|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి అక్టోబర్ 31 ఎపిసోడ్: లింగరాజుగా రాజ్, మంగతాయారుగా కావ్య- బుట్టలో పడిన కుయిలి- నాటకం తెలుసుకున్న కుయిలి భర్త

Published: 31-10-2025, 10:50 AM
బ్రహ్మముడి అక్టోబర్ 31 ఎపిసోడ్: లింగరాజుగా రాజ్, మంగతాయారుగా కావ్య- బుట్టలో పడిన కుయిలి- నాటకం తెలుసుకున్న కుయిలి భర్త

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 31 ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. రాజ్, కావ్యలు తాత, బామ్మ వేషాల్లో కుయిలిని ఎలా బుట్టలో పడేశారు? రాహుల్-కుయిలిల ఆస్తి డ్రామా పీక్స్‌కి చేరింది. కుయిలి భర్త రంజిత్ నాటకం తెలుసుకున్నారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. ఈరోజు ఎపిసోడ్ విశేషాలు మీకోసం.

Key Points

1

రాహుల్ ఇంటికి వెళ్లి విడాకుల నాటకంతో ఆస్తిని లాగేయాలని కుయిలి ప్లాన్ చేసింది.

2

రాజ్, కావ్య తాత, బామ్మ (లింగరాజు, మంగతాయారు) గెటప్‌లలో కుయిలిని బుట్టలో పడేశారు.

4

రాజ్, కావ్యలు కుయిలి నాటకాన్ని కనిపెట్టడానికి ఆమె ఇంటికి వెళ్లారు.

రాహుల్-కుయిలి మధ్య ఆస్తి డ్రామా

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 31 ఎపిసోడ్‌లో కుయిలి ఇంటికి రాహుల్ వెళ్తాడు. అది చూసి కుయిలి షాక్ అవుతుంది. కుయిలి భర్త మాత్రం మెల్లిగా పంపించాలని అంటాడు. రాజ్, కావ్య తాత బామ్మలుగా ఎంట్రీ ఇస్తారు. వాళ్ల కోట్ల ఆస్తి రాహుల్‌కే అనడంతో రాజ్, కావ్య బుట్టలో పడిపోతుంది కుయిలి. రాహుల్ మాత్రం నాటకం కనిపెడతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాహుల్ తన భార్యకు విడాకులు ఇస్తానని చెప్పాడు అని భర్తతో కుయిలి అంటుంది. విడాకులు ఇస్తే సరిపోదు వాడి ఆస్తి కూడా రావాలి అని కుయిలి భర్త అంటే.. ముందు విడాకులు ఇస్తే తర్వాత ఆస్తి దానంతట అదే వస్తుందని కుయిలి అంటుంది. ఇంతలో సూట్‌కేస్‌తో రాహుల్ వస్తాడు.

పెళ్లయి పాప ఉన్నాక కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకొంటానంటే ఎవరు ఒప్పుకోరు. దానికే తెగదెంపులు చేసుకుని వస్తావా. నాకు కోట్ల ఆస్తి ఉండి కూడా అమ్మనాన్న లేరు. నాకు ఉంది మావయ్య ఒక్కరే. పెళ్లి చేసుకుంటే నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అవుతుందనుకున్నాను అని కుయిలి అంటుంది. అందరిని వదిలేసి వస్తే నెత్తిన పెట్టుకుంటుంది అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటీ అని రాహుల్ అనుకుంటాడు.

రాజ్, కావ్యల కొత్త గెటప్‌ల ఎంట్రీ

నిన్ను ప్రేమించింది కూడా నీ ఫ్యామిలీని చూసే అని కుయిలి అంటే.. రాహుల్ ఏంటని అడుగుతాడు. కుయిలి కవర్ చేస్తాడు. రాహుల్ ఆల్రెడీ తన కుటుంబాన్ని వదిలేసి వచ్చాడు. నువ్విలా మాట్లాడితే ఎలా. రాహుల్ నువ్వెళ్లి ముందు ఫ్రెష్ అయిరా అని కుయిలి భర్త రంజిత్ అంటాడు. దాంతో రాహుల్ వెళ్లిపోతాడు. ఇంట్లోవాళ్లను హ్యాండిల్ చేయలేక వచ్చాడు. నువ్వే మ్యానిపులేట్ చేసి ఇంటికి పంపించాలి అని కుయిలి తో రంజిత్ అంటాడు.

