
బ్రహ్మముడి సీరియల్ 793వ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన ట్విస్టులు చోటు చేసుకున్నాయి. రాజ్‌తో అపర్ణ, ఇందిరాదేవి సంభాషణ, కావ్య రహస్యం వెల్లడించడం వంటి సంఘటనలు ఈ ఎపిసోడ్‌ను ఆకర్షణీయంగా మార్చాయి.
Key Points
కావ్య రహస్యం వెల్లడించి రాజ్‌ను షాక్‌కు గురిచేస్తుంది.
దుగ్గిరాల ఇంట్లో యామిని కుట్రలు కొనసాగుతాయి.
అపర్ణ, ఇందిరాదేవి కావ్య ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు.
రాజ్ బాధ, అపర్ణ, ఇందిరాదేవి ప్రయత్నాలు
బ్రహ్మముడి సీరియల్ 793వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ సీరియల్ ప్రస్తుతం ఊహకందని మలుపులతో సాగుతోంది. కావ్య, రాజ్ జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం (ఆగస్టు 6) ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగింది.
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఆగస్టు 6) ఎపిసోడ్ రాజ్ తో అపర్ణ, ఇందిరా దేవి మాట్లాడే సీన్ తో మొదలవుతుంది. కావ్య రిజెక్ట్ చేయడంతో రాజ్ బాధపడుతూ ఉంటాడు. అసలు కావ్య ఎందుకిలా చేసిందో అర్థం కావడం లేదని వాళ్లు అంటారు. తానే తప్పుగా అర్థంగా చేసుకున్నానని, తన మనసు తెలుసుకోకుండా సాయం కోరడాన్నే ప్రేమ అనుకున్నానని రాజ్ అంటాడు. ఇన్నాళ్లూ తనకు గతమే లేదనుకున్నాను కానీ భవిష్యత్తు కూడా లేదని బాధపడతాడు.
కావ్యను నాలుగు తగిలించి అయినా సరే నీతో పెళ్లికి ఒప్పిస్తాం అని అపర్ణ అంటుంది. ఇష్టం లేని షర్టే వేసుకోం.. అలాంటిది ఇష్టం లేని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటారు.. యామిని చూపించే ప్రేమ నాకు అర్థం కావడం లేదు.. నేను చూపించే ప్రేమ కళావతికి అర్థం కావడం లేదు అని రాజ్ అంటాడు. అపర్ణ, ఇందిరాదేవిలను పట్టుకొని ఏడుస్తాడు. ఇక ఇక్కడే ఉండి కావ్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదంటూ వెళ్లిపోతాడు.
అసలు కావ్య ఎందుకిలా చేసిందో తెలుసుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్తారు అపర్ణ, ఇందిరా దేవి. చేసిందంతా చేసి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావా అని అడుగుతారు. వాడిని ఇష్టపడి ఇప్పుడు అందరి ముందు అవమానించి పంపిస్తావా అని అపర్ణ అంటుంది. ఓ రహస్యం ఉందని, అది చెప్పలేనని కావ్య అంటుంది. చెప్పలేనంత రహస్యం ఏముంది? ఇన్నాళ్లూ నువ్వు చెప్పిందల్లా వింటున్నామని, ఏం చేసినా భరిస్తామనుకున్నావా అంటూ ఇద్దరూ కావ్యను నిందిస్తారు.
తాను ఆ రహస్యమేంటో చెప్పలేనని కావ్య తెగేసి చెప్పడంతో అయితే జరిగిన గతమేంటో రాజ్ కు చెప్పేస్తానని, వాడికి ఏం జరిగినా సరే అని అపర్ణ అంటుంది. వాడి ప్రాణాలను తన ప్రాణాలు అడ్డు వేసైనా కాపాడుకుంటానని ఆవేశం వెళ్లిపోతుంటే కావ్య అసలు విషయం చెప్పేస్తుంది.
కావ్య రహస్యం వెల్లడి
తాను తల్లి కాబోతున్నానని కావ్య చెబుతుంది. ఆ మాట విని ఇద్దరూ సంతోషిస్తారు. ఇంత మంచి విషయం ఇలా చెబుతావా అని అంటారు. ముందే చెబితే అని అనగానే ఏం చేసేవారు.. ఆయనతో కలిసి సంబరం చేసేవారా అని కావ్య అనగానే అపర్ణ షాక్ తింటుంది. గతం తెలియని రాజ్ తో ఈ కడుపు ఆయన వల్లే వచ్చిందని ఎలా తెలుస్తుందని, ఈ విషయం దాచి పెట్టి పెళ్లి చేసినా రేపు అసలు విషయం తెలిస్తే నిజం చెప్పగలరా అని కావ్య అడుగుతుంది.
