|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. న్యూమోనియాతో బాలీవుడ్ నటుడు ధీరజ్ కుమార్ మృతి

Published: 15-07-2025, 11:33 AM
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. న్యూమోనియాతో బాలీవుడ్ నటుడు ధీరజ్ కుమార్ మృతి

తాజాగా మరో విషాద వార్త సినీ పరిశ్రమను కుదిపేసింది. బాలీవుడ్ నటుడు ధీరజ్ కుమార్ న్యూమోనియాతో కన్నుమూశారు. ముంబై లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.

Key Points

1

న్యూమోనియాతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు ధీరజ్ కుమార్ మృతి.

2

ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

4

బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు.

ధీరజ్ కుమార్ మృతి

గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒకరి మరణవార్తను మర్చిపోకముందే మరొకరు మరణించడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దిగ్గజ నటుడు కోట శ్రీనివాస రావు మరణం నుంచి ఇంకా కోలుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి బి. సరోజాదేవి (87) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

న్యూమోనియాతో పోరాటం

అలాగే స్టంట్ మ్యాన్ మోహన రాజు షూటింగ్‌ జరుగుతుండగా.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కారు బోల్తా స్టంట్ చేస్తుండగా.. గుండెపోటుతో అక్కడిక్కడే మరణించాడు. తాజాగా, మరో నటుడు కన్నుమూశారు. బాలీవుడ్ నిర్మాత, నటుడు ధీరజ్ కుమార్ (79) (Dheeraj Kumar)తుదిశ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా నిమోనియాతో బాధపడుతూ ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో వెంటి లేటర్‌‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో నేడు కన్నుమూశారు.

సినీ పరిశ్రమలో విషాదం

కుమార్ సన్నిహితుడు అజయ్ శుక్లా(Ajay Shukla)ఈ విషయాన్ని ప్రకటించారు. “ఈ రోజు ఉదయం 11:00 గంటలకు కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో న్యుమోనియా కారణంగా ఆయన మరణించారు. కుమార్ అంత్యక్రియలు బుధవారం పవన్ హన్స్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు శుక్లా తెలిపారు. ఇక ధీరజ్ మరణ వార్త గురించి తెలుసుకున్న నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ధీరజ్ కుమార్ మరణంతో సినీ పరిశ్రమ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.