|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి ప్రోమో: ఫ్రెండ్ స్వరాజే తన మనవడని తెలుసుకున్న అపర్ణ.. కూతురు దగ్గరికి సుభాష్.. రాజ్ గుడి ప్లాన్ సక్సెస్

Published: 26-07-2025, 8:45 PM
బ్రహ్మముడి ప్రోమో: ఫ్రెండ్ స్వరాజే తన మనవడని తెలుసుకున్న అపర్ణ.. కూతురు దగ్గరికి సుభాష్.. రాజ్ గుడి ప్లాన్ సక్సెస్

బ్రహ్మముడి సీరియల్‌లోని తాజా ప్రోమోలో, అపర్ణ తన కూతురు రేవతిని తిట్టి పంపించేస్తుంది. రాజ్ మరియు కావ్యలు అపర్ణను ఒప్పించడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తారు. ఆ ప్రణాళికలో స్వరాజ్ కీలక పాత్ర పోషిస్తాడు.

Key Points

1

అపర్ణ తన కూతురు రేవతిని తిట్టి పంపించేస్తుంది.

2

రాజ్ మరియు కావ్యలు అపర్ణను ఒప్పించేందుకు గుడి ప్లాన్ వేస్తారు.

4

రాజ్ రేవతిని ఒప్పించి మనవడిని అపర్ణకు దగ్గర చేస్తాడు.

అపర్ణ కోపం

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికొచ్చిన కూతురుని తిట్టి పంపించేస్తుంది అపర్ణ. దాంతో రేవతి ఏడుస్తూ వెళ్లిపోతుంది. రాజ్, కావ్య ఇలాంటి ప్లాన్ వేసినందుకు ఇందిరాదేవి తిడుతుంది. దాంతో చాలా రోజుల తర్వాత చూస్తే కలిసిపోతుందనుకుంటే ఇలా అవుతుందని అనుకోలేదని కావ్య అంటుంది.

ఇక నాకు ఏమాత్రం ఆశలు లేవు. మా అమ్మ నన్ను క్షమిస్తుందని, నా కొడుకును ఆడిస్తుందని ఏమాత్రం నమ్మకం లేదని రేవతి అంటుంది. ఆశపడితేనే జీవితం. మీ అమ్మ గారు క్షమిస్తారని ఎక్కడో ఓ చోట నమ్మేగా వచ్చారు. రేపు ఓ రోజు కచ్చితంగా మిమ్మల్ని క్షమించి దగ్గరికి తీసుకుంటారు. కానీ, అది జరిగే వరకు ఎదురుచూడాలి అని కావ్య అంటుంది.

అంత ఎదురుచూసే ఓపిక నాకు లేదు. కాబట్టి త్వరగా ఆ పని అయ్యేలా చేద్దామని రాజ్ అంటాడు. అర్థం కానట్లు అంతా మొహాలు పెడతారు. కూతురు మీద రాని ప్రేమ మనవడిని చూస్తే వస్తుంది. మనవడు ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే ఏ అమ్మమ్మ మాత్రం ప్రేమగా రాకుండా ఉంటుంది అని రాజ్ అంటాడు.

ఇదేదే వర్కౌట్ అయ్యేలా ఉందని కావ్య అంటుంది. మీరు అమ్మకి తెలియకుండా, అమ్మని ఒప్పించి గుడికి తీసుకురండి. నేను రేవతి అక్కను ఒప్పించి బాబును తీసుకొస్తాను. కరెక్ట్ టైమ్ చూసి వాన్ని అమ్మకు దగ్గరయ్యేలా పంపిస్తాను అని రాజ్ అంటాడు. అక్కడ వాడి మాటలు, తీరు చూసి అమ్మ కచ్చితంగా కోపాన్ని వదిలేస్తుంది. అక్కకు దగ్గరవుతుంది అని రాజ్ అంటాడు.

రాజ్ గుడి ప్లాన్

దీంతో రాజ్ చెప్పిన గుడి ప్లాన్‌ను కావ్య, ఇందిరాదేవి అమలు చేస్తారు. అపర్ణ దగ్గరికి వెళ్లి కావ్య మాట్లాడాలని చూస్తుంది. కానీ, కావ్య మీద కోపంతో ఉన్న అపర్ణ మాట్లాడదు. ప్రతి శుక్రవారం కలిసి గుడికి వెళ్లేవాళ్లం. మరి ఈరోజు ఎందుకు అడగలేదో అని కావ్య అంటుంది.

తను తప్పు చేసింది కాబట్టి కలిసి వెళ్లను అని చెప్పండి అత్తయ్య అని అపర్ణ అంటుంది. దాంతో అంటే, నా మీద కోపం దేవుడి మీద చూపిస్తున్నారన్నమాట అని కావ్య అంటుంది. తనతో వెళ్లను అని చెప్పాను. కానీ, నేను వెళ్లను అని చెప్పలేదు. ఇప్పుడే గుడికి వెళ్తాను అని అపర్ణ వెళ్తుంది.

అదే విషయాన్ని రాజ్‌కు కాల్ చేసి చెబుతుంది కావ్య. ఇంతకీ అమ్మను గుడికి వెళ్లడం ఒప్పించారా అని రాజ్ అడిగితే.. ఈజీగా ఒప్పించాను. ఇక మన ప్లాన్ అమలు పరచాలి అని కావ్య అంటుంది. దాంతో రేవతిని ఒప్పించడానికి అక్క దగ్గరికి రాజ్ వెళ్తాడు. అమ్మ దగ్గరవడానికి దారి స్వరాజ్ అని తన గుడి ప్లాన్ అంతా చెబుతాడు రాజ్. ముందు డౌట్ పడిన రేవతి తర్వాత ఒప్పుకుంటుంది.

స్వరాజ్ పాత్ర

ఇంతలో అక్కడికి సుభాష్ వస్తాడు. తన దగ్గరికి తండ్రి రావడంతో రేవతి ఆశ్చర్యంతోపాటు సంతోషిస్తుంది. నువ్ చేసింది తప్పే. కానీ, ఇన్నాళ్లకు నిన్ను పేదరికంలో చూసేసరికి నేను ఉండబట్టలేకపోయాను అని కూతురు దగ్గరికి రావడానికి సుభాష్ కారణం చెబుతాడు. నాన్న మనసు కరిగిపోయింది. ఇక మిగిలింది అమ్మ మనసే అని రాజ్ అంటాడు.

గుడిలోకి అపర్ణ వెళ్తుంది. అక్కడికి అపర్ణ దగ్గరికి స్వరాజ్ వచ్చి మాట్లాడుతాడు. నువ్వేంటీ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చావ్. ఎలా వచ్చావ్. మీ అమ్మ నాన్న ఎక్కడ అని అడుగుతుంది అపర్ణ. అదిగో అని రేవతి, జగదీశ్‌ను చూపిస్తాడు స్వరాజ్.

దాంతో ఇన్నాళ్లు మాట్లాడిన తన ఫ్రెండ్ స్వరాజ్ తన మనవడే అని తెలుసుకుంటుంది అపర్ణ. అదంతా చూసిన రాజ్ తమ ప్లాన్ సక్సెస్ అనుకుని సంబరపడతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరకు రాజ్ ప్లాన్ సక్సెస్ అవుతుంది. స్వరాజ్ ద్వారా అపర్ణ తన కూతురును క్షమిస్తుంది. అందరూ కలిసి సంతోషంగా ఉంటారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.