ఆయన విషయంలో తాను పెళ్లి కాని అమ్మాయినే అని, అలాంటప్పుడు ఈ కడుపు ఎవరి వల్ల వచ్చిందో అని అనుకుంటారని, మరి ఆయన ప్రేమను ఎలా అంగీకరించాలో చెప్పాలని వాళ్లను నిలదీస్తుంది. దీనికి సమాధానం చెప్పలేక వాళ్లు కూడా మౌనంగా ఉంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటని అడుగుతారు. కడుపు దాచలేము కదా.. సమయం గడుస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది కదా అని అపర్ణ అంటుంది.
తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మీరే అని చెప్పి ఆయన ప్రాణాలతో ఆడుకోవడం కంటే ఆయనకు దూరంగా ఉండటమే మంచిది అని కావ్య స్పష్టం చేస్తుంది. ఆ దేవుడు నీ తలరాతను ఎందుకిలా చేస్తున్నాడో అంటూ ఇందిరాదేవి బాధపడుతుంది. దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది.. ఏదో ఒకటి చేయాలని అపర్ణ అంటుంది.
దీనికి ఒక్కటే పరిష్కారం.. అది నేను ఆయనకు శాశ్వతంగా దూరంగా ఉండటం.. ఈ ఇంటికి వారసుడిని ఇవ్వాలి కాబట్టి బిడ్డను కంటాను. ఇక ఎప్పటికీ ఆయన ముందుకు వెళ్లను అని కావ్య అనడంతో అపర్ణ, ఇందిర షాక్ తింటారు. తమను క్షమించమని వాళ్లు అడుగుతారు. ఈ సమయంలో భర్త తోడు కావాలని అనుకుంటారని, తన మనవడి ప్రాణాల కోసం దానినీ వదులుకున్నావని, ఆ దేవుడు నీకు చాలా పెద్ద మనసు ఇచ్చాడని ఇందిరాదేవి అంటుంది.
అటు కావ్య మాటలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ రోడ్డుపై రాజ్ వెళ్తుంటాడు. అదే సమయంలో వెనుక నుంచి ఓ వెహికిల్ వస్తూ హారన్ కొడుతున్నా అతడు వినడు. అది కాస్తా వచ్చి రాజ్ ను ఢీకొట్టేస్తుంది. బావ ఇంకా ఇంటికి ఎందుకు రాలేదంటూ యామిని కూడా ఫోన్ చేస్తున్న ఫోన్ కలవదు. బావ ఏ పిచ్చి పని కానీ చేసి ఉండడు కదా అంటూ భయపడుతుంది.
అనూహ్య మలుపులు
తానే వెళ్లి బావను వెతికి తీసుకొస్తానని వెళ్లబోతోంది. వద్దని తల్లి వారిస్తుంది. రాజ్ చాలా సున్నితమైన వ్యక్తి అని, అతనికి ఏమైందో అని యామిని కంగారు పడుతుంది. అయినా తల్లి సర్ది చెబుతుంది. అంతేనంటావా.. బావకు ఏమీ కాదు కదా.. ఒకవేళ బావకు ఏదైనా జరిగితే ఆ కావ్య నా చేతుల్లో అయిపోతుంది అని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతుంది.
అసలు విషయం తెలియకపోవడంతో కావ్యను దుగ్గిరాల ఫ్యామిలీలోని వాళ్లంతా అవమానించేలా మాట్లాడతారు. ఆమె కాఫీ ఇవ్వడానికి వెళ్లినా సుభాష్, ప్రకాష్ తీసుకోరు. మనుషులే మారిపోతున్నారని, తమ ఇష్టాలు కూడా మారిపోయాయని అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ధాన్యలక్ష్మి కూడా కావ్యను అవమానించేలా మాట్లాడుతుంది. రాజ్ నీ భర్త అని తెలిసినా ఎందుకిలా చేశావని నిలదీస్తుంది.
రంగులు మార్చడం సరికాదని అందరూ ఆమెను నిందిస్తారు. అప్పుడే రుద్రాణి వచ్చి కాఫీ తీసుకొని తాగుతుంది. రాజ్ అంటే ఎంతో ఇష్టం కదా అయినా ఎందుకలా మాట్లాడవని అడుగుతుంది. టైమ్ వచ్చినప్పుడు చెబుతాలే అని కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె పరిస్థితి చూసి అపర్ణ, ఇందిరాదేవి బాధపడుతుంటారు. అక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్ ప్రోమోలో యామిని.. కావ్య ఇంటికి వచ్చి నా రాజ్ ఎక్కడ? ఎక్కడ దాచి పెట్టారని నిలదీస్తుంది. రాజ్ ఇంటికి వెళ్లకపోవడంతో అతనికి ఏమైందో అని కావ్య, అపర్ణ కంగారుపడుతుంటారు.
కావ్య రహస్యం వెల్లడై, రాజ్‌కు షాక్‌తో పాటు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. అపర్ణ, ఇందిరాదేవి ప్రతిస్పందన మరియు యామిని కుట్రలతో ఈ కథనం ఆసక్తికరంగా ముగుస్తుంది.


