|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాబీ డియోల్ ‘బందర్’: సమ్మర్ ధమాకా.. రిలీజ్ డేట్ ఫిక్స్! ఫ్యాన్స్ కి పండగే!!

Published: 20-02-2026, 7:05 AM
బాబీ డియోల్ 'బందర్': సమ్మర్ ధమాకా.. రిలీజ్ డేట్ ఫిక్స్! ఫ్యాన్స్ కి పండగే!!
  • బాబీ డియోల్ ‘బందర్’ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మే 22, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల!
  • అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో క్రైమ్ సోషియో-పొలిటికల్ కథతో తెరకెక్కిన ‘బందర్’ మూవీ!
  • టొరంటో అంతర్జాతీయ చలన చిత్ర వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శనగా ‘బందర్’ మూవీ స్క్రీనింగ్!
  • సన్యా మల్హోత్రా, రాజ్ బి శెట్టి, జితేంద్ర జోషి కీలక పాత్రల్లో నటించిన ‘బందర్’!

బాలీవుడ్ సెన్సేషన్ బాబీ డియోల్ హీరోగా, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వస్తున్న ‘బందర్’ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా విడుదల కానుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

సమ్మర్ స్పెషల్ గా బాబీ డియోల్ మూవీ

బాలీవుడ్ సెన్సేషన్ బాబీ డియోల్(Bobby Deol) హీరోగా, దర్శక దిగ్గజం అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) దర్శకత్వంలో తెరకెక్కిన ‘బందర్’ (Bander)మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మే 22, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ, ‘‘మే 22న థియేటర్లలో కలుద్దాం’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కావడానికి ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. 2025లో జరిగిన 50వ టొరంటో అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో (TIFF) ఈ చిత్రాన్ని ప్రదర్శించినట్లు సమాచారం.

అక్కడ ‘స్పెషల్ ప్రెజెంటేషన్’ విభాగంలో స్క్రీనింగ్ అయిన ఈ మూవీకి విదేశీ ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. అనురాగ్ కశ్యప్ తనదైన క్రైమ్ సోషియో-పొలిటికల్ శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టాక్. గతంలో అనురాగ్‌తో కలిసి పనిచేసిన సుదీప్ శర్మ ఈ చిత్రానికి కథ అందించగా, అభిషేక్ బెనర్జీ స్క్రిప్ట్ వర్క్‌లో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ ద్వివేది నిర్మించిన ఈ ప్రాజెక్టును జీ స్టూడియోస్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. బాబీ డియోల్‌తో పాటు ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, రాజ్ బి శెట్టి, జితేంద్ర జోషి, సప్నా పబ్బి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా కథాంశంపై మేకర్స్ ఇప్పటివరకు గోప్యత పాటించినప్పటికీ, ఇదొక పవర్‌ఫుల్ క్రైమ్ డ్రామాగా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.

టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో బందర్ మూవీ

క్రైమ్ సోషియో పొలిటికల్ డ్రామా!

బాబీ డియోల్ ‘బందర్’ మూవీ విడుదల తేదీ ఖరారు కావడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువెలుస్తుంది. ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.