
📌 Key Points
- రుద్రాణి అసలు స్వరూపం బయటపెట్టిన అప్పు, కళ్యాణ్!
- రౌడీలతో రుద్రాణి ఒప్పందం తెలుసుకున్న కావ్య!
- అప్పు, కళ్యాణ్‌లను చంపేందుకు రుద్రాణి స్కెచ్!
- మంత్రి ఇంట్లో బారసాల వేడుకకు దుగ్గిరాల కుటుంబం!
బ్రహ్మముడి సీరియల్ లో సరికొత్త ట్విస్ట్! రుద్రాణి ప్లాన్స్ అన్నీ రివర్స్ అయ్యాయి. అప్పు, కళ్యాణ్ ల తెలివితేటలతో రుద్రాణి ఆట కట్టించబడింది. ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి చదవండి!
రుద్రాణి కుట్రలు భగ్నం చేసిన అప్పు!
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 20 ఎపిసోడ్‌లో రౌడీల దగ్గరికి వెళ్లిన అప్పు రివర్స్ స్కెచ్ వేసి నిజం రాబడుతుంది. అంతా రుద్రాణి చేసిందని తెలుసుకుంటుంది. మంత్రి ఇంటికి దుగ్గిరాల కుటుంబం వెళ్తుంది. అప్పు, కల్యాణ్ యాక్సిడెంట్‌లో చనిపోయారని రుద్రాణికి రౌడీ కాల్ చేసి చెబుతాడు. మంత్రి ఇంటికి రుద్రాణి వెళ్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అప్పుకు ఎస్సై ధనుంజయ్ కాల్ చేసి హాస్పిటల్‌లో అటాక్ చేసిన రౌడీలను ఏం చేద్దాం, అందులో ఒకడు నోరు జారి ఓ లేడి అన్నాడు, కానీ, ఆమె పేరు తెలియదంటున్నాడు అని చెబుతాడు. సరేనని అదంతా విన్న కల్యాణ్‌తో అప్పు కూచీ.. అని సాగదీస్తుంది.
మరోవైపు అంతా మినిస్టర్ ఇంటికి బారసాలకు వెళ్లేందుకు రెడీ అవుతారు. కావ్య పాపకు ఏ పేరు పెడదామని ఇందిరాదేవి అడుగుతుంది. హాలీవుడ్ హీరోయిన్ పెడదామని ప్రకాశం అంటే.. ఏ హుడ్డు లేదు.. చక్కగా సాంప్రదాయంగా ఉండాలని ఇందిరాదేవి అంటే.. అలా ఉండాలంటే ఒకే పేరు ఉంది. ఇందిరాదేవి. నీ పేరే చక్కగా ఉందిగా అని రాజ్ అంటాడు.
నాకు నచ్చట్లేదురా ఆ పేరు. ఇది పెద్దయ్యాకా ముసలిదాని పేరు పెట్టారని నన్ను, నిన్ను తిట్టుకుంటుందని ఇందిరాదేవి అంటుంది. ఇందిరాదేవిని షార్ట్ కట్ చేసి ఇందుగా పెడదామని రాజ్ అంటాడు. ఇంతలో కల్యాణ్, అప్పు వచ్చి కాస్తా బయటకు వెళ్తున్నామని, గుడికి వెళ్తున్నామని అంటారు. ధాన్యలక్ష్మీ నోటితోనే గుడికి వెళ్లమని చెప్పేలా చేసుకుంటారు.
కళ్యాణ్ రివర్స్ ఎటాక్ తో రౌడీలు హడల్!
అది కూడా గుడ్ న్యూసే. వాళ్ల చావుకు కాస్తా టైమ్ ఉందనుకున్నా. కానీ లేదు. అప్పు వాళ్లు మినిస్టర్ ఇంటికి తిరిగి రారు. నేరుగా స్మశానానికే వెళ్తారు, శాశ్వతంగా పైకి వెళ్తారు. ఈరోజు చావు ఎలా ఉంటుందో చూస్తారు అని రుద్రాణి అంటుంది. మరోవైపు రౌడీల దగ్గరికి అప్పు, కల్యాణ్ వెళ్తారు. వాళ్లు ఎంత అడిగిన చెప్పలేదన్నారుగా. అయితే, ఒక చిన్న గేమ్ ఆడుదామని అప్పు అంటుంది.