దాని నాటకం ఏంటో కనిపెట్టాలంటే అక్కడికి వెళ్లి మనం కూడా నాటకం ఆడాలి అని కావ్య అంటుంది. మనం కుయిలి ఇంటికి వెళ్లాలి. దాన్ని కుదిపి కుదిపి కూతపెట్టించాలని రాజ్‌తో కావ్య అంటుంది. మరోవైపు రాహుల్‌ను ఎలాగైనా ఇంటికి పంపించాలని కుయిలి అనుకుంటుంది. రాహుల్‌కు కాఫీ ఇచ్చి మాట్లాడుతుంది. ఇంతలో రాజ్, కావ్య తాత, బామ్మ గెటప్పులలో ఎంట్రీ ఇస్తారు.

రాజ్ ఫ్లోలో నడుచుకుంటు వెళ్తే మీరు ఇప్పుడు యంగ్ రాజు గారు కాదు కుంగిపోయిన లింగరాజు గారు. వయసుకు తగ్గట్లు నడవండి అని కావ్య అంటుంది. నువ్వు కూడా ముడతలు పడ్డ మంగతాయారువి అని రాజ్ అంటాడు. ఇద్దరు ముసలివాళ్లలా వస్తారు. రాహుల్ కోసమే వచ్చామంటారు. మీరేవరు అని రాహుల్ అంటాడు. దాంతో అంతమాట అనేసావా అని రాజ్ , కావ్య పెద్ద డ్రామా చేస్తారు.

కుయిలి భర్త రంజిత్ కుట్ర

అవును నువ్వు అన్ని వదిలేసి వచ్చిన ఆ సుందరాంగీ ఏది. తను ఇక్కడ లేదా. మరి ఆస్తి పరిస్థితి ఏంటీ అని కావ్య అంటుంది. ఆస్తి పరిస్థితి అంటే అని ఆబరాగా అడుగుతుంది కుయిలి. వీడు అలిగి వచ్చాడు. అక్కడ ఒంటరి అయిపోయాం. కోట్ల ఆస్తిని ఎలా కాపాడుకోవాలి. ఎలాగు నచ్చినదాని దగ్గరికి వచ్చాడు. మేము కూడా వీడితోనే ఉండి కోట్ల ఆస్తి చేతిలో పెట్టాలనుకుందామంటే ఆ గాడిద ఎవరో కనిపించట్లేదు అని కావ్య అంటుంది.

ఆ గాడిదను నేనే బామ్మ గారు అని ముందుకు వస్తుంది కుయిలి. అదే ఆడదాన్ని నేనే అని కుయిలి అంటుంది. ముందు తిట్టి ఈడు జోడు బాగుందని రాజ్, కావ్య అంటారు. రాహుల్ వెళ్లిపోమ్మంటే కుయిలి అడ్డు పడుతుంది. వాళ్లు ఎక్కడికి వెళ్తారు అని ఆపుతుంది. దాంతో తమ బుట్టలో కుయిలి పడిందనుకుంటారు రాజ్, కావ్య.

ఉక్కపోస్తుందని కావ్య, రాజ్ విగ్గు తీసేస్తారు. అది కుయిలి భర్త రంజిత్ చూస్తాడు. దాంతో రాజ్, కావ్య నాటకం బయటపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తాజా ఎపిసోడ్‌లో రాజ్, కావ్యల ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కుయిలి, రంజిత్ ల పన్నాగం బయటపడుతుందా? రాహుల్ భవిష్యత్తు ఏంటి? రాబోయే ఎపిసోడ్‌లలో మరింత ట్విస్ట్‌లు ఉండనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.