
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 7 ఎపిసోడ్‌లో కావ్య, యామిని, అపర్ణ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. యామిని కావ్యపై తీవ్ర ఆరోపణలు చేయగా, అపర్ణ రివర్స్‌లో హెచ్చరిస్తుంది. రేవతి గురించి కావ్య నోరు జారడం కథలో కొత్త ట్విస్ట్.
Key Points
కావ్యపై యామిని తీవ్ర ఆరోపణలు
రివర్స్‌లో అపర్ణ యామినికి హెచ్చరిక
రాజ్ అదృశ్యం – అతని కోసం వెతుకులాట
యామిని యొక్క తీవ్ర ఆరోపణలు
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో అంతా కావ్య మీద కోపంగా ఉంటారు. సీతారామయ్య కు కావ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. రాజ్‌తో ఎందుకు అలా ప్రవర్తించావమ్మా. నా మనవరాలు తప్పు చేయదు అనుకున్నా. కానీ, నిన్నటితో నా ఆలోచన తప్పు అనేలా చేశావు. నేను కారణం అడగను. అది నీ జీవితానికి సంబంధించిన విషయం అని సీతారామయ్య అంటాడు.
జీవితం గాజు లాంటిది. చేయి జారాక కాపాడుకోలేం. నీ చేతులారా నువ్వే బంగారు అవకాశాన్ని పోగొట్టుకున్నావ్. నువ్వే ఆ యామినికి ఇంకో ఛాన్స్ ఇచ్చావ్. ఎందుకు అలా చేశావ్ అని సీతారామయ్య అడిగితే.. చెప్పలేను అని మనసులో అనుకుని సైలెంట్‌గా ఉంటుంది. మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదని కావ్య వెళ్లిపోతుంది. ఇంతలో కావ్య అంటూ యామిని వచ్చి అరుస్తుంది.
ఎందుకొచ్చావ్ అని అడుగుతారు. మా బావ ఎక్కడ, రాజ్ ఎక్కడ, ఎక్కడ దాచిపెట్టారు అని యామిని అడిగేసరికి అంతా షాక్ అవుతారు. రాజ్ రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఏం చేశారు నా బావని అని యామిని అంటే.. కావ్య అన్నమాటలకు ఎక్కడికో వెళ్లిపోయినట్లున్నాడు. అసలు ఏం చేసుకున్నాడో ఏమో అని రుద్రాణి అంటుంది. ఏంటీ కావ్య నా మీద కోపంతో రాజ్‌ను ఇలా చేస్తావా అని రివర్స్‌లో వార్నింగ్ ఇస్తుంది.
నా రాజ్‌కు ఏమైనా కావాలి ఏ ఒక్కరిని వదిలిపెట్టను. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాను అని యామిని అంటే.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్లు రాలగొడతాను. ఎవరు ఎవరికి ఇవ్వాలి. వాడు నా బిడ్డ. మోసం చేసి తీసుకెళ్లింది నువ్వు. కేసు పెట్టాల్సింది మేము. వాడు నా కొడుకు అని నిరూపించడానికి మాకు క్షణం పట్టదు. నీతో చిప్పకూడు తినిపించమంటావా. వాడికి ఏం కాకూడదని నువ్వు మొక్కుకో. వెళ్లు ఇక్కడి నుంచి అని యామినిపై రివర్స్‌లో తగులుకున్న అపర్ణ వార్నింగ్ ఇస్తుంది.
అపర్ణ యొక్క హెచ్చరిక
చూస్తాను ఏం చేస్తారో అని యామిని వెళ్లిపోతుంది. యామినిపై ఎందుకు అరిచావ్ వదినా. రేపు రాజ్ తిరిగొస్తే వెళ్లేది యామిని దగ్గరికే. అప్పుడు ఇక్కడ జరిగింది చెబితే. అప్పుడు మన గురించి ఏమనుకుంటాడు. రాజ్ అసలు ఏం చేసుకున్నాడో అని భయంగా ఉందని రుద్రాణి అనేసి వెళ్లిపోతుంది. కావ్య భయంతో వెళ్లిపోతుంది. రాజ్ ఎక్కడికి వెళ్లాడో ఎంక్వైరీ చేస్తానని అప్పు అంటుంది.
