|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అతిపెద్ద పైరసీ ముఠా గుట్టు రట్టు.. సంచలన నిజాలు బయటపెట్టిన సీపీ CV ఆనంద్

Published: 29-09-2025, 11:07 AM
అతిపెద్ద పైరసీ ముఠా గుట్టు రట్టు.. సంచలన నిజాలు బయటపెట్టిన సీపీ CV ఆనంద్

దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా గుట్టును తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు CP CV ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించారు. ఈ పైరసీ వల్ల టాలీవుడ్‌కు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ సంఘటన సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది.

Key Points

1

దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు.

2

ఈ పైరసీతో టాలీవుడ్‌కు రూ.3,500 కోట్లు నష్టం వాటిల్లిందని సీపీ ఆనంద్ తెలిపారు.

4

ఓటీటీ, థియేటర్ కంటెంట్‌ను రికార్డ్ చేసి క్రిప్టో పేమెంట్స్ ద్వారా అమ్ముకున్నారు.

పైరసీ ముఠా గుట్టు రట్టు: సీపీ ఆనంద్ వెల్లడి

మూవీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ (Telangana Cyber Crime Police) పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు ఆ ముఠాకు చెందిన మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అయితే, నిందితుల అరెస్ట్‌పై ఇవాళ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలను బయటపెట్టారు.

పైరసీ ముఠా దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్‌లో ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ఈటీవీ విన్ కంటెంట్‌ను కూడా నిందితులు పైరసీ చేసి అమ్ముకున్న హర్షవర్ధన్‌ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. రికార్డు చేసిన కంటెంట్‌ను ఇతర వెబ్‌సైట్లకు విక్రయిస్తూ పైరసీ ముఠా సొమ్ము చేసుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్‌ను ఐబొమ్మ, బప్పం టీవీ సహా పలు ప్లాట్‌ఫామ్‌లకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించామని అన్నారు. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కూడా క్రాక్ చేస్తున్నట్లుగా నిర్ధారించామని తెలిపారు. ముఖ్యంగా ఏజెంట్లను అడ్డం పెట్టుకుని ఎవరికీ ఎక్కడా అనుమానం రాకుండా కంటెంట్‌ను నేరగాళ్లు రికార్డు చేయిస్తున్నారని అన్నారు. కొత్త సినిమా విడుదలైన మొదటి రోజే ఏజెంట్లకు ముఠా ఫస్ట్ షో టికెట్లు బుక్ చేసి హై రిజల్యూషన్ రికార్డింగ్ ఎక్విప్‌మెంట్‌ను ఇచ్చి ఫుటేజీ తీసుకుంటున్నారని తెలిపారు. థియేటర్లలో రహస్యంగా ఎలా రికార్డు చేయాలో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారని వెల్లడించారు.

టాలీవుడ్‌కు రూ.3500 కోట్ల నష్టం

క్రిప్టో కరెన్సీ పేమెంట్స్‌‌తో కేసులో క్లూ..

దుబాయ్ నుండి క్రిప్టో క్లూస్ వరకు

ఈ పైరసీ ముఠా మూవీ పైరసీ కారణంగా గతేడాది తెలుగా సినిమా ఇండస్ట్రీకి రూ.3,500 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఓ నిందితుడికి బెట్టింగ్ యాప్ నుంచి నెలకు దాదాపు రూ.9 లక్షల వరకు చెల్లింపులు జరిగినట్లుగా గుర్తించామని అన్నారు. క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ ద్వారా తమకు కొంత కేసులో క్లూ దొరికిందని తెలిపారు. నిందితులు డిజిటల్ మీడియా సర్వరస్ మొత్తం హ్యాక్ చేసే నైపుణ్యం సంపాదించారని, కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ వెబ్‌సైట్లను కూడా హ్యాచ్ చేశారని మీడియా దృష్టి తీసుకొచ్చారు. చివరికి ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ను కూడా వదల లేదని అన్నారు.

ఈ పైరసీ ముఠా సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించింది. నిందితులను పట్టుకోవడం ద్వారా టాలీవుడ్‌కు ఊరట లభించింది. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.