|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్లాక్‌బస్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. దసరా కంటే ముందే..

Published: 26-09-2025, 6:18 PM
బ్లాక్‌బస్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. దసరా కంటే ముందే..

సెప్టెంబర్‌లో సర్‌ప్రైజ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్ త్వరలో ఓటీటీలోకి వస్తోంది. కేవలం రూ.2.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.33.8 కోట్లు వసూలు చేసింది. దసరా పండుగకు ముందే అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఎక్స్‌టెండెడ్ కట్‌తో స్ట్రీమింగ్ కానుంది.

Key Points

1

లిటిల్ హార్ట్స్ మూవీ రూ.2.4 కోట్ల బడ్జెట్‌తో రూ.33.8 కోట్లు వసూలు చేసింది.

2

ఈటీవీ విన్ ఓటీటీలో అక్టోబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది.

4

మౌళి తనూజ్, శివానీ నాగారం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు.

లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్

తెలుగులో సెప్టెంబర్ లో సర్‌ప్రైజ్ బ్లాక్‌బస్టర్ లిటిల్ హార్ట్స్ (Little Hearts). ఈ రొమాంటిక్ కామెడీ మూవీ కేవలం రూ.2.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ.33.8 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ నెల రోజుల్లోపే ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్

మౌళి తనూజ్, శివానీ నాగారం నటించిన మూవీ లిటిల్ హార్ట్స్ . ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ సినిమా అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే దసరాకు ఒక రోజు ముందే డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. అది కూడా ఎక్స్‌టెండెడ్ కట్ తో కావడం విశేషం. అంటే థియేటర్లలో లేని సీన్లు కూడా ఓటీటీలో ఉండబోతున్నాయి.

లిటిల్ హార్ట్స్ మూవీ విజయం

“ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ మీ ఇంటికి వస్తోంది. ఈసారి పెద్దగా, స్వీటుగా, క్రేజీగా ఉండనుంది. లిటిల్ హార్ట్స్ (ఎక్స్‌టెండెడ్ కట్). విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

లిటిల్ హార్ట్స్ మూవీ గురించి..

సినిమా కథాంశం, నటీనటులు

లిటిల్ హార్ట్స్ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. అదే రోజు అనుష్క ఘాటి మూవీ రిలీజైనా.. దానిని మించి తొలి రోజు వసూళ్లలో సంచలనం సృష్టించింది. సాయి మార్తాండ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మౌళి తనూజ్ తోపాటు శివానీ నాగారం, రాజీవ్ కనకాల నటించారు. #90’s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హసన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. ఊహకందని రీతిలో బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. కేవలం రూ.2.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. ఏకంగా రూ.33.8 కోట్లు వసూలు చేసింది.

ఈ సినిమా నల్లి అఖిల్ కుమార్ (మౌళి తనూజ్), కాత్యాయని (శివానీ నాగారం) చుట్టూ తిరుగుతుంది. అఖిల్ ఓ ఇంజినీర్ కావాలని అతని తండ్రి కలలు కంటాడు. కానీ అతనికి ఎంసెట్ ర్యాంకు రాకపోవడంతో లాంగ్ టర్మ్ కోర్సులో చేరతాడు. అక్కడ అతనికి కాత్యాయని కలుస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ తర్వాత వీళ్ల ప్రేమ పేరెంట్స్ దగ్గరికి చేరుతుంది. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. తర్వాత ఏమైందన్నది ఈ మూవీలో చూడాలి.

అంచనాలను మించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన లిటిల్ హార్ట్స్ సినిమాను ఇప్పుడు ప్రేక్షకులు తమ ఇంట్లోనే చూడవచ్చు. ఎక్స్‌టెండెడ్ కట్‌తో ఈ సినిమా ఓటీటీలో మరింత ఆసక్తికరంగా ఉండనుంది. దసరా సెలవులకు ముందే ఈ వినోదాన్ని ఆస్వాదించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.