
తమిళంలో విజయవంతమైన ‘రెడ్ శాండల్ వుడ్’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ద్వారా అందుబాటులోకి వచ్చింది. పోలీస్ అవ్వాలనుకునే బాక్సర్ ఒక ఎర్రచందనం కేసులో చిక్కుకుని, తన లక్ష్యాన్ని ఎలా సాధిస్తాడనేది ఈ చిత్ర కథ.
Key Points
తమిళ థ్రిల్లర్ 'రెడ్ శాండల్ వుడ్' తెలుగులో ఓటీటీలోకి
పోలీస్ అవ్వాలనుకునే బాక్సర్ ఎర్రచందనం కేసులో చిక్కుకుంటాడు
యాక్షన్, థ్రిల్, సస్పెన్స్ తో నిండిన కథ
‘రెడ్ శాండల్ వుడ్’ ఓటీటీలోకి
ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. తమిళంలో థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో డబ్ అయి డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ సినిమానే ‘రెడ్ శాండల్ వుడ్’ (Red Sandal wood). ఈ సినిమా తెలుగు వర్షన్ తో ఇవాళ (జులై 31) ఓటీటీ లో అడుగుపెట్టింది.
2023లో తమిళంలో రిలీజైన ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అక్కడ తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడీ సినిమా తెలుగు వర్షన్ ను నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేశారు. గురువారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
‘‘రెడ్ శాండల్ వుడ్ ఈటీవీ విన్ లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ను ఇప్పుడే చూసేయండి’’ అని ఈటీవీ విన్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ మూవీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మంచి థ్రిల్ లు పంచనుంది. తెలుగు ఫ్యాన్స్ ను ఆకట్టుకునేందుకు ఈ మూవీ రెడీ అయింది.
బాక్సర్ యొక్క ప్రమాదకరమైన ప్రయాణం
రెడ్ శాండల్ వుడ్ మూవీ గురించి..
రెడ్ శాండల్ వుడ్ మూవీ సెప్టెంబర్ 8, 2023లో థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను గురు రామానుజన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో వెట్రి, దియా మయూరి, గణేష్ వెంకట్రామన్ లాంటి వాళ్లు నటించారు. చెన్నైకి చెందిన ఓ బాక్సర్ పోలీస్ కావాలనుకుంటాడు. ఆ లక్ష్యం కోసం కష్టపడతాడు. అయితే కనిపించకుండాపోయిన తన గర్ల్‌ఫ్రెండ్ సోదరుడిని వెతుక్కుంటూ వెళ్లడంతో అతని లైఫ్ మలుపు తీసుకుంటుంది. ఆ క్రమంలో రేణిగుంట వెళ్తాడు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ రహస్యం
అక్కడికి వెళ్లిన అతనికి ఆ కనిపించకుండాపోయిన వ్యక్తితోపాటు ఓ భయంకరమైన నిజం కూడా తెలుస్తుంది. అదే ఎర్ర చందనం అక్రమ రవాణా. ఈ ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో బాక్సర్ ఇరుక్కుంటాడు. తమిళ అమాయక ప్రజలు ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ ఉచ్చులో ఎలా చిక్కుకుంటున్నారనే విషయాన్ని హీరో కనిపెట్టాలనుకుంటాడు. వాళ్లను కాపాడాలని చూస్తాడు.
ఆ తర్వాత ఏం జరుగుతుంది? అత్యంత ప్రమాదకరమైన ఎర్ర చందనం గ్యాన్ నుంచి అతను ఎలా తప్పించుకుంటాడు? స్మగ్లింగ్ ను అతడు ఎలా బయటపెడతాడు? సురక్షితంగా అక్కడి నుంచి వెళ్లగలడా అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. థియేటర్లో ప్రేక్షకుల నుంచి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చిన ఈ రెడ్ శాండల్ వుడ్ మూవీని ఈ రోజు నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులోనూ చూడొచ్చు.
చివరకు, బాక్సర్ ఎర్ర చందనం స్మగ్లింగ్ నుంచి తప్పించుకుంటాడా? ‘రెడ్ శాండల్ వుడ్’ చూసి తెలుసుకోండి. ఈటీవీ విన్ లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది.


