
📌 Key Points
- సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ వర్గం నుండి హత్యా బెదిరింపులు, ఇంటిపై కాల్పులు.
- రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపు కాల్స్, డబ్బు డిమాండ్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్.
- ముంబైలో దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వెలుపల కాల్పుల ఘటన.
- గత 15 రోజుల్లో దాదాపు డజన్ మంది సినీ సెలబ్రిటీలకు బెదిరింపు కాల్స్.
బాలీవుడ్‌లో బిష్ణోయ్ వర్గం బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ వంటి ప్రముఖ నటులకు హత్యా బెదిరింపులు వస్తున్నాయి. దీంతో సినీ పరిశ్రమలో భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సల్మాన్ ఖాన్‌కు వరుస బెదిరింపులు, భద్రత కట్టుదిట్టం
Lawrence Bishnoi: గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ లో ఉండే కొంతమంది సెలబ్రిటీలను టార్గెట్గా చేసుకొని హత్యా బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బిష్ణోయ్ వర్గం నుండి ఈ బెదిరింపులు సెలబ్రిటీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.. ఈ క్రమంలోనే మొన్నటి వరకు బాలీవుడ్ కండలవీరుడిగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ (Salman Khan) కి వరుసగా బెదిరింపులు రావడమే కాకుండా ఆయనపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. ముఖ్యంగా ఆయన ఇంటిపై కాల్పులు కూడా జరిపారు. అంతేకాదు ఆయన బయట తిరగాలి అంటే కూడా భయపడే స్టేజ్ కి ఆయనను తీసుకొచ్చారు. గత సంవత్సరం బిగ్ బాస్ సీజన్ 19 షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సమయంలో కూడా సెక్యూరిటీ సమక్షంలోనే ఆయన హోస్ట్ గా వ్యవహరించారు. అంతేకాదు 2కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కార్ ను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
అటు సల్మాన్ ఖాన్ తోపాటు షారుక్ ఖాన్ , అమీర్ ఖాన్ లను కూడా చంపేస్తామని కొంతమంది దుండగులు, గ్యాంగ్ స్టర్లు బెదిరించారు కూడా.. అయితే ఇదంతా బిష్ణోయ్ వర్గం నుండి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలు మరువక ముందే ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కి(Ranveer Singh) కూడా ఈ వర్గం నుండి బెదిరింపులు రావడం ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. హీరో రణవీర్ సింగ్ వాట్సప్ కి వాయిస్ మెసేజ్ పంపారు.. అందులో దుండగులు హీరో రణవీర్ ను ఉద్దేశించి.. కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేశారు. తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వారమని, తమ డిమాండ్ నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారట. వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ ను ఆశ్రయింగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పైగా రణవీర్, తన భార్య దీపికా పదుకొనే, కూతురు దువాతో కలిసి ఉంటున్న నివాసం వద్ద భద్రతను గణనీయంగా పెంచారు.
రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపు కాల్స్, డబ్బు డిమాండ్
రోహిత్ శెట్టి నివాసం వెలుపల కాల్పులు, కలకలం
దీనికి తోడు ముంబైలో ప్రముఖ దర్శకుడిగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న రోహిత్ శెట్టి (Rohith Shetty) నివాసం వెలుపల కాల్పులు జరిగిన సంఘటన అందరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని.. గత 15 రోజుల్లోనే దాదాపు డజన్ మంది సినీ సెలబ్రిటీలకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. ఇకపోతే రణవీర్ తన నివాసం వద్ద ఆరుగురు సాయుధ ప్రైవేటు గార్డులను కూడా నియమించుకోగా.. వారి కదలికలపై తోటి నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు లేఖ కూడా రాశారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సెలబ్రిటీలతో పాటు సెలబ్రిటీ వ్యక్తిగత సిబ్బందిని కూడా హత్య చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక వరుస బెదిరింపుల హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై భద్రతా చర్యలను చేపట్టారు.. ఏది ఏమైనా సెలబ్రిటీలకు ఇలా వరుసగా బెదిరింపులు రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
బాలీవుడ్ సెలబ్రిటీలకు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలు సినీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.