అంతా కావ్యను నిందిస్తారు. రాజ్ ఫొటో పట్టుకుని కావ్య ఏడుస్తుంది. వెంటనే తిరిగిరండి. నన్ను క్షమించండి అని కావ్య అంటుంది. ఆ మాటలు అపర్ణ, ఇందిరాదేవి వింటారు. ముందు నిన్నే లవ్ ప్రపోజ్ చేయమంటే పుణ్యకాలం కాస్తా పూర్తయ్యేలా చేశావ్. వాడి మనుసు ఎంత గాయపడిందో. దీనంతటికి కారణం నువ్వేనే అని కావ్యను అంటుంది అపర్ణ.
దాంతో అత్తయ్య అంటూ అపర్ణను హత్తుకుని ఏడుస్తుంది కావ్య. దాంతో ఇందిరాదేవి ఓదారుస్తుంది. ఇప్పుడు చేయాల్సింది నా మనవడు ఎక్కడున్నాడో కనుక్కోవడం అని చెబుతుంది. ఎలా పట్టుకోవాలో తెలియట్లేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది అని కావ్య అంటుంది. ఎవరింటికి వెళ్లకుండా, రాత్రి యామినికి దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లి ఉంటాడే అని అపర్ణ కంగారుగా అంటుంది.
ఇంతలో కావ్యకు రేవతి కాల్ చేస్తుంది. రాజ్ ఇక్కడే ఉన్నాడు. రాజ్ ఇంట్లో క్షేమంగా ఉన్నాడు. నువ్ త్వరగా రా అని రేవతి చెబుతుంది. దాంతో కావ్య సంతోషిస్తుంది. వెంటనే వెళ్లి అత్తయ్య ఆయన దొరికారు. వాళ్ల అక్క దగ్గరే ఉన్నారట అని కావ్య రేవతి గురించి నోరు జారుతుంది. అక్క దగ్గర ఉండటం ఏంటే. ఎవరా అక్క అని అపర్ణ అడుగుతుంది.
రేవతి గురించి కావ్య వెల్లడి
కావ్య రేవతి గురించి చెప్పబోతుంటే ఇందిరాదేవి ఆపుతుంది. రేణు అక్క అని కావ్య ఫ్రెండ్ అని చెప్పి కవర్ చేస్తుంది. హడావిడిగా కావ్య వెళ్తుంది. అది చూసిన రుద్రాణి రాజ్ ఏమైనా చేసుకున్నాడా ఏంటీ. అలా జరిగితే పంట పండినట్లే. ఆస్తి అంతా మాకే దక్కుతుంది అని రుద్రాణి అనుకుంటుంది. కావ్య కంగారుగా వెళ్లడం చూసిన ఇంట్లోవాళ్లు ఏమైందని అనుకుంటారు.
మళ్లీ ఏ చెడు వార్త తీసుకొస్తుందో అని రుద్రాణి అంటుంది. దాంతో ఇందిరాదేవి నోర్మూయ్. ఒక్క మంచి మాట రాదా. పైన తథాస్తు దేవతలు తథాస్తు అని నా మనవడికి ఏమైనా జరిగితే కూతురువి అని కూడా చూడని అని తిడుతుంది ఇందిరాదేవి. రేవతి ఇంటికి వెళ్లిన కావ్య రాజ్‌ను కట్టుతో చూస్తుంది.
ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు సరిపోయిందా. యామిని చెప్పేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని కావ్య అరుస్తుంది. నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని నిన్న అలా మాట్లాడారు. ఎందుకు అని రాజ్ అంటే కావ్య అలాగే ఉండిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరిగా, రాజ్ అదృశ్యం మరియు అతని కోసం జరుగుతున్న వెతుకులాట కథానాయిక కావ్యను ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. ఈ ట్విస్ట్‌లు భవిష్యత్తు ఎపిసోడ్స్‌కు ఆసక్తిని పెంచుతాయి.


