|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బార్డర్ 2 విధ్వంసం: ఫస్ట్ రోజే రికార్డులు బ్రేక్! సన్నీ డియోల్ మాస్ జాతర షురూ!!

Published: 24-01-2026, 9:05 AM
బార్డర్ 2 విధ్వంసం: ఫస్ట్ రోజే రికార్డులు బ్రేక్! సన్నీ డియోల్ మాస్ జాతర షురూ!!
  • సన్నీ డియోల్ ‘బార్డర్ 2’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ: దుమ్ము రేపిన వసూళ్లు!
  • ‘ధురంధర్‌’ రికార్డు బ్రేక్ చేసిన ‘బార్డర్ 2’: సన్నీ డియోల్ స్టామినాకు నిదర్శనం.
  • ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ఓవర్సీస్‌లో రూ. 5 కోట్లు వసూలు చేసిన ‘బార్డర్ 2’.
  • వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి కీలక పాత్రల్లో అద్భుత నటన.

సన్నీ డియోల్ నటించిన ‘బార్డర్ 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. మొదటి రోజు కలెక్షన్లతోనే రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమా బాలీవుడ్ లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ

సన్నీడియోల్‌, వరుణ్‌ ధావన్‌, దిల్జిత్ దోసాంజే, అహన్‌ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం `బార్డర్‌ 2`. అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. 1971లో ఇండియా పాకిస్తాన్‌ మధ్య జరిగి యుద్ధం ప్రధానంగా చేసుకుని, ఎపిక్‌ యాక్షన్‌ వార్ ఫిల్మ్ గా  రూపొందింది. రిపబ్లిక్‌ డేని పురస్కరించుకుని శుక్రవారం ఈ మూవీ విడుదలయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది.  సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ వసూళ్ల పరంగా సత్తా చాటింది.

‘బార్డర్ 2’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా  సుమారు రూ.41 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.  ఓవర్సీస్  లో ఇది రూ. 5 కోట్లు వసూళ్లు చేసింది. భారత్‌లో సినిమా గ్రాస్ కలెక్షన్లు రూ.36 కోట్ల వరకు ఉండటం విశేషం.  ఈ మూవీ ఇటీవల సంచలనం సృష్టించిన `ధురంధర్‌` కంటే ఎక్కువ ఓపెనింగ్స్ ని రాబట్టడం విశేషం. `ధురంధర్‌` తొలి రోజు రూ.28కోట్ల ఇండియా నెట్‌, దాదాపు నలభై కోట్ల వరకు వరల్డ్ వైడ్‌ కలెక్షన్లని సాధించింది. ఇప్పుడు `బార్డర్‌ 2` దాన్ని మించి వసూలు చేయడం విశేషం. దీంతో ఈ మూవీ బాలీవుడ్‌లో మరో సంచలనంగా నిలవబోతుందని చెప్పొచ్చు.

`ధురంధర్‌` రికార్డు బ్రేక్ చేసిన `బార్డర్ 2`

శుక్రవారం లాగానే శనివారం కలెక్షన్లు కూడా భారీగా ఉండబోతున్నాయట. సుమారు నలభై కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోయిమోయి రిపోర్ట్ ప్రకారం, ‘బార్డర్ 2’ రెండో రోజుకు సుమారు 4.68 లక్షల టిక్కెట్లు అడ్వాన్స్‌గా అమ్ముడయ్యాయి. వీటిలో 1.91 లక్షల టిక్కెట్లు నేషనల్ సినిమా చైన్స్‌లో బుక్ అయ్యాయి. ఇందులో పీవీఆర్‌లో 1 లక్ష, ఐనాక్స్‌లో 65 వేలు, సినీపోలిస్‌లో 26 వేల టిక్కెట్లు ఉన్నాయి.

‘బార్డర్ 2’ రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు 15.34 కోట్ల రూపాయలు సంపాదించింది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌తో పోలిస్తే ఇది దాదాపు 22.72 శాతం ఎక్కువ.  ఈ సినిమా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు 12.5 కోట్లు సంపాదించింది.

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు

జె.పి. ఫిల్మ్స్, టి-సిరీస్ బ్యానర్‌పై నిర్మించిన ‘బార్డర్ 2’ బడ్జెట్ సుమారు 275 కోట్ల రూపాయలు. అనురాగ్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాలో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. దేశభక్తి నేపథ్యంలో, వార్‌ ప్రధానంగా సాగే ఈ మూవీలో ఎమోషన్స్ కీలకంగా ఉన్నాయి. యాక్షన్‌ పార్ట్ మరింతగా ఆకట్టుకునేలా ఉంది. ఇది నార్త్ ఆడియెన్స్ ని బాగా అలరిస్తోంది. అందుకే బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది.

‘బార్డర్ 2’ బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. సన్నీ డియోల్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుందేమో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.