
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే, VFX పనుల కారణంగా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా VFX పూర్తయిందని ప్రకటించారు. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…
Key Points
హరిహర వీరమల్లు సినిమా 6000కు పైగా VFX షాట్స్‌తో సరికొత్త రికార్డ్ సృష్టించింది.
వీఎఫ్‌ఎక్స్ విషయంలో బాహుబలిని మించి, ఆదిపురుష్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
చివరి నిమిషంలో వీఎఫ్‌ఎక్స్ పూర్తి కాక రిలీజ్ వాయిదా పడిన తర్వాత, ఇప్పుడు పూర్తయిందని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది.
6000 కంటే ఎక్కువ VFX షాట్స్
HariHara VeeraMallu : గత అయిదేళ్లుగా సాగి ఎట్టకేలకు షూట్ పూర్తి చేసుకుంది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి ప్రమోషన్స్ కూడా చేసారు. కానీ చివరి నిమిషంలో VFX వర్క్ అవ్వలేదని సినిమా రిలీజ్ వాయిదా వేశారు. తాజాగా హరిహర వీరమల్లు VFX వర్క్ కూడా పూర్తయిందని ట్వీట్ చేసారు మూవీ యూనిట్.
అయితే ఈ VFX విషయంలో హరిహర వీరమల్లు సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హరిహర వీరమల్లు సినిమాకు మొత్తం 6000కు పైగా VFX షాట్స్ వాడారని సమాచారం. డైరెక్టర్ జ్యోతి కృష్ణ కూడా ఈ సినిమాకు VFX వర్క్ ఎక్కువే ఉందని తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాకు ఏకంగా 6000 VFX షాట్స్ వాడారని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు.
బాహుబలి, ఆదిపురుష్ తో పోలిక
ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో అత్యధికంగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు 8000 VFX షాట్స్ వాడారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు 6000కు పైగా VFX షాట్స్ వాడారు. బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాకు 4500 లకు పైగా VFX షాట్స్ వాడారు. బాహుబలి 1 సినిమాకు 4000 కు పైగా VFX షాట్స్ వాడారు. రోబో 2.0 సినిమాకు 3400 కు పైగా VFX షాట్స్ వాడారు.
రిలీజ్ డేట్ అప్‌డేట్
అలా VFX విషయంలో హరిహర వీరమల్లు సినిమా బాహుబలిని మించిపోతే ఆదిపురుష్ మొదటి ప్లేస్ లో తర్వాత సెకండ్ ప్లేస్ లో హరిహర వీరమల్లు సినిమా నిలిచింది.
Also See : Anchor Sravanthi : గోవాలో సముద్రపు ఒడ్డున.. చీరలో యాంకర్ స్రవంతి.. ఫొటోలు..
హరిహర వీరమల్లు సినిమా VFX పని పూర్తయింది. బాహుబలి, ఆదిపురుష్ ల తర్వాత ఈ సినిమా VFX విషయంలో మూడవ స్థానంలో నిలిచింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.


