
📌 Key Points
- బాలీవుడ్ నటి హిమాన్షి ఖురానాకు రూ.10 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు ఈమెయిల్.
- జీషన్ అక్తర్ పేరుతో వచ్చిన ఈమెయిల్‌లో డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక.
- హిమాన్షి ఖురానా మొహాలీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- గతంలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి హీరోలకు కూడా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ నటి హిమాన్షి ఖురానాకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.
హిమాన్షి ఖురానాకు బెదిరింపు కాల్స్
Bollywood:ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో బెదిరింపులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ ని మొదలుకొని షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి దిగ్గజ హీరోలకు బెదిరింపు మెసేజ్లు రావడమే కాకుండా హత్య బెదిరింపులు కూడా రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు అయితే ఇప్పుడు హీరోల వరకే ఈ బెదిరింపులు అనుకుంటే ఇప్పుడు హీరోయిన్ కి కూడా బెదిరింపులు తప్పలేదని తెలుస్తోంది. ముఖ్యంగా 10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని ఆమెను హెచ్చరించడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
విషయంలోకి వెళ్తే.. ప్రముఖ బాలీవుడ్ నటిగా, గాయకురాలిగా మంచి పేరు దక్కించుకుంది హిమాన్షి ఖురానా. తాజాగా ఈమెకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ప్రాణహాని ఉంది అంటూ హెచ్చరిక రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జీషన్ అక్తర్ అనే పేరుతో పంపిన ఈమెయిల్ లో 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని , లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒక వాయిస్ నోట్ ద్వారా నిందితుడు హిమాన్షిని బెదిరించారు. దీంతో అప్రమత్తమైన ఆమె వెంటనే మొహాలీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇకపోతే హీరోలకే కాదు ఇప్పుడు నటీమణులను కూడా టార్గెట్ గా చేసుకొని ఇలాంటి హత్యా బెదిరింపులు రావడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.ఏది ఏమైనా ఇలా సెలబ్రిటీలు వరుసగా హత్య బెదిరింపులు, వాయిస్ మెసేజ్ లు ఎదుర్కోవడం అందరిని భయభ్రాంతులకు గురిచేస్తోందని చెప్పవచ్చు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
హిమాన్షి విషయానికి వస్తే.. 1991 నవంబర్ 27న పంజాబ్లోని కిరాత్ పూర్ సాహిబ్ లో జన్మించింది 16వ ఏటా మిస్ లుథియానా పోటీలో పాల్గొన్న ఈమె.. అక్కడ గెలిచి మోడలింగ్ కెరీర్ ను ప్రారంభించింది. 2017 లో మిస్ పి టి సి పంజాబీ ఫైనల్ లిస్టులలో ఒకరిగా నిలిచిన హిమాన్షి 2017 లోనే చండీగఢ్లో నిర్వహించిన మిస్ నార్త్ జోన్ పోటీలో విజేతగా నిలిచింది. బిగ్బాస్ సీజన్ 13 లో కంటెస్టెంట్ గా పాల్గొని ఊహించని పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బాలీవుడ్‌లో పెరుగుతున్న బెదిరింపులు
ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్త.. ఈమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని 2019 నవంబర్లో ప్రసారమైన బిగ్ బాస్ 13 రియాల్టీ షోలో అధికారికంగా ప్రకటించింది. అయితే 2020 జనవరిలో అతనితో ఆ ప్రేమ ముగిసిందని ఆమె ట్విట్టర్ వేదికగా పంచుకోవడం గమనార్హం. ఇక తర్వాత 2020 జనవరి నుండి తన బిగ్ బాస్ కో కంటెస్టెంట్ అసిన్ రియాజ్తో డేటింగ్ చేస్తోంది. ఇప్పుడు ఇలా బెదిరింపులు ఎదుర్కోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రముఖ నటులకే కాదు, నటీమణులకు కూడా బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ కేసును ఎంతవరకు చేధిస్తారో వేచి చూడాలి. ఇలాంటి బెదిరింపులు సినీ పరిశ్రమలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.