రౌడీల దగ్గరికి వెళ్లి ధనుంజయ్‌ను తిట్టి రౌడీలకు నీళ్లు ఇప్పిస్తుంది అప్పు. మిమ్మల్ని టార్చర్ పెట్టడం నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని రక్షించడానికి వచ్చాం. మినిస్టర్ తనకు సంబంధం లేదని చేతులెత్తేశాడు. అటు ఇటు తిరిగి ఈ కేసులో మీరు ఇరుక్కుంటారు అని అప్పు అంటుంది. కోర్టులో సబ్‌మిట్ చేసే 14 ఏళ్ల జైలు శిక్ష వేస్తే అప్పుడు బుద్ధి వస్తుందని ధనుంజయ్ అంటాడు.
అది చూసి అప్పు, కల్యాణ్ షాక్ అవుతారు. రుద్రాణి అత్త ఇదంతా చేసిందా అని కల్యాణ్ అంటాడు. నాకు మొదటి నుంచి ఆమెపైనే అనుమానంగా ఉందని చెప్పానుగా అని అప్పు అంటుంది. రౌడీల అడ్రస్ తీసుకుని వదిలేయమని అప్పు వెళ్లిపోతుంది. మరోవైపు అతిథులను మంత్రి ఆహ్వానిస్తుంటాడు. రాజ్, కావ్య వాళ్లు వస్తారు.
కావ్యకు తెలిసిన నిజం.. దుగ్గిరాల ఇంట్లో టెన్షన్!
పాప ఆరోగ్యం గురించి కావ్య అడుగుతుంది. పాపను ఎత్తుకుంటుంది కావ్య. తులసి అలానే చూస్తూ ఎమోషనల్ అవుతుంది. కావ్య ఏంటని అడిగితే.. ఇవి ఆనంద బాష్పాలు అని, కావ్య గొప్పదనం గురించి చెబుతుంది తులసి. మేము ముందుగా మీ ఫంక్షన్‌కి రావాలని అనుకోలేదు, కానీ, మంత్రి గారు పాప విషయంలో తనతో తానే పోరాటం చేశారని, భార్య కోసం అలా చేశారే తప్పా తప్పుడు మనిషి కాదని ఒప్పించారని అపర్ణ, సుభాష్‌లు చెబుతారు.
మరోవైపు అప్పు, కల్యాణ్ కారును వ్యాన్ ఎదురుగా వచ్చి గుద్దేస్తుంది. కూచీ అంటూ అప్పు అరుస్తుంది. ఓ రౌడీ రుద్రాణికి కాల్ చేసి అప్పు, కల్యాణ్ కారుకు యాక్సిడెంట్ చేశానని, ఇద్దరు చనిపోయారు అని చెబుతాడు. అది విన్న రుద్రాణి సంతోషిస్తుంది. దుగ్గిరాల ఇంట్లో ఇద్దరి జీవితాలు ముగిసిపోయాయి, ఇక మిగిలింది రాజ్ , కావ్య మీరే అని అనుకుంటుంది.
మంత్రి ఇంట్లో రుద్రాణి కనిపిస్తే ఇందిరాదేవి తిడుతుంది. ఒంటరిగా బయట బతకలేకపోతున్నాని డ్రామా ఆడుతుంది రుద్రాణి. ఇంతలో చావు నుంచి తప్పించుకుని వచ్చిన అప్పు, కల్యాణ్ ఆపు నీ నాటకాలు అంటుంది. బిడ్డలను మార్చింది, ఈరోజు మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది ఈ రుద్రాణినే అని అప్పు నిజం బయటపెడుతుంది.
బ్రహ్మముడి సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రుద్రాణి కుట్రలు ఎలా బయటపడ్డాయి, అప్పు కళ్యాణ్ ఎలా తప్పించుకున్నారు అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


