|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ డైరెక్టర్ బోయపాటి సంచలన ప్రకటన! బాలయ్యతో ‘అఖండ 3’ ఎప్పుడంటే…?

Published: 17-12-2025, 4:04 AM
మాస్ డైరెక్టర్ బోయపాటి సంచలన ప్రకటన! బాలయ్యతో 'అఖండ 3' ఎప్పుడంటే...?
  • బాలకృష్ణ – బోయపాటి కాంబో ఇప్పటివరకు నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది.
  • అఖండ 2 క్లైమాక్స్ లోనే అఖండ 3 కి సంబంధించిన లీడ్ ఇవ్వబడింది.
  • అవెంజర్స్ స్థాయి లో అఖండ సిరీస్ ను రూపొందించే ప్లాన్ బోయపాటికి ఉంది.
  • రెండు మూడు సినిమాల గ్యాప్ తర్వాతే బాలయ్యతో అఖండ 3 తీస్తానని బోయపాటి శ్రీను స్పష్టం చేశారు.

బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల ‘అఖండ 2’ విజయం తర్వాత, అభిమానులు ఎదురుచూస్తున్న ‘అఖండ 3’ పై దర్శకుడు బోయపాటి స్పష్టత ఇచ్చారు. ఈ సిరీస్ భవిష్యత్తు, బాలయ్యతో తదుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో వంటి ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

అఖండ 2 విజయ రహస్యం, పార్ట్ 3 పై బోయపాటి వివరణ

Akhanda 3 : బాలకృష్ణ – బోయపాటి కాంబో అంటేనే ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ఎదురుచూస్తారు. రీసెంట్ గా వచ్చిన అఖండ 2 తో కలిపి నాలుగు సార్లు ఈ ఇద్దరూ హిట్ కొట్టారు. అఖండ 2 హైప్ మీద ఉన్నప్పుడు అనుకున్న డేట్ వాయిదా పడి ఓపెనింగ్స్ తగ్గాయి కానీ లేకపోతే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. అయినా అఖండ 2 సినిమాకు మంచి టాక్ వచ్చింది.(Akhanda 3)

గతంలోనే అఖండ 2 ప్రమోషన్స్ లో అఖండ సిరీస్ లాగా ఓ అయిదారు సినిమాలు చేస్తాం అని చెప్పారు. అఖండ 2 సినిమా చివర్లో పార్ట్ 3 కి కూడా లీడ్ ఇచ్చారు. తాజాగా బోయపాటి అఖండ 2 సక్సెస్ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో అఖండ 3 సినిమా గురించి ప్రస్తావించారు.

బాలయ్యతో అఖండ సిరీస్ భవిష్యత్తు ప్రణాళికలు

బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అవెంజర్స్‌ స్థాయి లో స్కోప్‌ ఉన్న సినిమా అఖండ. అవెంజర్స్‌ అనేవి రచయితలు పుట్టించిన సూపర్‌ హీరోలు. మనదగ్గర అలాంటి సూపర్‌ హీరోలు పురాణాల్లో చాలా మంది నిజంగానే ఉన్నారు. మన చరిత్ర నుంచే ఎన్ని కథలైనా, ఎంత మంది సూపర్‌ హీరోలనైనా తీసుకురావొచ్చు. కానీ మనకు సంకల్పం, ఓపిక ఉండాలి. ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని వెంటవెంటనే సీక్వెల్స్‌ తీయడం కరెక్ట్ కాదు. రెండు మూడు సినిమాల గ్యాప్‌ తీసుకుని మళ్లీ చేయాలి. నేను కూడా వేరే సినిమాలు తీసాక మళ్ళీ అఖండ 3 గురించి ఆలోచిస్తాను. అఖండ 2 క్లైమాక్స్‌లో శంబాలా తలుపులు తెరచుకోవడాన్ని చూపించాం. అక్కడి నుంచే అఖండ 3 మొదలవుతుంది అని తెలిపారు.

అఖండ 3 విడుదల ఎప్పుడు? దర్శకుడు చెప్పిన షాకింగ్ నిజం

దీంతో అఖండ 3 సినిమా ఉంటుందని, బోయపాటి ఓ రెండు సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ బాలయ్యతో అఖండ 3 తీస్తారని తెలుస్తుంది.

మొత్తంగా, అఖండ 3 సినిమా ఖాయమని, బోయపాటి తన ఇతర ప్రాజెక్టుల తర్వాత బాలయ్యతో మళ్ళీ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని స్పష్టమైంది. అభిమానులు ఈ మాస్ కాంబో కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.