
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’, నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా పడటంతో విడుదల తేదీలలో మార్పులు.
- పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న విడుదల కానుంది.
- విజయ్ ‘జన నాయగన్’ ఫిబ్రవరి 13 లేదా 14న విడుదలయ్యే అవకాశం ఉంది.
- యష్ ‘టాక్సిక్’, రణవీర్ సింగ్ ‘దురంధర్ 2’ మార్చి 19న విడుదల కానున్నాయి.
రామ్ చరణ్ మరియు నాని సినిమాల విడుదల వాయిదా పడటంతో, పలువురు స్టార్ హీరోలు తమ సినిమాల విడుదల తేదీలను మార్చుకున్నారు. విజయ్ నటించిన ‘జన నాయగన్’ నుండి యష్ నటించిన ‘టాక్సిక్’ వరకు విడుదల తేదీలు ఖరారయ్యాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
మార్చిలో సందడి చేయనున్న సినిమాలు
Box Office War: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi), నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రాలు అనుకున్న తేదీకి వచ్చే అవకాశం లేదనే క్లారిటీ రావడంతో, స్టార్ హీరోల సినిమాలు కొన్ని ఆ డేట్స్‌ని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. విజయ్ ‘జన నాయగన్’ టు యష్ ‘టాక్సిక్’ వరకు ఖరారైన షెడ్యూల్‌ను బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాల జాతర అనంతరం.. ఇప్పుడు మరోసారి భారీ బడ్జెట్ సినిమాలు, పాన్-ఇండియా స్టార్ల చిత్రాలు విడుదల తేదీలను లాక్ చేసుకుని, మరో జాతరకు సిద్ధమవుతున్నాయి. ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’ డౌట్స్‌లో ఉండటంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రాన్ని ముందుకు తెచ్చేశారు. ఇటీవల నిర్మాత ఏప్రిల్‌లో రిలీజ్ అని చెప్పిన విషయం తెలిసిందే. కానీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమ్మర్ సీజన్‌కు గట్టి ఆరంభాన్ని ఇచ్చేందుకు ‘గబ్బర్ సింగ్’ మళ్లీ ఖాకీ డ్రెస్ వేసి రెడీ అవుతున్నాడన్నమాట.
దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) పై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. పొంగల్‌కు రావాల్సిన ఈ సినిమా సెన్సార్ ఇబ్బందుల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం రీ-సెన్సార్ ప్రక్రియలో ఉంది. ఒకవేళ అంతా అనుకున్నట్లు సవ్యంగా జరిగితే, ఫిబ్రవరి 13 లేదా 14న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విజయ్ ఫ్యాన్స్‌కు ఇది అతిపెద్ద ట్రీట్ అనే చెప్పాలి.
ఫిబ్రవరిలో విజయ్ సినిమా విడుదల?
ఇక మార్చి నెలలో అసలైన సమరం మొదలుకాబోతోంది. రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ (Toxic), బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ‘దురంధర్ 2’ (Dhurandhar 2) రెండూ.. మార్చి 19న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ విడుదల తేదీలో ఎటువంటి మార్పు ఉండదు. ఆ వెంటనే అంటే, మార్చి 26న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా థియేటర్లలోకి దిగనున్నారు. మొత్తంగా చూస్తే మార్చి నెల సినిమా ప్రేక్షకులకు అసలు, సిసలు ట్రీట్ ఇవ్వబోతుందనేది స్పష్టమవుతోంది. ‘టాక్సిక్, దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ మూడు చిత్రాలపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వారం గ్యాప్‌లోనే ఈ మూడు సినిమాలు పోటీ పడనున్నాయి.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల ఎప్పుడంటే?
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పివిఆర్ సంస్థ ‘జన నాయగన్’ హక్కులను మాత్రమే కొనుగోలు చేసింది. ‘టాక్సిక్’తో పివిఆర్‌కు ప్రస్తుతానికి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ‘జన నాయగన్’ విడుదలైన తర్వాతే ‘టాక్సిక్’ బిజినెస్ డీల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే, విడుదల తేదీ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మార్చి 19న యష్ బాక్సాఫీస్ వేట మొదలెట్టనున్నారు. ‘జన నాయగన్’, ‘టాక్సిక్’ చిత్రాలను కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
మొత్తానికి మార్చి నెల సినిమా అభిమానులకు పండగే. వరుసగా స్టార్ హీరోల సినిమాలు విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.


