
📌 Key Points
- ‘లెనిన్’ ప్రీ-రిలీజ్ వేడుకలో బ్రహ్మాజీ, సుమల మధ్య సరదా సంభాషణ.
- బ్రహ్మాజీ “కమ్ టు మై రూమ్” డైలాగ్ తో సుమకి షాక్.
- ‘ఆదిపురుష్’ మీమ్ ను గుర్తుచేసిన బ్రహ్మాజీ పంచ్.
- అఖిల్ అక్కినేని ఎమోషనల్ ప్రసంగం.. అభిమానుల్లో జోష్.
టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ‘లెనిన్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో అనుకోని సంఘటన చోటుచేసుకుంది! బ్రహ్మాజీ, సుమల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం!
బ్రహ్మాజీ మాస్ డైలాగ్.. సుమ రియాక్షన్ వైరల్!
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను జూలై 10న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం సాయంత్రం తిరుపతిలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు బ్రహ్మాజీ కామెంట్స్ కు యాంకర్ సుమ కనకాల షాక్ అయ్యారు. ‘లెనిన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు నాగార్జున, అఖిల్, భాగ్యశ్రీ, నాగవంశీ, సునీల్, బ్రహ్మాజీ, శివాజీ తదితరులు హాజరయ్యారు. హోస్టుగా వ్యవహరించిన యాంకర్ సుమ.. ఎప్పటిలాగే తన సరదా మాటలతో ఆకట్టుకున్నారు. సినిమా ఈవెంట్స్ లో తరచుగా బ్రహ్మాజీని ఆటపట్టించే సుమ.. ఈసారి కూడా అతనిపై తనదైన శైలిలో జోకులు వేస్తూ నవ్వించింది. ఆయనకు అక్కినేని నాగేశ్వరరావు కంటే ఎక్కువ వయసు ఉందంటూ సెటైర్లు వేశారు. ఇలా ఒకరిపై ఒకరు జోకులు వేసుకునే క్రమంలో సుమను ఉద్దేశించి ”కమ్ టు మై రూం” అన్నారు బ్రహ్మాజీ. ‘లెనిన్’ మూవీలో కుంటి దామోదరం అనే నెగిటివ్ రోల్ లో నటించానని చెప్పిన బ్రహ్మాజీ.. స్టేజ్ పైనే కుంటుకుంటూ నటించి చూపించారు. ”వావ్..బ్యూటిఫుల్.. మీరు నటించాల్సిన అవసరం లేదు.. జీవిస్తున్నారు” అని నవ్వుతూ అన్నారు. దాంతో బ్రహ్మాజీ కాస్త సీరియస్ ఫేస్ పెట్టి, ”హే.. కమ్ టు మై రూమ్” అంటూ వేలు చూపిస్తూ సరదాగా సుమకి వార్నింగ్ ఇచ్చారు. దానికి షాక్ అయిన సుమ వెంటనే ‘అన్నయ్యా’ అంటూ కవర్ చేశారు. దాంతో నాలుక్కరుచుకున్న బ్రహ్మాజీ.. తన ఉద్దేశ్యం అది కాదని పాపులర్ మీమ్ ను గుర్తు చేశారు. ‘ఆదిపురుష్’ టైంలో ”కమ్ టు మై రూమ్” అంటూ ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ ను పిలవడం అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ దాన్ని సోషల్ మీడియాలో మీమ్ గా వాడుతుంటారు. ఇప్పుడు బ్రహ్మాజీ కూడా సుమపై ఫన్నీగా ఆ కామెంట్స్ చేశారని అర్థమవుతోంది. * ‘మీకు నా మొహం చూపించలేకపోతున్నా.. మనసులో ఎంతో బాధగా ఉంది’.. లెనిన్ ఈవెంట్‌లో అఖిల్ ఎమోషనల్
‘కమ్ టు మై రూమ్’ వెనుక అసలు కథ ఏంటి?
అఖిల్ ఎమోషనల్ స్పీచ్.. ఫ్యాన్స్ లో ఉత్సాహం!
‘లెనిన్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఈ హైలైట్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని వైరల్ అప్డేట్స్ కోసం వేచి ఉండండి!


