
📌 Key Points
- ఆఫీసులో డిజైన్ల దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న రాజ్, కావ్య.
- రాహుల్ పరువు కాపాడేందుకు ఎమోషనల్ అయిన స్వప్న రాజ్‌ను ఒప్పించింది.
- అప్పు అనుకొని ప్రకాశంతో సరసాలు ఆడబోయి షాకైన కల్యాణ్.
- కష్టాల్లో ఉన్న కల్యాణ్‌కు ఊహించని రీతిలో ప్రకాశం అండగా నిలిచాడు.
బ్రహ్మముడి డిసెంబర్ 16 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. రాజ్, కావ్యలు చాకచక్యంగా ఇంటి దొంగను పట్టుకున్నారు. మరోవైపు రాహుల్ పరువు నిలబెట్టేందుకు స్వప్న చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. అలాగే, కల్యాణ్‌కు ప్రకాశం ఊహించని సాయం చేసి ఆదుకున్నాడు. ఈ ఎపిసోడ్‌లోని పూర్తి విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
ఇంటి దొంగను చాకచక్యంగా పట్టుకున్న రాజ్, కావ్య
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (డిసెంబర్ 16) ఎపిసోడ్ లో ఇంటి దొంగను రాజ్, కావ్య పట్టుకుంటారు. అటు అందరి ముందూ రాహుల్ పరువు పోకుండా స్వప్న కాపాడుతుంది. ధాన్యం నుంచి కల్యాణ్ ను ప్రకాశం రక్షిస్తాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 905వ ఎపిసోడ్ మొత్తం ఉత్కంఠగా సాగింది. రాజ్, కావ్యలకు రాహుల్ షాకివ్వడం, ఎమోషనల్ అయిపోయిన స్వప్న అతన్ని రాజ్ నుంచి రక్షించడం, అటు అప్పు విషయంలో కల్యాణ్ ను తండ్రి ప్రకాశం ఆదుకోవడం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇంకా ఏం జరిగిందో చూడండి.
అంజలి బతికే ఉందన్న అప్పు.. సీఐని కన్విన్స్ చేసి..
రాజ్, కావ్యలకు షాక్ ఇచ్చిన రాహుల్
రాహుల్‌ను కాపాడిన స్వప్న త్యాగం
రాజ్ చేతుల మీదుగా అవార్డు
కల్యాణ్‌ను కాపాడిన ప్రకాశం
అప్పు వచ్చేసిందనుకొని కల్యాణ్ ఊపిరి పీల్చుకుంటాడు. తాను తినిపిస్తానని, నువ్వు వెళ్లు అని తల్లిని పంపించేస్తాడు. ఆ తర్వాత అక్కడుతున్నది ప్రకాశం అని తెలియక బెడ్ పైకి వెళ్లి సరసాలు ఆడతాడు. అప్పుడే ప్రకాశం లేవడంతో అతన్ని చూసి కల్యాణ్ షాక్ తింటాడు.
కల్యాణ్‌కు ప్రకాశం ఊహించని సాయం
రాజ్‌ను ఆపిన కావ్య.. నిందించిన రాజ్
అప్పుడే స్వప్న ఎమోషనల్ అవుతూ రాజ్ ముందుకు వస్తుంది. ఇదంతా నీ వల్లే సాధ్యమైందని రాజ్ ను పొగుడుతుంది. తన భర్తకు ఈ విలువ కోసమే తాను ఎదురు చూశానని, ఇక నుంచి మీ మాట నిలబెడతాడని, కష్టపడి పని చేసి ఎదుగుతాడని స్వప్న కంటతడి పెడుతూ రాజ్ తో అంటుంది. ఆమె మాటలు విన్న రాజ్ రాహుల్ ను నిలదీయడాన్ని విరమించుకుంటాడు.
మరోవైపు ఆఫీసులో ఆ డిజైన్లను రాహుల్ కు చేరవేస్తున్న దొంగను పట్టుకోవడానికి రాజ్, కావ్య ప్లాన్ చేస్తారు. ఆఫీసులో అందరినీ నిలదీస్తారు. వాళ్లందరి ముందే కావాలని కొత్త డిజైన్లు తమ క్యాబిన్ లో పెడుతున్నామని కావ్య అంటుంది. ఆ డిజైన్లను దొంగిలిస్తుండగా దొంగను రాజ్, కావ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి డిసెంబర్ 16 ఎపిసోడ్ ఎమోషన్లు, సస్పెన్స్‌తో నిండిపోయింది. రాజ్, కావ్య చాకచక్యంగా దొంగను పట్టుకోవడం, స్వప్న రాహుల్‌ను కాపాడటం, కల్యాణ్‌కు ప్రకాశం సాయం వంటి కీలక ఘట్టాలతో ఈ భాగం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తదుపరి ఏం జరుగుతుందో చూడాలి.


