
📌 Key Points
- సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు, భద్రత కట్టుదిట్టం!
- రణవీర్ సింగ్‌కు వాట్సాప్ ద్వారా రూ. కోట్ల డిమాండ్, బెదిరింపు కాల్!
- పోలీసులకు ఫిర్యాదు చేసిన రణవీర్ సింగ్, ఇంటి వద్ద భద్రత ఏర్పాటు!
- బాలీవుడ్‌లో భయం గుప్పిట్లో నటులు, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌గా సెలబ్రిటీలు!
బాలీవుడ్‌లో సంచలనం! సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల తర్వాత ఇప్పుడు రణవీర్ సింగ్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. అసలు ఈ గ్యాంగ్ ఎందుకు బాలీవుడ్‌ను టార్గెట్ చేసింది? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
సల్మాన్‌కు భద్రత కట్టుదిట్టం!
Bollywood : బాలీవుడ్ నటీనటులకు ఇప్పుడు భయం నెలకొంది. గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్ బాలీవుడ్ ని బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ని చంపుతామని పలుమార్లు ఈ గ్యాంగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కి భారీ భద్రత ఏర్పాటు చేయడం, బుల్లెట్ ప్రూఫ్ కార్ లో తిరగడం చేసారు.(Bollywood)
రణ్‌వీర్‌కు బెదిరింపు కాల్.. అసలేం జరిగింది?
డైరెక్ట్ గా సల్మాన్ ఖాన్ కి బెదిరింపుల తర్వాత ఇప్పుడు బాలీవుడ్ మరో స్టార్ హీరో రణవీర్ సింగ్ కి బెదిరింపులు వచ్చాయి. రణవీర్ సింగ్ వాట్సాప్ కి కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేస్తూ ఓ అజ్ఞాత వ్యక్తి వాయిస్ నోట్ పంపించాడు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన వ్యక్తి అని బెదిరించాడు.
భయంతో వణికిపోతున్న బాలీవుడ్!
రణవీర్ ఈ వాయిస్ నోట్ ని పోలీసులకు అందించి ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు ప్రస్తుతం రణవీర్ ఇంటి బయట భద్రతని ఏర్పాటు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మొన్న సల్మాన్, ఇప్పుడు రణవీర్ సింగ్.. లాంటి స్టార్ హీరోలను బెదిరించడంతో బాలీవుడ్ భయపడుతుంది.
బాలీవుడ్‌లో వరుస బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌గా సెలబ్రిటీలు భయాందోళనలో ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో అందిస్తాం. అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


