
📌 Key Points
- సోషల్ మీడియాలో కుర్చీ తాత మరణించినట్లు అవాస్తవ వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి.
- యూట్యూబర్ వైజాగ్ సత్య, కుర్చీ తాత భార్య ద్వారా మొదట ఈ ఫేక్ న్యూస్‌పై క్లారిటీ.
- తాను చనిపోలేదని, బతికే ఉన్నానని, ఆరోగ్యంగా ఉన్నానని కుర్చీ తాత (మహ్మద్ పాషా) మీడియాకు తెలిపారు.
- తప్పుడు ప్రచారాలు చేయొద్దని, తన కుటుంబాన్ని బాధపెట్టవద్దని మహ్మద్ పాషా విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియాలో ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్‌తో వైరల్ అయిన కుర్చీ తాత (మహ్మద్ పాషా) మరణించినట్లు నిన్నటి నుంచి ఫేక్ న్యూస్ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన కుర్చీ తాత.. తాను చనిపోలేదని, బతికే ఉన్నానని, ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేస్తూ అభిమానులకు, ప్రజలకు ఊరటనిచ్చారు.
కుర్చీ తాత మరణంపై ఫేక్ న్యూస్ కలకలం
సోషల్ మీడియాలో “కుర్చీ మడతపెట్టి” డైలాగ్‌తో వైరల్ అయిన కుర్చీ తాత (మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా) గురించి తెలియని వారుండరు. అయితే నిన్నటి నుంచి కుర్చీతాత మరణించారని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం జరిగింది. అనేకమంది సోషల్ మీడియాలో కుర్చీతాత RIP అంటూ పోస్టులు కూడా పెట్టారు. అయితే ఈ ఫేక్ న్యూస్‌పై స్పందించిన యూట్యూబర్ వైజాగ్ సత్య, కుర్చీ తాత భార్యతో కలిసి వీడియో విడుదల చేయగా.. తన భర్త చనిపోలేదని, వరంగల్ లో ఉన్నాడని తెలిపింది.
అనంతరం కుర్చీ తాత స్వయంగా మీడియా ముందుకు వచ్చి “నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు, మా కుటుంబాన్ని బాధపెట్టకండి” అంటూ వేడుకున్నార. ‘గుంటూరు కారం’ సినిమాలో పాటలో తన డైలాగ్ ‘కుర్చీని మడతపెట్టి’ వినియోగించడంతో కుర్చీ తాత మరింత పాపులర్ అయ్యారు. ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మేముందు నిజానిజాలు ధృవీకరించుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు.
స్వయంగా మీడియా ముందుకు వచ్చిన కుర్చీ తాత
తప్పుడు ప్రచారాలపై కుర్చీ తాత ఆవేదన
మొత్తానికి కుర్చీ తాత క్షేమంగా ఉన్నారని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాలని స్పష్టమైంది. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, వార్తల నిజానిజాలను ధృవీకరించుకోవాలని మరోసారి కుర్చీ తాత విజ్ఞప్తి చేశారు.


