
📌 Key Points
- బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకు చేరుకుంది, ప్రస్తుతం షో రసవత్తరంగా సాగుతోంది.
- తక్కువ స్కోర్ (100) కారణంగా సుమన్ గేమ్ నుండి వైదొలగాల్సి వచ్చింది.
- సుమన్ తన స్కోర్, డబ్బు సగం భరణికి ఇవ్వాలనుకోగా, భరణి సంజన పేరు సూచించారు.
- సంజన ఎమోషనల్ అవ్వడం, రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పడం ప్రేక్షకులను కదిలించింది.
బిగ్ బాస్ సీజన్-9 చివరి దశలో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో సుమన్, భరణిల మధ్య ఎమోషనల్ సంభాషణ, సంజన కంటతడి ప్రేక్షకులను కదిలించింది. వారి నిస్వార్థ ప్రేమ, స్నేహాన్ని చూసి తెలుగు ఆడియన్స్ ముగ్ధులయ్యారు, హౌస్‌లో వారు ఉండాలని కోరుకుంటున్నారు.
సుమన్ ఎమోషనల్ నిర్ణయం
బిగ్ బాస్ సీజన్-9(Bigg Boss-9) ఎట్టకేలకు ఫైనల్‌కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ షో ఎంతో రసవత్తరంగా కొనసాగుతుంది. అయితే ఈ వారం కళ్యాణ్(Pawan Kalyan Padala) తప్ప అందరూ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ బిగ్ బిస్ ఆడియన్స్‌కు హౌస్‌లో ఉన్న వాళ్ళు ఓట్‌కి అప్పీల్ చేసుకోవడం కోసం గేమ్స్ కండెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో లీడర్ బోర్డులో తక్కువ స్కోర్(100) ఉన్న కారణంగా సుమన్(Suman) ఈ పోరు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ అతని దగ్గర ఉన్న లక్ష రూపాయల్లో సగం అండ్ స్కోర్‌లో కూడా సగం హౌస్‌లో ఉన్న ఒకరికి ఇవ్వాల్సి వస్తుందని చెబుతారు.
భరణి సలహా – సంజన కంటతడి
అప్పుడు సుమన్ గార్డెన్ ఏరియాలోకి భరణి(Bharani)ని తీసుకొని పోయి నాకు ఈ హౌస్‌లో ఎవరూ లేరు మీరు తప్ప.. కాబట్టి ఈ స్కోర్ మీకు ట్రాన్స్ఫర్ చేద్దామనుకుంటున్నా అని ఏడుస్తూ అంటాడు. అప్పుడు భరణీ అయితే నాకు ఉపయోగ పడతది లేకపోతే ఈ స్కోర్ ఉపయోగపడే వ్యక్తి ఎవరు చెప్పు అనగానే సుమన్ సంజన(Sanjana) అని అంటాడు. అప్పుడు కరెక్ట్ ఈ మనీ అండ్ స్కోర్ ఆమెకు ఇచ్చేయండి అని భరణి అనగానే సుమన్ పోయి సంజనాతో నేను మీకే ఇద్దామనుకుంటున్నా అని అంటాడు.
ప్రేక్షకుల మనసులు గెలిచిన ప్రోమో
అప్పుడు సంజన బోరున ఏడుస్తూ రెండు చేతులు జోడించి నాకు ఎవరినైనా అడగాలంటే మొహమాటం అన్నా అని బాగా ఎమోషనల్ అవుతుంది. ఇక ఫైనల్‌గా బిగ్ బాస్ నేను సంజన గారికి మనీ ట్రాన్స్ఫర్ చేద్దామనుకుంటున్నా అని సుమన్ చెబుతాడు. ప్రస్తుతం ఈ ప్రోమో తెలుగు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఏడిపించేశావు బిగ్ బాస్.. నిజంగా భరణి, సుమన్ చాలా మంచివారు.. వాళ్లు హౌస్‌లో ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్ బాస్ 9 ప్రోమో సుమన్, భరణి, సంజనల మానవత్వాన్ని, భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ ఎమోషనల్ క్షణాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని, సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి. బిగ్ బాస్ ఈ ప్రోమోతో మనసులను ఏడిపించి, గెలిచాడు.


