|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దురంధర్ విజయంపై బాలీవుడ్ కుట్ర! కోహ్లీ సంచలన ఆరోపణలు, అసలు నిజం బయటపెట్టిన డైరెక్టర్!

Published: 15-04-2026, 11:35 AM
దురంధర్ విజయంపై బాలీవుడ్ కుట్ర! కోహ్లీ సంచలన ఆరోపణలు, అసలు నిజం బయటపెట్టిన డైరెక్టర్!
  • దురంధర్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
  • బాలీవుడ్ పెద్దలు సినిమాను మెచ్చుకోవడం లేదు.
  • సినిమా ఫ్లాప్ అవుతుందని కొందరు దర్శకులు ఆశించారు: కునాల్ కోహ్లీ.
  • సపోర్ట్ చేయని బాలీవుడ్ పై కునాల్ కోహ్లీ విమర్శలు.

దురంధర్ సినిమా విజయం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాను కొందరు కావాలనే తొక్కేస్తున్నారని దర్శకుడు కునాల్ కోహ్లీ ఆరోపించారు. బాలీవుడ్ పెద్దల అసూయను ఆయన బయటపెట్టారు.

దురంధర్ విజయంపై బాలీవుడ్ అసూయ?

Durandhar 2: దురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొడుతుంటే ఎవరు హ్యాపీ గా ఉండరు ?..కానీ ఇదిగో వీళ్ళు మాత్రం అస్సలు హ్యాపీగా ఉండరు అంటూ బాలీవుడ్ కుళ్ళు ని బయటపెట్టేస్తున్నాడు కోహ్లీ. ఇక్కడ కోహ్లీ అంటే మన ఇండియన్ క్రికెటర్ అనుకునేరు..బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ..ఈయన ఎవరో కాదు అమీర్ ఖాన్ తో ఫనా తీసింది ఈయనే.ఇక అసలు విషయంలోకి వెళ్తే ధురంధర్’ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న సునామీకి బాలీవుడ్ టాప్ డైరక్టర్స్ మైండ్ బ్లాంక్ అవుతున్న సంగతి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.వేల కోట్ల వసూళ్లతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తున్న ఈసినిమాని మెచ్చుకోవడానికి బాలీవుడ్ పెద్దలకు మనసు రావడం లేదు. అయితే ఇదిగో ఆ సైలెన్స్ వెనుకున్న అసలు నిజం ఇదే అంటూ బాలేవుద్ బాబుల కడుపు మంటని కునాల్ కోహ్లీ బయటపెట్టడం ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ అయ్యింది. సంచలనంగా మారింది.

రికార్డులు ధురంధర్ సొంతం.. అభినందనలు వేరే వాళ్లకా?

‘బాహుబలి 2’ రికార్డులను వెనక్కి నెట్టి, ‘పుష్ప 2’ రేంజ్‌ను దాటేసి ఆల్ టైమ్ ఇండియన్ టాప్-2 గ్రాసర్‌గా ‘ధురంధర్ 2’ నిలిచిన సంగతి తెల్సిందే. అయితే టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ నుంచి ఏ చిన్న హిట్ వచ్చినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే బాలీవుడ్ బ్యాచ్, తమ కళ్ల ముందే ఇంతటి హిస్టారికల్ హిట్ కనిపిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చోవడంతో ఈ సినిమాకు ప్రాపగాండా అనే ముద్ర వేసి గ్రూపు పాలిటిక్స్ తో దీన్ని తొక్కేయాలని చూస్తున్నారా? అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.

కునాల్ కోహ్లీ సంచలన ఆరోపణలు

సోమవారానికి పనైపోతుంది అన్నారు.. కానీ!

ఈ క్రమంలో ఆమిర్ ఖాన్‌తో ‘ఫనా’ వంటి క్లాసిక్ తీసిన కునాల్ కోహ్లీ, బాలీవుడ్ టాప్ డైరెక్టర్ల అసలు రంగును ఇదిగో ఇలా బయటపెట్టారు. “ధురంధర్ రిలీజ్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. నేను కొందరు అగ్ర దర్శకులతో మాట్లాడినప్పుడు.. ఈ సినిమా సోమవారానికే పడిపోతుంది, పబ్లిక్ రిజెక్ట్ చేస్తారు అని ఎంతో ఆశగా చెప్పారు. కానీ వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ సోమవారం నాడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపించింది. ఆ సినిమా ఫ్లాప్ కావాలని కోరుకున్న వారందరికీ ప్రేక్షకులు గట్టి షాక్ ఇచ్చారు” అని సెన్సేషన్ కామెంట్స్ చేశాడు కునాల్.

సన్నీ డియోల్‌కు కూడా తప్పని తిప్పలు!

కునాల్ కోహ్లీ కేవలం ధురంధర్ గురించే కాదు, సన్నీ డియోల్ ‘బోర్డర్-2’ గురించి కూడా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకొచ్చాడు.ఆ సినిమా కూడా డిజాస్టర్ అవ్వాలని చాలామంది ప్రార్థించారని, కానీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు దానికి 300 కోట్ల వసూళ్లు కట్టబెట్టి బ్లాక్ బస్టర్ చేశారని గుర్తు చేశారు. ఇండస్ట్రీలో ఉన్న కుళ్లు రాజకీయాలు పక్కన పెడితే, ప్రేక్షకులకు నచ్చితే సినిమాను ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.

బాలీవుడ్ గ్రూప్ రాజకీయాలు?

వెన్నుపోటు రాజకీయాలు vs బాక్సాఫీస్ విజయాలు

బాలీవుడ్‌లో ఒక వర్గం వారు తమకు నచ్చిన సినిమాలను మాత్రమే ప్రమోట్ చేస్తూ, ప్రజలకు నచ్చిన సినిమాలను విస్మరిస్తున్నారనే విమర్శలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఒక పక్క ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంటే, మరోపక్క బాలీవుడ్ బాబులు ఇలా సైలెంట్ గా ఉండిపోవడం వారి న్యారో మైండ్ ని చెప్పకనే చెబుతుందని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.మొత్తానికి కునాల్ కోహ్లీ చేసిన కామెంట్స్ బాలీవుడ్ రాజకీయాలని రచ్చకీడ్చినట్టే కనిపిస్తుంది. చూడాలి మరి కునాల్ చేసిన కామెంట్స్ పై బీ టౌన్ ఎలా రియాక్ట్ అవుతుందో !

దురంధర్ సినిమా విషయంలో బాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. కునాల్ కోహ్లీ ఆరోపణలు బాలీవుడ్ రాజకీయాలను మరోసారి తెరపైకి తెచ్చాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.