
📌 Key Points
- ‘దురంధర్’ బాలీవుడ్‌లో డిసెంబర్ 5న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
- ఈ స్పై థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
- మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో జనవరి 1 లేదా 2న తెలుగులో విడుదల కానుంది.
- ‘దురంధర్’ పార్ట్ 2 మార్చి 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
బాలీవుడ్‌లో ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన స్పై థ్రిల్లర్ ‘దురంధర్’ తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి అంచనాలను మించిపోయింది. తెలుగులో దీని విడుదల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వచ్చేసింది.
‘దురంధర్’ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సంచలనం
Dhurandhar : ఇటీవల బాలీవుడ్ లో రిలీజయిన స్పై థ్రిల్లర్ సినిమా ‘దురంధర్’. పాకిస్థాన్ కి వెళ్లి అక్కడ పనిచేసిన ఓ ఏజెంట్ కథతో, రియల్ లైఫ్ లో జరిగిన పాకిస్థాన్ – భారత్ కి చెందిన కొన్ని సంఘటనల నేపథ్యంలో దురంధర్ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, మాధవన్.. కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. (Dhurandhar)
దురంధర్ బాలీవుడ్ లో డిసెంబర్ 5 న రిలీజయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. మన తెలుగు వాళ్ళు మంచి సినిమాలు ఎక్కడున్నా వదిలిపెట్టరని తెలిసిందే. దీంతో దురంధర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇది కేవలం హిందీలోనే రిలీజయింది. ఇప్పటికే పలువురు తెలుగు ప్రేక్షకులు దురంధర్ హిందీ వర్షన్ ని చూసారు. తెలుగులో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
తెలుగులో ‘దురంధర్’ విడుదల ఎప్పుడు?
దురంధర్ సినిమా తెలుగులో చూద్దామని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు శుభవార్త వచ్చింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. డిసెంబర్ 25 న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేయగా ఆ రోజు దాదాపు 12 తెలుగు సినిమాలు ఉండటంతో వెనక్కి తగ్గారు. తాజా సమాచారం ప్రకారం దురంధర్ సినిమా తెలుగులో న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న లేదా జనవరి 2న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.
‘దురంధర్’ పార్ట్ 2 పై తాజా అప్‌డేట్
దీంతో ఈ సినిమా తెలుగులో కూడా భారీగానే వసూలు చేస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంది. దురంధర్ పార్ట్ 2 సినిమా మార్చ్ 2026 లో రిలీజ్ కానుంది.
ఈ ‘దురంధర్’ చిత్రం బాలీవుడ్‌లో సాధించిన అఖండ విజయంతో, తెలుగులోనూ భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా. మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేయనున్న ఈ చిత్రం, న్యూ ఇయర్ కానుకగా సినీ ప్రియులను అలరించనుంది. పార్ట్ 2 కూడా ఆకట్టుకోనుంది.


