగింది.

పదో వారం ఓటింగ్‌లో టాప్‌ కంటెస్టెంట్లు

బిగ్‌ బాస్‌ తెలుగు 9షో పదో వారం ఆసక్తికరంగా సాగుతోంది. ఫన్నీ స్కిట్లు, గొడవలు, అదిరిపోయే టాస్క్ లతో ఆకట్టుకుంటోంది. గత వారాలతో పోల్చితే ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్ బాగాానే ఉందని చెప్పొచ్చు. ఇక శుక్రవారం ఎపిసోడ్‌లో కన్నీళ్లు పెట్టించబోతున్నారు. చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా కంటెస్టెంట్లకి సంబంధించిన బాల్య గుర్తులను నెమరేసుకునే అవకాశాలు కల్పించారు. వారి చిన్ననాటి ఫోటోలను చూపించారు బిగ్‌ బాస్‌. ఈ సందర్బంగా తమ బాల్యానికి చెందిన గుర్తులను పంచుకుంటూ కొందరు ఎమోషనల్‌ అయ్యారు. ఈ ఎపిసోడ్‌ మొత్తం చాలా భావోద్వేగంగా, బ్యూటీఫుల్‌ మెమొరీగా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పదో వారం ఎవరు ఎలిమినేషన్‌ అవుతారనే చర్చ అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఈ వారం కెప్టెన్‌ ఇమ్మాన్యుయెల్‌ తప్ప మిగిలిన అందరు నామినేషన్‌లో ఉన్నారు. తనూజ, భరణి, దివ్య, సుమన్‌ శెట్టి, డీమాన్‌ పవన్‌, కళ్యాణ్‌, గౌరవ్‌ గుప్తా, నిఖిల్‌, సంజనా, రీతూ చౌదరీ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం హౌజ్‌ని వీడతారు? అనేది క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తోంది. ఈ వారం నామినేషన్లో ఉన్న వారికి ఓట్‌ వేసేందుకు ఈ ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉంది.

డేంజర్‌ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే

పదో వారం నామినేషన్‌కి సంబంధించి తనూజ టాప్‌లో ఉంది. ఆమెకి 26శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత కళ్యాణ్‌ ఉన్నాడు. ఆయనకు 24.5 శాతం ఓట్లు వచ్చాయి. ఇక టాప్‌ 3లో రీతూ చౌదరీ ఉంది. ఆమెకి దాదాపు 19శాతం ఓట్లు పడ్డాయి. డౌన్‌లో ఉంటారనుకున్న భరణి బాగానే పికప్‌ అందుకుంటున్నాడు. ఆయనకు ఎనిమిది శాతం ఓట్లు పడ్డాయి. అలాగే గౌరవ్‌ గుప్తా కూడా ఏడు శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. దాదాపు మూడు నుంచి నాలుగు శాతం ఓట్లతో సంజనా, సుమన్‌ శెట్టి ఆరు ఏడు స్థానాల్లో నిలవగా, దివ్య, నిఖిల్‌, డీమాన్‌ పవన్‌ లీస్ట్ లో ఉన్నారు. వీరికి మూడు శాతం ఓట్లు కూడా నమోదు కాలేదు.

ఇక లేటెస్ట్ క్రిటిక్స్ అంచనా ప్రకారం పదో వారం దివ్య, నిఖిల్‌, డీమాన్‌ పవన్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. వీరిలోనూ దివ్య, నిఖిల్‌ ఇంకా డేంజర్‌లో ఉన్నారని, ఈ వారం ఎలిమినేషన్‌ అవకాశం దివ్యకి ఉందని సమాచారం. దివ్యని అంతా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్ గా భావిస్తున్నారు. కానీ ఆమె ఇప్పుడు బాటమ్‌లో ఉంది. పైగా నిఖిల్‌, డీమాన్‌లకు మధ్య చాలా తక్కువ ఓట్ల డిఫరెన్స్ ఉంది. కాబట్టి శుక్రవారం నమోదయ్యే ఓట్లు వీరిలో ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది నిర్ణయిస్తుంది. అనధికారికంగా నిర్వహించిన పోలింగ్‌లో ఈ ఫలితం కనిపిస్తుంది. అయితే ఇందులో చాలా మంది దివ్య ఎలిమినేట్‌ కావాలని కోరుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ వారం ఎవరు హౌజ్‌ని వీడబోతున్నారో చూడాలి.

ఈసారి ఎలిమినేషన్‌పై ఉత్కంఠ

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ సెప్టెంబర్‌ 7న ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా ఈ షో రన్‌ అవుతుంది. మొదట 15 కంటెస్టెంట్లతో షో స్టార్ట్ కాగా, మధ్యలో దివ్య ఎంట్రీ ఇచ్చింది. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చారు. ఎలిమినేట్‌ అయిన భరణి మళ్లీ హౌజ్‌లోకి వచ్చాడు. ఈ మొత్తం కంటెస్టెంట్లలో ఏడుగురు కామనర్స్ ఎంట్రీ ఇవ్వగా, ప్రస్తుతం దివ్య, డీమాన్‌ పవన్‌, కళ్యాణ్‌ మాత్రమే హౌజ్‌లో ఉన్నారు. అయితే సెలబ్రిటీలకు మించి ఓటింగ్లో కళ్యాణ్‌ దూసుకుపోతుండటం విశేషం. ఈ సారి ఆయన విన్నర్‌ అయినా ఆశ్చర్యం లేదని, అదే జరిగితే కామనర్ చరిత్ర సృష్టించబోతున్నాడని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు హౌజ్‌ నుంచి శ్రీనివాస సాయి, దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీజ, హరిత హరీష్‌, మర్యాద మనీష్‌, ప్రియా, శ్రష్టి వర్మ, ఆయేషా జీనత్‌, రాము రాథోడ్‌ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే.

బిగ్‌ బాస్‌ పదో వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. దివ్య, నిఖిల్‌, డీమాన్‌ పవన్‌ డేంజర్‌ జోన్‌లో ఉండగా, ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది. శుక్రవారం ఓటింగ్‌ కీలకం కానుంది. ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.